ఫోకస్

దివాలాకోరు ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి క్షణం నుండి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులంతా తమకు ఉన్నత విద్య దొరుకుతుందని భావించారు. తాముకూడా ఉన్నత విద్యకు అర్హులం అవుతామని కలలు కన్నారు. ఆ సమయంలోనే కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్య తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించగానే విద్యార్ధులు, యువకులు, కార్మికులు, రైతులు, కర్షకులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. కాని ప్రభుత్వ నిర్ణయాలు చూస్తే ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అందలం ఎక్కించడం కోసమే పనిచేస్తోందని అనిపిస్తోంది. అందులో భాగంగానే సాక్షాత్తు స్ర్తిమూర్తులు పాఠశాల ఫీజుల విషయంలో రోడ్డెక్కినా ప్రభుత్వం నేటికీ స్పందించలేదు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ ఇంజనీరింగ్ ఫీజులను పెంచి పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను దూరం చేసింది. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో లాఠీదెబ్బలకోర్చి, కేసుల కోర్చి రాష్ట్ర సాధనలో భాగమైన విశ్వవిద్యాలయ విద్యార్థులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది. వసతుల కొరత, నిధుల లేమి, లెక్చరర్ల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేసి విజ్ఞాన నిలయాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలను పతన స్థితికి చేర్చి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనం. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆలోచనలు పక్కన పెట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా ప్రైవేటు వర్శిటీలను ఏర్పాటు చేస్తే ఏ విద్యార్థులైతే తెలంగాణ ఆవిర్భావానికి అంకితభావంతో కృషి చేశారో, అదే విద్యార్థులు ప్రభుత్వాన్ని గద్దెదింపడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు యూనివర్శిటీలు అవసరం అనే దివాలాకోరు ఆలోచనలను మాని ప్రభుత్వ వర్శిటీలకు వౌలిక వసతులు, సిబ్బంది నియామకం, బోధనేతర సిబ్బంది నియామకం, లైబ్రరీలు, ల్యాబ్‌లు, బాలికలకు ప్రత్యేక వసతులు, బోధన సిబ్బంది వసతులు, హాస్టళ్లు నిర్మించాలి.

- జవ్వాది దిలీప్, ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు