కడప

16,17న గండికోట వారసత్వ ఉత్సవాలు : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 23: గండికోట వారసత్వ ఉత్సవాలు అక్టోబర్ 16,17వ తేదీల్లో గండికోటలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కెవి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో గండికోట ఉత్సవాల నిర్వహణకు ఏర్పిటుచేసిన కమిటీలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, వైభవం, సాహిత్యం ఉట్టిపడే విధంగా గండికోట వారసత్వ ఉత్సవాలు నిర్వహించేందుకు వివిధ కమిటీల సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గండికోట వారసత్వ ఉత్సవాల్లో జాతీయస్థాయి, రాష్టస్థ్రాయి, జిల్లాస్థాయిలో పేరుపొందిన కళాకారులతో రెండురోజులు కార్యక్రమాలు ఉంటాయన్నారు. శాస్ర్తియ, కూచిపూడి, భరతనాట్యం , సంప్రదాయ, సాంస్కృతిక కళారూపాలతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవ ప్రాజెక్టులపై కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో ప్రచారం కల్పించేందుకు కళారూపాలతో బహిరంగ ప్రదర్శనలు జరుగుతాయన్నారు. భావితరాలకు కూడా జిజ్ఞాస కలిగించే విధంగా గండికోట వారసత్వ ఉత్సవాలు రెండురోజులపాటు నిర్వహిస్తామన్నారు. అలాగే జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వపోటీలను నిర్వహించాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు గాను ఏర్పాటుచేసిన రిసెష్షన్ కమిటీ, కల్చరల్ కమిటీ తదిర కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా ముషాయిరా, ఖవ్వాలి కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ విజయకుమార్, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ఆర్‌డి గోపాల్, ఆర్డీవోలు , తదితరశాఖల అధికారులు పాల్గొన్నారు.