S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దురలవాట్లను మాన్పించే బ్రేస్‌లెట్

కొంతమందికి గోళ్లు కొరకడం అలవాటు. ఇంకొందరికి చీటికీ మాటికీ జుత్తు సవరించుకోవడం అలవాటు. మరికొందరికి అదే పనిగా నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు. ఇవన్నీ ఓ విధంగా దురలవాట్లే. చిన్నతనంలో చేసుకున్న అలవాటును పెద్దయినా మానలేకపోవడంతో చూసేవారికి ఈ అలవాటు ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీనిని అరికట్టేందుకు మార్కెట్లోకి ఓ బ్రేస్‌లెట్ వచ్చింది. దీని పేరు లివ్ (జని). దీనిని ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే యాప్‌తో అనుసంధానిస్తారు. ఈ బ్రేస్‌లెట్‌ను చేతికి పెట్టుకుంటే...ఏమరుపాటులో దురలవాటును కొనసాగించబోయినా వెంటనే వైబ్రేషన్స్ ద్వారా హెచ్చరిస్తుంది.

పిజా హట్‌లో రోబో పాగా

రోబోల కాలమిది. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు.... ఎందెందు వెతికిన రోబోలు అందందే కలవు. ఇప్పుడు పిజా హట్‌లు కూడా కావేవీ మా ప్రవేశానికి అనర్హం అన్నట్లు అక్కడ డెలివరీ బాయ్స్‌కు కూడా రోబోలు ఎసరు పెట్టేస్తున్నాయి. అసలు సంగతి ఏ మిటంటే...త్వరలో పిజా హట్‌లలో కస్టమర్లకు పిజాలు డెలివరీ చేసేందుకు రోబోలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పెప్పర్ అనే రోబో తయారైంది. కస్టమర్ల వద్దకు వచ్చి, ఆర్డర్ తీసుకోవడం, తమ పిజా హట్‌లో తయారైన వాటి గురించి వివరించడం వంటివన్నీ మరొకరి సాయం లేకుండా పెప్పర్ స్వయంగా చేసేస్తుందట. అంతెందుకు...చివరకు బిల్లు కూడా స్వయంగా వసూలు చేస్తుందట.
*

మోహినీ అవతారం

ప్రస్తుతం దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల భామ త్రిష. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈమె, తాజాగా నటించిన ‘నాయకి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైంది. త్రిష మరోమారు ప్రేక్షకులను భయపెట్టనుందట. తాజాగా మరో హర్రర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. మధురై ఫేం ఆర్.మాదేశ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈరోజు లండన్‌లో ప్రారంభమైందట. వైవిధ్యభరిత కథతో హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి ‘మోహిని’ అనే టైటిల్ పెట్టారు.

గుణశేఖర్ ప్రతాపరుద్ర

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక చారిత్రక కథను సినిమాగా ఆవిష్కరించాలని గుణశేఖర్ చేసిన ప్రయత్నానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచే కాక సినీ పరిశ్రమనుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తన కల ‘రుద్రమదేవిని’ని తెరపై ఆవిష్కరించిన గుణశేఖర్, అందుకు సీక్వెల్‌గా ‘ప్రతాపరుద్రుడు’ అనే సినిమాను కూడా సిద్ధం చేయనున్నట్లు అప్పట్లో తెలిపారు. ఈమధ్యే గుణశేఖర్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పరిశోధన కూడా మొదలుపెట్టేశారు.

పక్కాప్లాన్‌తో హారర్ చిత్రం

శ్రీ వేంకటేశ్వర సినీ పిక్చర్స్ పతాకంపై నాగేష్.సిహెచ్. నిర్మాతగా బేబి దివ్యప్రియ సమర్పణలో ఎ.వి.్ఫణిశ్వర్ (తుఫాన్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పక్కా ప్లాన్’. సుభాష్, నాగేష్, భవానీ, యువరాణి ప్రధాన పాత్రల్లో నటిస్తన్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ జరిగింది.

రాణిగారి బంగళా సిద్ధం

ఆనంద్ నందా, రేష్మి జంటగా వి సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధంచేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు డి.దివాకర్ మాట్లాడుతూ- ఈ సినిమా కోసం అనేక రకాల పేర్లు అనుకున్నా, కథప్రకారం ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని నిర్ణయించామని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు.

మరో వారసుడితో సుకుమార్

పరిశ్రమలో దర్శకులు నిర్మాతలు తమ తమ బంధువులను, వారసులను పరిశ్రమకు పరిచయం చేయడం షరా మామూలే. ఈసారి ఈ లిస్టులో దర్శకుడు సుకుమార్ కూడా చేరారు. ఇప్పటికే ఆయన ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలు రూపొందిస్తున్నారు. తన అన్న కొడుకు అశోక్‌ను కథానాయకుడిగా చేసి త్వరలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు సుకుమార్. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు హరిప్రసాద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈనెల 9 నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దర్శకుడు అనే పేరును పరిశీలిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా ఈషా నటించనుంది.

టీజర్‌లో అమెజాన్ యోధులు

ప్రముఖ హాలీవుడ్ నటులు రిచాజెన్, సెసిలియా చియాంగ్ జంటగా ఓవర్సీస్ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో జాకీచాన్ నిర్మించిన చిత్రం ‘ది లెజండరీ అమెజాన్స్’. హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చసి భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రాన్ని సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ ‘అమెజాన్ యోధులు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘మాహిష్మతి రాజ్యం’ ఉపశీర్షిక. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జూన్ 2న హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది.

భావోద్వేగాల నాన్న నేను వర్ష

శ్రీ ఓం డి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శబాబు, పావని జంటగా అజ్మీర చందు దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న నేను వర్ష’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ఓ సరికొత్త కథతో ప్రేక్షకులకు ఆసక్తికరమైన కథనంతో భావోద్వేగాల సమాహారంగా మూడు పాత్రలమధ్య ఈ చిత్రం సాగుతుందని, కథానాయకుడు కొత్తవాడైనా ప్రామిసింగ్ హీరో స్థాయిలో నటించాడని చెప్పారు.

Pages