S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్ సరసన అమీ

ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్, ఈ సినిమా తరువాత ఆయన చేసే మరో చిత్రానికి సన్నాహాలు పూర్తికావచ్చాయి. అక్టోబర్‌తో ‘బాహుబలి’ సినిమా షూటింగ్ పూర్తవగానే ప్రభాస్ నెక్ట్స్ సినిమా నవంబర్‌లో మొదలుకానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో బ్రిటన్ భామ అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోందట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అమీ జాక్సన్ రజనీకాంత్ సరసన ‘రోబో-2’ చిత్రంలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల చేస్తారట. మొత్తానికి అమీ జాక్సన్ క్రేజీ హీరోల సరసన మంచి ఛాన్సులు దక్కించుకుంటోంది.

కోడి రామకృష్ణ కొత్త ప్రయోగం?

అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలతో విజువల్ ఎఫెక్ట్‌తో ఈతరం ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్నాడు కోడిరామకృష్ణ. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేస్తోన్న ఓ అతిపెద్ద సాహసం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇండియన్ సినిమాలోనే ఈ తరహా విజువల్ ఎఫెక్ట్స్ వాడడం మొదటిసారిగా ప్రచారం జరుగుతోంది. కోడి రామకృష్ణ ప్రస్తుతం కన్నడలో ‘నాగరహవు’ అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ దివంగత విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తెరపై ఆవిష్కరిస్తున్నారు.

‘స్ప్లిట్‌విల్లా 9’

ముంబైలోని ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే రియాల్టీషో ‘స్ప్లిట్‌విల్లా 9’ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ తార
సన్నీలియోన్

మహామంత్రిపై అమిత్‌షాకు నివేదిక

న్యూదిల్లి:అక్రమంగా భూములు ఆక్రమణ, అధోజగత్తు నాయకుడు దావూద్ ఇబ్రహీంకు ఫోన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర సీనియర్ మంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సెపై ‘వాస్తవాల’తో కూడిన నివేదికను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సమర్పించానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. రెండు కుంభకోణాల్లో మంత్రి పాత్రపై ఇరువరు నేతలూ సుదీర్ఘంగా చర్చించారు.

నైజీరియా రాయబారిగా నాగభూషణ్‌రెడ్డి

న్యూదిల్లి:నైజీరియాలో భారత రాయబారిగా బి.నాగభూషణ్‌రెడ్డి నియమితులయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగభూషణ్ రెడ్డి తెలుగువాడు. రాష్ట్రానికి చెందిన ఈ ఐఎఫ్‌ఎస్ అధికారి ఉన్నత పదవిలో నియమితులవడంపట్ల తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాబు చెప్పేవన్నీ అబద్ధాలే:జగన్

అనంతపురం:నవనిర్మాణ దీక్ష సందర్భంగా అవినీతిలేని పాలన అందిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగం అంతా అబద్ధాలపుట్ట అని వైకాపా అధినేత వై.ఎస్.జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా తాడిప్రతిలో రైతు భరోసాయాత్రలో ఆయన రైతులను కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.

తెదెపాలో వైకాపా ఎమ్మెల్యే

విజయవాడ:వైకాపాకు మరో గట్టిదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా కందుకూరు శాసనసభ్యుడు పోతూరు రామారావు గురువారంనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు టిడిపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

వెలుగు జిలుగుల తెలంగాణ

హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్ ప్రాంతంతో సహా ముఖ్యమైన కూడళ్లన్నీ రంగురంగుల విద్యుద్దీపాలు, లేజర్‌షోలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలను అందంగా అలంకరించారు. పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించి ప్రదర్శిస్తున్నారు. ప్రజలకూడా పెద్దఎత్తున ఇందులో పాలుపంచుకుంటున్నారు.

రాహుల్‌కోసం ఓ మెట్టుదిగుతాం : షీలాదీక్షిత్

న్యూదిల్లి:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకురాలు షీలాదీక్షిత్ మద్దతు తెలిపారు. సోనియా స్థానంలో రాహుల్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆమె సూచించారు. రాహుల్ బృందంలో యువనేతలకు స్థానం కల్పించేదుకు పార్టీలోని సీనియర్లు వివిధ బాధ్యతలనుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. యువకుడిగా రాహుల్ కొన్ని తప్పిదాలు చేసినా, వాటినుంచి పాఠాలు నేర్చుకున్నారని, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ఇది సరైన సమయమని షీలా అన్నారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్:నగరంలోని ఎల్‌బినగర్ ప్రాంతంలో ఎఫిడ్రిన్ అనే మత్తుమందును భారీస్థాయిలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ మార్కెట్‌లో రూ. 5 కోట్లవరకు ఉంటుంది. ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు.

Pages