S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిర్యాదుకు వస్తే చితకబాదారు

హైదరాబాద్, జూన్ 1: ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్‌లు వస్తున్నాయంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు చితకబాదడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం నగరశివారులో చోటుచేసుకుంది. వనస్థలిపురంకు చెందిన గోపి అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ గోపి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.

వసూళ్ల తిప్పలు

హైదరాబాద్, జూన్ 1: మహానగర పాలక సంస్థకు మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధికారులు కాస్త ముందుగానే పసిగట్టి, దాన్ని అధిగమించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్‌కు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నును ప్రతి ఆర్థిక సంవత్సరం కేవలం ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనే గాక, ఏడాది మొత్తం కూడా సక్రమంగా వసూలు చేసుకుంటే కలెక్షన్ పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు గుర్తించారు.

ఆస్తిపన్ను డ్రాలో 119 మందికి నగదు బహుమతులు

హైదరాబాద్, జూన్ 1: ఆస్తిపన్ను ఎంత అన్నది ముఖ్య కాదు. సకాలంలో చెల్లించామా? లేదా? అన్నదే ముఖ్యం. కేవలం రూ. 51 ఆస్తిపన్ను చెల్లించిన మల్కాజ్‌గిరి సర్కిల్ నెరెడ్‌మెడ్ కాకతీయనగర్‌కు చెందిన జి.బాపిరెడ్డి జిహెచ్‌ఎంసి ప్రకటించిన బంపర్ బహుమతి రూ. లక్షను గెల్చుకున్నారు. మే మాసంలో చివర్లో 29 నుంచి 31వ తేదీ వరకు ఎలాంటి బకాయిల్లేకుండా మొత్తం ఆస్తిపన్ను చెల్లించిన సమారు 10వేల 777 మంది వివరాలతో విజేతలను ఎంపిక చేసేందుకు బుధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో డ్రా నిర్వహించారు.

మేరీ కోమ్‌కు వైల్డ్‌కార్డ్!

న్యూఢిల్లీ, జూన్ 1: ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న 33 ఏళ్ల భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇటీవల ఖజకస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 51 కిలోల విభాగంలో కోమ్ పోటీపడింది. అంతకు ముందు క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లో విఫలమైన ఆమె చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కనీసం సెమీ ఫైనల్‌కు కూడా చేరకపోవడంతో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించే అవకాశాలను ఆమె కోల్పోయింది. అయితే, ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇప్పించాలని అఖిల భారత బాక్సింగ్ సంఘం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఒలింపిక్స్‌లో ప్రొఫెషనల్స్!

లాసనే్న, జూన్ 1: రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో ప్రొఫెషనల్ బాక్సర్లు అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకూ అమెచ్యూర్స్ లేదా ఔత్సాహికులకు మాత్రమే అవకాశం ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ప్రొఫెషన్లు పోటీపడడానికి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 88 సభ్య దేశాలున్న ఈ సంఘం ప్రొఫెషనల్ బాక్సర్స్ రంగ ప్రవేశానికి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించింది. సభ్య దేశాల్లో నాలుగు దేశాల ప్రతినిధుల సమావేశానికి హాజరుకాలేదు. మిగతా దేశాలన్నీ ప్రొఫెషనల్స్‌కు ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి.

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ క్వార్టర్స్‌కు సెరెనా

పారిస్, జూన్ 1: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఆమె 18వ సీడ్ ఎలినా స్విటోలినాను 6-1, 6-1 తేడాతో చిత్తుచేసి, కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది. అయితే, ఆమె సోదరి వీనస్ విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ నుంచే వెనుదిరిగింది. వీనస్‌ను తిమియా బాస్కిన్‌స్కీ 6-2, 6-4 ఆధిక్యంతో ఓడించి క్వార్టర్స్ చేరింది. కికీ బెర్టెన్స్ 7-6, 6-3 స్కోరుతో మాడిసన్ కీస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

టెస్టు క్రికెట్‌కు కులశేఖర గుడ్‌బై

కొలంబో, జూన్ 1: శ్రీలంక వెటరన్ ఫాస్ట్ బౌలర్ నవాన్ కులశేఖర టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాను టెస్టు ఫార్మెట్ నుంచి వైదొలగుతున్నానని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. వనే్డ, టి-20 ఫార్మెట్స్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అతను కెరీర్‌లో 21 టెస్టులు ఆడాడు. 48 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌తో 2009లో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులకు ఎనిమిది వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడే అలవాటులేని అతని అత్యధిక స్కోరు 64 పరుగులు.

ఈడెన్ గార్డెన్స్ మాజీ క్యూరేటర్ ప్రబీర్ మృతి

కోల్‌కతా, జూన్ 1: క్రికెట్ మైదానాల గురించి, అందులోనూ అత్యంత ప్రతిష్టాత్మకమైన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ప్రబీర్ ముఖర్జీ పేరు సుపరచితం. వృత్తి ధర్మానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎవరి మాటనూ లెక్కచేయని విలక్షణ వ్యక్తిగా ముద్రపడిన ఈడెన్ గార్డెన్స్ మాజీ క్యూరేటర్ ప్రబీర్ మృతి చెందారు. 86 ఏళ్ల ప్రబీర్ కొంత కాలంగా ఉదర కోశ సంబంధమైన వ్యాధితో బాధపడుతూ బిఎన్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన మనవడు ప్రణయ్ ముఖర్జీ పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. బుధవారం ఉదయం ఆయన మృతి చెందారని తెలిపాడు.

ఎదురులేని ఆర్థిక వృద్ధి

టోక్యో, జూన్ 1: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మరింత ముందుకు దూసుకెళ్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న జైట్లీ.. మంగళవారం విడుదలైన స్థూల దేశీయోత్పత్తి (జిడిపి), వౌలికరంగాభివృద్ధి అంచనాలపై బుధవారం ఇక్కడ స్పందించారు. తాజా గణాంకాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎత్తుకు ఎదిగిందని పేర్కొన్నారు. ఈసారి వర్షాలు సక్రమంగా పడితే, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు కూడా పార్లమెంట్ ఆమోదానికి నోచుకుంటే ఈ అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

టెలికామ్ షేర్ల మద్దతుతో.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి, జూన్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నష్టాలపాలైన నేపథ్యంలో టెలికామ్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, టెక్నాలజీ, రియల్టీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 45.97 పాయింట్లు పుంజుకుని 26,713.93 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.85 పాయింట్లు అందిపుచ్చుకుని 8,179.95 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో జిడిపి, వౌలికరంగ గణాంకాల వృద్ధితో సూచీలు లాభాల్లోనే కదలాడినప్పటికీ, తర్వాత తయారీరంగ వృద్ధి ఐదు నెలల కనిష్టానికి పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Pages