కడప

కలివికోడి ఆచూకీ కోసం కెమెరాలు ఏర్పాటు: రేంజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, సెప్టెంబర్ 8:లంకమల అభయారణ్యంలో కలివికోడి ఆచూకీకోసం త్వరలో మళ్లీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని సిద్దవటం రేంజర్ దినేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన అటవీశాఖ కార్యాలయంలో గురువారం సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దవటం రేంజ్‌కు 50 రాఫిల్‌డ్యామ్‌లు, 15చెక్ డ్యామ్‌లు ఉన్నాయన్నారు. ఎవరికి కేటాయించిన పనులు వారు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీశాఖ కార్యాలయం వద్ద ఉన్న చెక్‌పోస్టును త్వరలో కపర్థీశ్వర కోన వద్ద భవన నిర్మాణం పూర్తయిన వెంటనే తరలించనున్నామని ఆయన పేర్కొన్నారు. అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.