S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిసిన వర్షం..

మహబూబ్‌నగర్, జూన్ 2: జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో గురువారం తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లబడిపోయింది. జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నాయి. రోహిణి కార్తిలో సమృద్దిగా వర్షాలు కురిస్తే వర్షాధార విత్తనాలు విత్తుకుంటే పంటలు అధిక దిగుబడి వస్తాయని రైతుల నమ్మకం. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 32మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ విత్తనాలను తమ పంట పొలాల్లో నాటేందుకు సిద్దం చేసుకుంటున్నారు. నేడో రేపో ఓ భారీ వర్షం కురిస్తే జిల్లా రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు.

ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు

మహబూబ్‌నగర్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన కొండకోనల నడుమ అనే గేయంతో నిర్వహించిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. నిజాలపూర్ గ్రామానికి చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కత్తుల బల్లెం చేతబట్టి అనే పాటతో చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకర్షించాయి.

సమన్వయంతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు

నాగర్‌కర్నూల్, జూన్ 2: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రతి ఇంటికి రెండు ఎల్‌ఇడి బల్పుల పంపిణీ, దీపం పథకం ద్వారా మంజూరైన సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నగరపంచాయతీలో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, ఎఇ, కౌన్సిలర్ల మధ్య సమన్వయం కొరవడిందని, దీనితో మంజూరైన కోట్లాది రూపాయలు ఖర్చు కాకుండా బ్యాంక్‌లలో మూలుగుతున్నాయని అన్నారు.

ఊరూవాడ తెలంగాణ సంబురాలు

మహబూబ్‌నగర్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ సంబురాలు ఊరువాడలో ఘనంగా కొనసాగాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సంబరాలు ఆకాశానంటాయి. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల్, అలంపూర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ పట్టణాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర జిల్లా కేంద్రంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

బంగారు తెలంగాణతోనే జిల్లా సర్వతోముఖాభివృద్ధి

మహబూబ్‌నగర్, జూన్ 2: బంగారు తెలంగాణతోనే మహబూబ్‌నగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ది చెందుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు జిల్లాలోని పేదలందరికి అందుతున్నాయని, దాంతో పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఘనసన్మానం

మహబూబ్‌నగర్, జూన్ 2: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సన్మానించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎస్పీ రేమా రాజేశ్వరి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ఘనంగా సన్మానించారు.

పిల్లలు ఏ వయసులో ఎలా?

పిల్లల్లో గ్రాహ్యశక్తి అధికంగా వుంటుందని, వారిలో పెరుగుదల కూడా ఎక్కువగా వుంటుందనే విషయాన్ని మనం తరచూ వింటుంటాం. ముఖ్యంగా మొదటి పనె్నండు మాసాల్లో ఇవి మరింత అధికంగా వుంటాయి. పిల్లలకు మొదటి సంవత్సరం మాత్రమే కాకుండా తరువాత నాలుగు సంవత్సరాలు కూడా అత్యంత ముఖ్యమైనవే. ఈ నాలుగేళ్ళకాలంలో పిల్లల అభివృద్ధి ఆశ్చర్యం కలిగించే రీతిలో వుంటుంది. ముఖ్యంగా మానసికంగా వారెంతో అభివృద్ధి చెందుతారు. ఐదేళ్ల వయసు వచ్చేసరికి పిల్లల మెదడు ఒక వయోజనుని మెదడు బరువులో 90 శాతం స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ళ వయసు పిల్లల్లో అధికులు దాదాపు 1500 నుండి 2000 వరకు పదాలను అర్థంచేసుకుని ఉపయోగించగలుగుతారు.

- బి.మాన్‌సింగ్

బెల్లం తింటున్నారా...?

బెల్లం రుచికి తియ్యగా వుంటుంది. ఇందులో పోషక పదార్థాలు లభిస్తాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, సెలీనియం, మాంగనీస్ లాంటి పోషక పదార్థాలెన్నో లభిస్తాయి. బెల్లం బంగారపు రంగులో వుంటుంది. ఇది ఎంత ముదురు రంగులో వుంటే పోషక పదార్థాలు అంత పుష్కలంగా లభిస్తాయి. క్యాండీలు, ఐస్‌క్రీములు, చాక్‌లెట్స్, చ్యవనప్రాశలాంటి వాటిల్లో బెల్లాన్ని వాడుతారు. అవాంఛిత రోమాలను తొలగించటానికి ఉపయోగించే వాక్సింగ్‌లో బెల్లం వాడబడుతోంది. ఇంటికి కావలసిన పచారీ సామానులను తెచ్చుకునే జాబితాలో బెల్లం ఉండవలసిందే. ఔషధపరంగా కూడా బెల్లానికి విలువ వుంది.

- కె.నిర్మల

జాకెట్టు... కనికట్టు

చీరకు, ఆ చీర కట్టు కున్న అతివ అందాన్ని దిగ్వీణీకృతం చేసే జాకెట్లు మార్కెట్‌లో రమ్యంగా అలంకరిస్తున్నారు. మగ్గంవర్క్, చేతికుట్టు, కంప్యూటర్ వర్క్, అద్దాలు, ముత్యాలు, పూసలు, బిళ్ళలతో అలంకరించిన జాకెట్లు మగువల మనసులు దోస్తున్నాయ. వర్క్ లేని జాకెట్టు ఈ రోజుల్లో ఎవరూ ఇష్టపడటంలేదు. చీరకి ధీటుగా అందమైన జాకెట్టులు కుట్టించుకుంటున్నారు. వీటికి నప్పే అందమైన లంగా ఓణీ చీరలు సైతం వచ్చాయి. అందమైన డిజైన్‌లతో బట్టలకొట్లల్లో జాకెట్లు దర్శనమిస్తున్నాయి. కుట్టిన జాకెట్లు 250 నుంచి 15 వేల వరకూ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన రాళ్ళ జరీలతో కుడుతున్నారు. జాకెట్‌ను బట్టే మహిళ అందం ద్విగుణీకృతమవుతుంది.

- ఎన్.వాణిప్రభాకరి

కనులు మాటలాడునులే...

‘జీవితకాలపు నేస్తాలు- నేత్రాలు’. మనిషి ఒక జీవితకాలం జీవిస్తే, కళ్ళు రెండు జీవితకాలాలు జీవిస్తాయి. ప్రాణం వదిలే చివరి క్షణాల్లో దానంచేసిన కళ్ళు మరోజీవితో చిరకాలం జీవిస్తాయి. మనకు నిలువుటద్దాలై ‘్ఫలింగ్స్’ని తెలియజేస్తాయి. కళ్ళు అందానికి ప్రతిరూపాలు. కాంతివంతంగా, ఆకర్షణీయంగా ఉంటూ కళ్ళు ఇతరులతో మాట్లాడుతూ మోహించేలాగుండాలి. అన్ని అంగాలలోకి ప్రధానమైన కళ్ళను కలకాలం ఆరోగ్యంగా కాపాడుకోవలసింది పోయి నిర్లక్ష్యం చేస్తుంటారు. కళ్ళ చుట్టూ వున్న చర్మాన్ని చూసి వ్యక్తి వయస్సు చెప్పవచ్చు. కళ్ళ దగ్గర చర్మం శరీరంలో ఎక్కడా లేనంత సున్నితంగా 0.5 మిల్లీ మీటర్ల మందం మాత్రమే వుంటుంది.

- హర్షిత ముసునూరి

Pages