S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

హైదరాబాద్, మే 31: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రోడ్డు భద్రత సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, శాఖల మధ్య సమన్వయం ఉండి, ఎప్పటికప్పుడు సమాచారం అందించుకోవడంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని అన్నారు. వచ్చేనెల 4వ తేదీలోపు ఎ-కేటగిరిగా గుర్తించిన రోడ్డు ప్రమాద స్థలాలను సంబంధిత శాఖలు ఉమ్మడిగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పారు.

భక్తజన సంద్రం.. కొండగట్టు..!

కరీంనగర్, మే 31: పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు భక్తజన సంద్రంతో పులకించిపోయింది. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగడంతో అంజన్న సన్నిధి భక్తజనంతో కిక్కిరిసిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచే తమ ఇష్టదైవమైన అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు, హనుమాన్ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు తరలిరాగా, మంగళవారం రాత్రి వరకు కూడా భక్తుల తాకిడి అలాగే కొనసాగింది. కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ముద్రగడను విమర్శించే అర్హత ఏపి మంత్రులకు లేదు

ఖైరతాబాద్, మే 31: ముద్రగడను విమర్శించే అర్హత ఏపి మంత్రులకు లేదని కాపు యువసేన మండిపడింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యువసేన నాయకులు కర్ణా శ్రీనివాస్, రాఘవరావుమాట్లాడుతూ ఎన్నికల ముందు టిడిపి అధినేత ఇచ్చిన హామీని నెరవేర్చమని ముద్రగడ అడగడం తప్పా అని ప్రశ్నించారు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన్నరాజప్ప, పి.నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాపు జాతి కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ముద్రగడను విమర్శించే అర్హత మంత్రులకు ఎక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెరుగైన సేవల దిశగా జిహెచ్‌ఎంసి

ముషీరాబాద్, మే 31: జిహెచ్‌ఎంసి ప్రతిష్టాత్మంగా చేపట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో పలుకీలక నిర్ణయాలు తీసుకుంది. భవనాలు, లేఅవుట్ అనుమతులలో పారదర్శకత, అంకితభావం, చిత్తశుద్ధితో సిబ్బంది విధులు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ముఖ్యంగా జిహెచ్‌ఎంసి సిబ్బందికి, దరఖాస్తుదారులకు నేరుగా ఎలాంటి వ్యక్తిగత, పరిచయాలు, బాంధవ్యాలు లేకుండా ప్రక్రియ కొనసాగేలా దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే కొనసాగాలే చర్యలు చేపట్టింది. ఇందుకు తొలుత అన్ని గృహనిర్మాణాల అనుమతులు ఇక ఆన్‌లైన్ ద్వారానే సాగేలా కార్యాచరణ చేపట్టింది.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నాం

ఖైరతాబాద్, మే 31: రాష్ట్ర ఏర్పాటు కోసం నిస్వార్ధంగా పోరాడిన ఉద్యమకారులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైనందుకు తాము రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నట్టు 1969 ఉద్యమకారుల సమితి స్పష్టం చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి మేచినేని కిషన్‌రావు, ప్రధాన కార్యదర్శి రామరాజు ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన తీవ్ర ఉద్యమం 1969లోనేనని, సుమారు 360 మంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది పోలీస్ దెబ్బలకు గురయ్యారని అన్నారు.

పొగాకు వినియోగం లేని సమాజ నిర్మాణం కోసం శ్రమిద్దాం

ఖైరతాబాద్, మే 31: పొగాకు వినియోగం లేని సమాజ నిర్మాణం కోసం అంతాకలిసి శ్రమిద్దామని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. వరల్డ్ నో టొబాకా డేను పురస్కరించుకొని మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫెడరేషన్ ఫర్ ఓరల్ క్యాన్సర్ (్ఫకా) సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొగాకుకు బానిసై ఆ వ్యసనాన్ని దూరం చేసేందుకు ఫోకా సంస్థ ఏర్పాటు కాల్ సెంటర్ ( 8099055550) సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు వందేళ్లు బతకమని అవకాశం ఇస్తే చెడు వ్యసనాల ద్వారా జీవిత కాలాన్ని తగ్గించుకోవడం ఆవేదన కలిగించే అంశమన్నారు.

‘హనుమాన్ చాలీసా’ సీడీ ఆవిష్కరణ

కాచిగూడ, మే 31: హనుమన్ జయంతి వేడుకలు శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి గానసభలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు డా.కెవి.రమణచారి పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు చింతలపాటి సురేష్ గానామృతం చేసిన ‘హనుమాన్ చాలీసా’ సీడీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రమణాచారి మాట్లాడుతూ హనుమన్ చాలీసాను చదవడం ద్వారా అన్ని శుభపరిణామలు కలుగుతాయని తెలిపారు. చింతలపాటి సురేష్ ఆలపించిన హనుమాన్ చాలీసా గానం ఎంతో అద్భుతంగా అలపించారని కొనియాడారు.

సంపూర్ణ మద్య నిషేధానికి ఉద్యమించాలి

కాచిగూడ, మే 31: తెలుగు రాష్ట్రాలలో సంపూర్ణ మద్య నిషేధానికి ఉద్యమించాలని అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మద్య నియంత్రణ ఉద్యమ రాష్ట్ర కమిటీ చైర్మన్ జస్టిస్ డా.అంబటి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. అప్సా, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మద్యం బాధితులతో బహిరంగ విచారణ కార్యక్రమం మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ డా.లక్ష్మణరావు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ఐక్యంగా సంపూర్ణ మద్య నిషేధ సాధనకు ఉద్యమించాలని సూచించారు.

నగరంలో మళ్లీ కాల్పుల కలకలం?

హైదరాబాద్, మే 31: హైదరాబాద్ నగరంలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఇటీవల హిమాయత్‌నగర్‌లో ఇద్దరు వైద్యుల మధ్య జరిగిన కాల్పులు, మెహిదీపట్నంలో ఓ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ సర్వీస్ ఉద్యోగిపై జరిపిన కాల్పుల సంఘటన మరువకముందే తాజాగా సోమవారం అర్ధరాత్రి గోల్కొండ రీసార్ట్స్‌లో కాల్పులు జరిగాయి. గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్ తన స్నేహితులతో కలసి గోల్కొండ రీసార్ట్స్‌లో పార్టీ జరుపుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ స్నేహితుడు ప్రభాకర్ తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే కాల్పులు ఎవరిని ఉద్దేశించి జరిపాడనేది సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.

దతన్న సెల్ దొంగ దొరికాడు

హైదరాబాద్, మే 31: ఏకంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మొబైల్ ఫోనునే కాజేసిన ఘనుడు పట్టుబడ్డాడు. ఈ నెల 15వ తేదీన ఉదయం సరూర్‌నగర్‌కు చెందిన గుమ్మడి రాజ్‌కుమార్ శ్రీశైలం దేవస్థానం మల్లన్న దైవదర్శనానికి సిఫార్సు లేఖ కోసం కేంద్ర మంత్రి దత్తాత్రేయ నివాసానికి వచ్చాడు. నగరంలో గాలి వాన బాధితులు తమ గోడు వినిపించుకునేందుకు దత్తాత్రేయ నివాసానికి రావడంతో ఇళ్ళంతా సందడిగా ఉంది. దత్తాత్రేయ మొబైల్ ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉండడంతో మంత్రి పర్సనల్ అసిస్టెంట్ ఆ ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టారు. అక్కడే ఉన్న రాజ్‌కుమార్ ఆ ఫోన్‌ను కాజేశాడు.

Pages