కడప

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే టిడిపి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 14: 2017 మార్చి మాసంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు గెలిపించుకునేందుకు చిన్నబాబు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చర్యలు చేపట్టారు. జిల్లాలో టీడీపీ కేడరున్న ఏ ఒక్క నేత ఆధిపత్య పోరుతో అభ్యర్థులు ఓటమి చవిచూస్తే దండన తప్పదని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో నేతల ఆధిపత్యపోరుతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అయితే గతంలో దివంగత నేత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టి రామారావు ఆశయాలకు అనుగుణంగా మనువడు నారా లోకేష్‌బాబు జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలు విజయబావుటా ఎగురవేయడానికి లోకేష్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే లోకేష్‌బాబు తన సొంత కేడర్ ద్వారా జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకొని జిల్లా నేతలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికార దాహంతో వలస వచ్చిన నేతలు ఆధిపత్యపోరు నెలకొన్న నియోజకవర్గాలలో లోకేష్‌బాబు ప్రత్యేక దృష్టిని పెట్టారు. అయితే ఈ ఎన్నికలలో రెండు ఎమ్మెల్సీలు దక్కని పరిస్థితులల్లో జిల్లా నేతలు తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని 2019 ఎన్నికల నాటికి పార్టీ టికెట్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పనిచేసే నేతలకే ఇచ్చేందుకే లోకేష్‌బాబు తన సొంత అజెండాను తయారుచేసుకొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు ఎన్నికల చివరి వరకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎంత మంది ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధ్భూమిలో నిలుస్తారో ఆ కాలమే నిర్ణయించాల్సి ఉంది.