S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచుకొస్తున్న ముహూర్తం!

విజయవాడ, మే 31: వచ్చే నెల 27కల్లా రాజధాని అమరావతికి తరలిరావాలని సెక్రటేరియట్ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఇందు కు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. జూన్‌లో సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులు ఇక్కడికి చేరుకోవలసి ఉంది. అలాగే 54 సెక్రటేరియట్‌లు, 110 హెచ్‌ఓడి కార్యాలయాలు విజయవాడకు రావల్సి ఉంది. ప్రస్తుతం ఆయా శాఖల కేంద్ర కార్యాలయాలను విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలని, సీడ్ క్యాపిటల్ వద్ద భవనాలు సిద్ధమైన తరువాత పూర్తి స్థాయిలో ఆయా శాఖలకు శాశ్వత భవనాలు కేటాయిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పు

నెల్లూరు లీగల్, మే 31: నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద భర్త కోసం వేసి ఉన్న మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో నిందితులైన 13 మందికి పదేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ. పది వేలు వంతున జరిమానా విధిస్తూ నెల్లూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి టివి సుబ్బారావు మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. నిందితులైన రాసపల్లి సుబ్రహ్మణ్యం, ఆలంపాటి వెంకటరమణ, రాకాటి వెంకటేష్, వల్లం విజయకుమార్, పసుపులేటి హరి, చిత్తూరు శామ్యేల్, శివలింగం చంద్రకుమార్, షేక్ కరీముల్లా, మధు, ఎ అనోజ్, సిహెచ్ మీరా, కె శ్రీను, బండారి శివకు శిక్ష పడింది.

సంస్కరణలను వేగవంతం చేస్తాం

టోక్యో, మే 31: నిర్మాణాత్మక సంస్కరణలు చేపడతామని, దేశ జిడిపి వృద్ధిరేటు బలోపేతానికి వౌలిక రంగంపై మరింత శ్రద్ధ వహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. జపాన్ మదుపరులకు హామీ ఇచ్చారు. ఆరు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా జైట్లీ.. మంగళవారం ఇక్కడ నిక్కీ నిర్వహించిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఆసియా’ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచేలా సంస్కరణలు తీసుకొస్తామని, ప్రస్తుత భారత జిడిపి వృద్ధి 7.6 శాతాన్ని అధిగమించే నిర్ణయాలు చేపడతామని అన్నారు. సరళమైన, స్థిరమైన, ఆమోదయోగ్యమైన పన్ను విధానాలను ప్రవేశపెడతామని కూడా జపాన్ మదుపరులకు జైట్లీ భరోసా ఇచ్చా రు.

మహా దోపిడీ!

ఏలూరు, మే 31: అసలు పంట లేకుండానే భారీ దిగుబడులు సాధించాలంటే పశ్చిమగోదావరికి రావాల్సిందే. ఆశ్చర్యంగా ఉన్నా గత రెండు, మూడు సీజన్లుగా ఇలాంటి దిగుబడులే కనిపిస్తున్నాయి మరి. దానికి ప్రభుత్వం మద్దతు ధర కూడా చెల్లిస్తుండటం మరింత విడ్డూరం. విచిత్రంగా అనిపిస్తున్నా.. మిల్లర్లు, కొంతమంది సివిల్ సప్లయిస్ అధికారులు సిండికేట్‌గా మారి చేస్తున్న మహాదోపిడికి ఇదొక రాజమార్గం. అవును.. వాస్తవానికి కృష్ణాడెల్టా శివారునున్న పశ్చిమ పరిధిలోని కృష్ణా ఆయకట్టులో మూడొంతులకుపైగా నీరు లేక అసలు వరిసాగే చేపట్టలేదు.

రూ. 9,999లకే విండోస్ 10 ల్యాప్‌టాప్!

