సబ్ ఫీచర్

మాతృభాషకు మనుగడ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం సుమారు ఏడువందల సంవత్సరాల కాలం విదేశీయుల పాలనలో పలురకాల పీడనలకు గురైనందున గురుకుల వ్యవస్థ ఛిద్రమైంది. విదేశీయ పాలకులు ఎన్ని దురాగతాలు, మతం మార్పిడులు, హ త్యలు, అణచివేత విధానాలను అనుసరించినా హిందూ సనాతన ధర్మం నేటికీ సజావుగా జీవించి ఉంది. బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యం భారతదేశంలో పతనం కాకుండా ఉండాలంటే ఇక్కడి ధర్మాన్ని, సంస్కృతిని కూకటివేళ్ళతో పెకలించడం ఒక్కటే మార్గం అనుకున్నారు. విద్యావ్యవస్థను కలుషితం చేయడమే సరైన మార్గమని బ్రిటిష్ మేధావి లార్డ్ మెకాలే భావించాడు. విద్యావిధానంలో సరికొత్త మార్పులు తెచ్చి చక్కదిద్దుతామనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లీషు చదువులను ప్రవేశపెట్టింది. తమకు అనుకూలంగా ఉండే పెద్ద మనుషులకు బిరుదులిచ్చి వా రిని తమ తొత్తులను చేసుకుంది. దీంతో ‘ఇంగ్లీషు చదువులు చదివితే మనకే లాభం కదా!’ అని మన మేధావులు సైతం అనుకున్నారు. ఒకప్పుడు సంస్కృతం రాజభాషగా ఉండేది. అయినా ప్రాదేశిక భాషలు అభివృద్ధి చెందేవి. సంస్కృతం మృతభాష అయ్యాక ప్రాదేశిక భాషలు నిరాదరణకు గురయ్యాయి. సంస్కృత భాష స్థానాన్ని ఇంగ్లీషు భాష కైవసం చేసుకుంది. ప్రఖ్యాత సంఘ సంస్కర్త రాజా రామ్‌మోహన్ రాయ్ సైతం కలకత్తాలో సంస్కృత కళాశాల అవసరం లేదని, సైన్సు కాలేజీ అవసరం ఉందని సంస్కృత కళాశాలను అడ్డుకున్నాడు. ఆనాటి మన మేధావులు సైతం మెకాలే ఉచ్చులో ఎలా పడ్డారో ఇలా అవగతమవుతుంది.
ఏ సమాజమైనా సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలం టే మనదైన భాషలో విద్యాబోధన జరగాలి. ఈనాడు 90 శాతం మంది విద్యార్థులు మాతృభాషలో తప్పులు లేకుండా ఉత్తరం కూడా వ్రాయలేరు. ఇంగ్లీషులోనూ వ్రాయలేరు. అంటే వీరు రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. ఇంగ్లీషు పరిజ్ఞానం లేకుంటే ప్రపంచంలో రాణించలేం అనుకోవడం భ్రమే కాదు మూర్ఖత్వం కూడా. రష్యా, చైనా, జపానుల్లో ఇంగ్లీషు భాష ఎందరికి వచ్చు? ఆ దేశాలు అభివృద్ధి చెందలేదా? సంస్కృత భాషలో ఉన్న విజ్ఞానం మరేయితర భాషలలోనూ లేదని విదేశీయులే అంగీకరిస్తున్నారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ‘మనం ఒక నూతన దేశాన్ని నిర్మించుకోవలసి ఉంద’ని ప్రకటించాడు. దీని వెనుక బ్రిటిష్ వారి కుట్ర నిగూఢమై ఉంది. ‘్భరతదేశంలో, భారతీయులలో నేనొక నూతన జాతిని నిర్మించబోతున్నాను. ఆ నూతన జాతి- భారతీయులే అయినా వారు బుద్ధిలో, ఊహల్లో, ఆచరణలో ఆంగ్ల మానసపుత్రులుగా జీవిస్తారు’- అని ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేస్తూ ఉండిన లార్డ్ మెకాలే తన వ్యూహరచన గురించి చెప్పాడు. అప్పటివరకు మన దేశీయ విద్య కొనసాగుతూ ఉండేది. దాన్ని నిర్లక్ష్యం చేసి, ఒక నూతన విద్యావిధానాన్ని రూపొందించారు. తమ సామ్రాజ్యాన్ని నిలుపుకునేందుకు వీలుగా దాన్ని బ్రిటిష్ పాలకులు రూ పొందించారు. ఆంగ్లేయుల కుట్ర పూరితమైన ఆ స్వప్నాన్ని నిజం చేయాలనుకున్న మొదటి ‘ఆంగ్లేయుల మానస పుత్రుడు’ మన జవహర్‌లాల్ నెహ్రూ. పాశ్చాత్య భావదాసులై ఆత్మవిశ్వాసం కోల్పోయిన మన మేధావులు విదేశీయుల సిద్ధాంతాలను స్వీకరించి వారు రచించిన పరాభవ చరిత్రే మన చరిత్రగా భావిస్తూ ప్రజల ఉత్సాహ దిశను, ఉద్యమస్ఫూర్తిని మార్చడానికి ప్రయత్నించారు. విద్యావిధానంలో మార్పులు వస్తాయని, రావాలని ప్రజలు కూడా ఆశించకపోవడం మరొక దౌర్భాగ్యం.
