చిత్తూరు

కలిగిరి కొండపై పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమూరు, అక్టోబర్ 15: కలిగిరి కొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ శనివారం భక్తులతో పోటెత్తారు. దీంతో సుప్రభాత సేవనుంచే ప్రత్యేక పూజలు అందుకుంటున్న శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలతో పూజలు చేసారు. అనంతరం పల్లకిసేవపై కలిగిరి వెంకటేశ్వరస్వామిని ఆలయ మాడ వీధుల్లో బాణాసంచాలు పేల్చుతూ ఊరేగింపు చేపట్టారు. ఈకార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ ఈశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందుకు ఉభయదారులుగా మొరవకండిగ గ్రామానికి చెందిన విశ్వనాథనాయుడు, రాధానాయుడు, సిద్దయ్యనాయుడు, రఘునాథయ్య, కుమారస్వామి, దొరస్వామి, సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులు స్వామివారికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఐదవ శనివారం పూతలపట్టు, పెనుమూరు, పాకాల, చిత్తూరు రూరల్, బండపల్లి తదితర గ్రామాల నుంచి ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు కట్టమంచికి చెందిన వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, ఎంపిపి హరిబాబునాయుడు, సర్పంచ్ కృష్ణమూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.