S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరంలో భారీ వర్షం

ముషీరాబాద్, మే 31: రోహిణీ కార్తెలో భగభగ మండుతున్న ఎండల్లోఅల్లాడుతున్న నగర ప్రజలకు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. ఉదయం నుండి ఉక్కబోత, వడగాల్పులతో కూడిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారింది. సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో ఓవైపు ఎండ కొడుతుండగానే చిరు జల్లుతో ప్రారంభమైన వర్షం ఒక్క సారిగా ఊపందుకుంది. సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం ప్రారంభం కావటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులెదుర్కున్నారు. ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్, నాంపల్లి, ఆబిడ్స్, ఆర్టీసి క్రాస్‌రోడ్ తదితర రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ఏర్పడింది.

రెండు ముక్కలే ముద్దు.. మూడు ముక్కలు వద్దు..

హైదరాబాద్, మే 31: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి నివేదికలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పునర్విభజన అధ్యయన కమిటీ పార్టీ పరిశీలకుడు పర్యాద కృష్ణమూర్తి, మంత్రి మహేందర్‌రెడ్డితో కూడిన అధ్యయన కమిటీ పార్టీ వర్గాలతో చర్చించి సమస్యలను పరిగణనలోకి తీసుకుని జిల్లా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నివేదిక రూపొందించింది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను రెండు జిల్లాలుగా విభజిస్తే ఎలాంటి సమస్య ఉండదని అధ్యయన కమిటీ నివేదిక సమర్పించినట్లు తెలిసింది.

బాధపెట్టే పార్శ్వపు నొప్పి

ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక.. నిలకడ లేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇలాంటి ఒత్తిడివలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది పార్శ్వపు నొప్పి. దీనినే వైద్య పరిభాషలో మైగ్రేన్ అంటారు. నేడు పార్శ్వపు నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నవారిలో అధికం స్ర్తిలే. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితోపాటు అధిక పనిభారం. పార్శ్వపునొప్పి వలన ఏ పని సరిగా చేయలేక అంతర్గతంగా మధనపడి మానసిక వ్యాధులకు సైతం గురవుతున్నారు. కొందరిలో తలనొప్పి ఒకేవైపునకు వచ్చి వేధిస్తుంది. ఇలాంటి తలనొప్పిని పార్శ్వపునొప్పి (మైగ్రేన్) అంటారు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646

నోరు ఎండిపోతుంటే?

మన నోటిలో లాలాజల గ్రంథులు కావలసినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయలేకపోతే నోరు ఎండిపోతుంటుంది. ఈ స్థితిని ‘జీరోస్టోమియా’ అంటారు. అది వచ్చే కారణాన్ని బట్టి తాత్కాలికంగా లేక శాశ్వత ఇబ్బంది అవుతుంది. కారణాలు- షాక్ లేక దెబ్బతగలడం లాలాజల గ్రంథులకు ఆటో ఇమ్యూన్ డిసీజ్, నోటి ద్వారా గాలి పీల్చడం, గ్రంథుల డిజార్డర్, ఒత్తిడి, అధిక రక్తపోటు, కొన్ని మందులు. లాలాజల గ్రంథులకు స్ఫూర్తినిచ్చేవి లూబ్రికెంట్స్, కృత్రిమ లాలాజల గ్రంథులు ఈ ఇబ్బందిని తొలగించడానికి తోడ్పడతాయి. నోరు ఎండిపోవడంతో వచ్చే ఇబ్బందితో పళ్ళు దెబ్బతినకుండా ఫ్లోరైడ్ టూత్‌పేస్టుని వాడాలి.

డా.సుధీర్

ఫొగబెట్టొద్దు!

నిన్ననే యాంటీ టుబాకో డేని జరుపుకున్నాం. ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నామా? తీసుకోకపోతే ఇలాంటి అవగాహనా దినోత్సవాలు జరుపుకుని లాభమేమిటి? అందుకే మరోసారి పునరాలోచించండి- మీకు ఏ విధంగా పొగాకు పదార్థాల్ని వాడే అలవాటున్నా.

-డా.బి.ఎస్.ఆర్.మూర్తి

తరచూ ఒళ్ళునొప్పులు (మీకు మీరే డాక్టర్ )

ప్ర: ప్రతిరోజూ వొళ్ళంతా నొప్పులుగా వుంటుంది. ఒక చోటని కాదు, ఒళ్ళంతా నొప్పులే. నివారణ చెప్పగలరు?
-్భర్గవ రామారావు.పి., సికిందరాబాద్
వొళ్ళు నొప్పులు కొంతమందిని తీవ్రంగా బాధిస్తాయి. వీటిని కండరాల నొప్పులని కూడా పిలుస్తారు. నొప్పుల్లేకుండా ఎవరూ ఉండరు. అది పదే పదే తిరగబెట్టి వదలకుండా బాధిస్తేనే వ్యాధి. అది ఏదైనా ఒక శరీర భాగంలో వచ్చిన నొప్పి అయినా సరే, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా సరే కండరాలవలనే ఈ నొప్పులు వస్తున్నాయి.