స్వాతంత్య్రం సిద్ధించాక ప్రతి ప్రభుత్వం, ప్రతి విద్యాశాఖ మంత్రి మన విద్యావిధానం లోపభూయిష్టంగా ఉందని అంగీకరిస్తూ, మార్పు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక మంత్రి తనకు తోచిన మార్పు తీసుకురావాలనుకుంటాడు. అది ఫలించకమునుపే ఆ మంత్రి స్థానంలో వేరొకరు వస్తారు. ఎవరూ లోపాల మూలాలలోకి వెళ్ళే ప్రయత్నం చేయరు. త్రిభాషా ఫార్ములా, బడుల్లో మధ్యాహ్న భోజనాలు, వర్క్‌టు ఎడ్యుకేషన్, సర్వశిక్షా అభియాన్ ఇవేవీ సమగ్రమైనవి కావు. అరకొర ప్రయత్నాలు చేస్తూ తలోదిశగా వెళ్తూ విద్యావిధానాన్ని గంపకోళ్ళ కషాయంగా మార్చారు. మరోవైపు కార్పొరేట్ జగత్తు విద్యావ్యాపారం లాభసాటిదని గ్రహించి ఈ రంగంలో ప్రవేశించింది. వసతులు, ఉపకరణాలు, అర్హతలున్న బోధకులు లేకున్నా ఇంగ్లీషు మీడియం కానె్వంట్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు నెలకొల్పుతున్నారు. ‘మీ అబ్బాయి ఇంగ్లీషు మీడియంలో చేరితే అమెరికాకు విమానం టిక్కట్టు తథ్యం, మీ ఇంట్లో డాలర్ల వర్షం ఖాయం..’అని ప్రలోభపెడుతున్నారు. వారి మాటలకు మోసపోతున్న ప్రజలకు మాత్రం మాతృభాష దుస్థితి కనిపించడం లేదు.
నేడు ప్రాథమిక, మాధ్యమిక విద్యలను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఈనాడు గురువుల లక్ష్యం ఒకలాగుంటే, శిష్యుల ధ్యేయం మరోలాగుంది. నేటి విద్యావిధానంలో విద్యార్థులు క్షయం లేని విద్యార్జన చేస్తున్నారో లేదో కానీ, విద్యాసంస్థలు మాత్రం అక్షయమైన ధనార్జన గావిస్తున్నాయనడంలో సందేహం లేదు. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలలోని మత గురువులను ఉద్దేశించి- ‘్ధనార్జన గురువుల లక్ష్యమైతే, పదజాలంతో మెదడును నింపుకోవడం శిష్యుల ధ్యేయమైంది. ఇలాంటి గురుశిష్యుల సంబంధం వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేదు’. అన్నారు. ఈ పరిస్థితి పాశ్చాత్య దేశాల్లోనే కాదు, భారత్‌లోను కొనసాగుతోంది. ధన సేకరణే ధ్యేయమని భావించే గురువులు, విషయ సేకరణే విద్య అని భ్రమించే శిష్యులు ఉన్నంతవరకు సమాజంలో సచ్చీలత, పవిత్రత, సత్యం, నిస్వార్థం లాంటి విలువలకు ప్రాధాన్యం కొరవడుతోంది.
దేశంలో ప్రస్తుత పరిస్థితులకు ఉపాధ్యాయులనొక్కరినే బాధ్యులను చేయడం వారికి ద్రోహం చేయడమే అవుతుంది. గురువుల పట్ల విద్యార్థుల్లోనూ భక్తిశ్రద్ధలు లేవు. పిల్లలకు నైతిక విలువలను బోధించకపోవడమే విద్యాప్రమాణాలు పడిపోవడానికి మూలకారణం.
విద్యాబోధనను మెరుగుపరచాలంటే ప్రాథమిక, మాధ్యమిక విద్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. విశ్వవిద్యాలయాలు, వృత్తికళాశాలలు పరిమితంగా ఉంటే చాలు. మాతృభాషలో గ్రహణశక్తి అధికంగా ఉంటుంది. తనదికాని భాషలో చెప్పినది విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టం. వెనకటి రోజుల వలే దేశీయ భాషల్లోనే పదవ తరగతి లేదా పనె్నండవ తరగతి వరకు విద్యాబోధన జరగాలి. ఆరేడు తరగతుల నుంచి ఇంగ్లీషును ప్రవేశపెట్టాలి. పనె్నండవ తరగతి తరువాత తాను ఏ కోర్సు చదవాలో విద్యార్థి నిర్ణయించుకుంటాడు. అంతవరకు ఇంగ్లీషు మాధ్యమంలో చదువు విద్యార్థికి అనవసరమని గుర్తించాలి. మంచి వసతులు, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతో పాటు నైతిక విలువలను తెలియచెప్పే పాఠ్యాంశాలు ఉంటే ఆ చదువులు అలనాటి గురుకులాల మాదిరి ఉంటాయి. అందరికీ సులువుగా విద్యనందించడానికి ఇపుడున్న సౌకర్యాలు సరిపోవు. మారుమూల ప్రాంతాల్లోని బడుగువర్గాల బాలల కోసం వీలైనన్ని ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇవికూడా అన్ని సౌకర్యాలతో సుసంపన్నం కావాలి. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలి. ఈ పాఠశాలలు తమ కోసమేనన్న భావనను పిల్లల లేతమనసుల్లో నాటాలి. మాతృభాషలో విద్య అంటే వారు ఉత్సాహం చూపిస్తారు. ఈ పాఠశాలల్లో ఉచిత వసతి, భోజనం ఉంటే ఇవి పురాతన గురుకులాల్లా పనిచేయగలవు. ఇప్పటికే విద్య విషయంలో మనం 70 ఏళ్లు జాప్యం చేసి వెనకపడ్డాము. ఇంగ్లీషు భూతాన్ని పిల్లల మనసుల్లోంచి గెంటివేయాలి.

- గుమ్మా ప్రసాదరావు