హైదరాబాద్, మే 31: దేశంలో మొదటిసారిగా విండోస్ 10 ల్యాప్‌టాప్ కేవలం 9,999 రూపాయలకే అందుబాటులోకి తెచ్చినట్లు ఐబాల్ డైరెక్టర్, సిఇఒ సందీప్ పరశురాంపూరియా తెలిపారు. అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులకు పేరెన్నికగన్న బ్రాండ్ ఐబాల్.. ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌ల భాగస్వామ్యంతో 9,999 రూపాయల తక్కువ ధరకే విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను అందిస్తోంది. కాగా, నూతన ఆవిష్కరణలు చేయడమే తమ లక్ష్యమని, యువత అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంపైనే తమ ప్రధాన దృష్టి అని రాంపూరియా అన్నారు.

మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

హైదరాబాద్, మే 31: సాఫ్ట్ బ్యాంకు సిఒఒ నికేష్ అరోరాతో తెలంగాణ ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు అమెరికాలో మంగళవారం భేటీ అయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన ప్రయోజనాలను వివరించారు. ఆరోరాతో కెటిఆర్ రెండు గంటల పాటు చర్చలు జరపగా, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న వివిధ అంశాలపై ఇద్దరు అభిప్రాయాలను పంచుకున్నారు. పదిహేను రోజుల్లోనే సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. పారిశ్రామిక అనుమతులకు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన టిఎస్ ఐపాస్‌ను అరోరా అభినందించారు.

శాంతా బయోటెక్నిక్స్ కొత్త ప్లాంట్‌లో మొదలైన వ్యాక్సిన్ల తయారీ

హైదరాబాద్, మే 31: ముప్పిరెడ్డిపల్లిలోగల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఏర్పాటు చేసిన నూతన కర్మాగారంలో శాంతా బయోటెక్నిక్స్ వాణిజ్య ఉత్పత్తిని మొదలు పెట్టింది. ‘హైదరాబాద్‌కు సమీపంలోని ముప్పిరెడ్డిపల్లిలోగల సెజ్‌లో మా అనుబంధ సంస్థ శాంతా బయోటెక్నిక్స్ ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌లో మే 25 నుంచి వ్యాక్సిన్ల తయారీ ప్రారంభమైంది.’ అని సనోఫి వ్యాక్సిన్ల విభాగం సనోఫి పాస్‌ట్యూర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఇక్కడ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.

‘బ్యాడ్ బ్యాంక్’ దిశగా అడుగులు

ముంబయి, మే 31: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని ప్రమాదంలో పడేసిన మొండి బకాయిల సమస్యను ఎదుర్కొనేందుకు ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. అయితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఓ నిరర్థక ఆస్తుల నిధిని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉందన్న వార్తల మధ్య ఈ ‘బ్యాడ్ బ్యాంక్’కు ఎస్‌బిఐ నేతృత్వం వహిస్తుందా? అన్నదానికి మాత్రం ఆయన ఖచ్చితమైన సమాధానం తెలియపరచలేదు.

ఆఫ్రికా రిటైల్ ఆయిల్ వ్యాపారాన్ని వదులుకున్న రిలయన్స్

న్యూఢిల్లీ, మే 31: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. ఆఫ్రికా చమురు రిటైల్ వ్యాపారం నుంచి బయటికొచ్చింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్ (గ్యాప్కో)లో ఆర్‌ఐఎల్‌కున్న మొత్తం 76 శాతం వాటాను టోటల్ సంస్థ కొనుగోలు చేస్తోంది. ఆఫ్రికాలో పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ వ్యాపారంలో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎస్‌ఎ అగ్రశ్రేణిలో ఉంది. అయితే ఎంత మొత్తానికి ఆర్‌ఐఎల్ వాటాను టోటల్ కొనుగోలు చేస్తుందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, కెన్యా, ఉగాండ, టాంజానియాల్లోని రిలయన్స్ గ్యాప్కో ఆస్తులు ఈ లావాదేవీలతో టోటల్ చేతికి రానున్నాయి.

Pages