డా జి.వి.పూర్ణచందు

గురక... ఇలా తగ్గుతుంది!

గురక పెడుతుంటారు కొందరు నిద్రలో. దానివల్ల ప్రక్కవాళ్ళకి సమస్యే కాదు, పెట్టేవాళ్ళకీ సమస్యే.
మన శ్వాసకి కొంత అడ్డంకి కలగడంవల్ల ‘గురక’ మొదలవుతుంది. ఇది మామూలు జలుబునుంచీ పెరిగిన టాన్సిల్స్- ఛాతీలో కండరాల బలహీనత- గొంతులోని శ్వాసమార్గం సరిగ్గా లేకపోవడంతో వస్తుంటుంది. నిద్రపోయే సమయంలో శ్వాస మార్గంలో అడ్డంకులేర్పడడంతో ‘స్లీప్ ఆప్నియా’ కలుగుతుంది. గురకపెట్టేవాళ్ళకి కూడా తనకీ ఇబ్బంది ఉందని తెలియకపోవచ్చు. దీంతో రాత్రి నిద్ర సరిగ్గా పట్టక, పగలంతా కూడా చికాకుగా ఉంటుంది.

-డా మోహన్‌రెడ్డి..

గుండెలో గడబిడ?

మన గుండె ఒక పద్ధతి ప్రకారం కొట్టుకుంటుంది. ఈ లయ తప్పితే దాన్ని ‘ఎరిథ్మియా’ అంటారు. బాగా చెమటలు పడుతుంటే ఈ సమస్య కలిగిందేమోననే అనుమానం రావాలి.
థైరాయిడ్ గ్లాండ్ అధికంగా స్పందించడంవల్ల, ఊపిరితిత్తుల వ్యాధులలోను, రసాయనాల సమతుల్యం దెబ్బతినడంవల్ల, మద్యపాన సేవనం, కొన్ని మందులు తీసుకోవడంవల్ల గుండె కొట్టుకునే లయ తప్పుతుంది. అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె కవాటాలు దెబ్బతినడం, గుండె ఫెయిల్యూర్ లాంటి జబ్బులకు వాడే మందులవల్ల గుండె లయ తప్పుతుంటుంది.

డా.రవికుమార్ ఆలూరి

ఇలా అయతే మేలు...

స్ర్తిలకు రుతుస్రావం రుతుస్రావం మధ్య యోనినుంచి రక్తం లేక మరే ద్రావకాలు కారుతున్నా.. మెనోపాజ్ తర్వాత, గర్భం ధరించినప్పుడు రక్తస్రావం అవుతున్నా వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవాలి.
* స్ర్తి, పురుషులిద్దరిలోనూ గుదము ద్వారా రక్తస్రావమవుతున్నా వెంటనే గాస్ట్రోఎంటెరాలజిస్ట్‌ని కలవాలి.
* మూత్ర, మల విసర్జనలో గుర్తించాల్సిన మార్పులు వచ్చినా..
* శరీరంమీద పడ్డ పుండు మూడు వారాలవుతున్నా మానకున్నా..
* పుట్టుమచ్చలు పెరుగుతున్నా, చర్మం రంగు మారుతున్నా..
* రొమ్ములలో ఎటువంటి గడ్డలేర్పడ్డా..
* గొంతులో గరగర, నస, దగ్గులాంటివి వరుసగా వస్తున్నా..

కరెంట్‌తో ప్రతిష్ట..కరవుతో కుదుపు!

హైదరాబాద్, మే 31: రెండేళ్ల తెరాస పాలనలో సాధించిన విద్యుత్ ప్రగతి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచితే, తాండవించిన కరవు ఇబ్బంది పెట్టింది. ఆంధ్రప్రదేశ్ చివరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనాకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై నిషేధం విధించారు. ఏసీలు వాడొద్దంటూ భారీ హోర్డింగ్‌లూ ఏర్పాటు చేశారు. పరిశ్రలకు వారానికి రెండు రోజుల పవర్ హాలిడే ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిన తెలంగాణ, విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అంతా భావించారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తతో విద్యుత్ అంశమే ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది.

Pages