S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/25/2018 - 01:03

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ టూర్‌లో పరిమిత ఓవర్ల సీజన్ పూరె్తైంది. టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా, వనే్డ సిరీస్‌లో విఫలమైంది. 2-1 గెలుపుతో సిరీస్ రివేంజ్ తీర్చుకున్న ఇంగ్లాండ్, ఆగస్టు 1నుంచి సొంతగడ్డపై ఐదు టెస్ట్‌ల సిరీస్ మొదలెట్టనుంది. దీనికోసం అనూహ్య మార్పులేవీ లేకుండానే తొలి మూడు టెస్టుల ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది కూడా.

07/25/2018 - 00:59

న్యూఢిల్లీ, జూలై 24: పదేళ్ల క్రితం బాణాన్ని గురిపెట్టి బంగారు పతకాలు సాధించినోడు. కాలం కలిసిరాక బతుకుదెరువు కోసం ఇప్పుడు కూలి కెళ్తున్నాడు. ఇదీ 2008 దక్షిణాసియా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన 28 ఏళ్ల విలుకాడు అశోక్ సోరెన్ బతుకు కథ. సోషల్ మీడియా ద్వారా దీనగాథ బయటి ప్రపంచానికి పొక్కింది. అటుతిరిగి ఇటుతిరిగి కేంద్రం దృష్టికెళ్లింది.

07/25/2018 - 01:01

మచిలీపట్నం, జూలై 24: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ క్రీడాకారుడూ ఒలింపిక్‌స్థాయికి ఎదిగి పతక విజేతలు కావాలని టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆకాంక్షించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారు చల్లపల్లి బైపాస్ రోడ్డులో రూ.13కోట్లతో నిర్మించనున్న మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు.

07/25/2018 - 00:40

కొలంబో, జూలై 24: శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ధనుష్క గుణతిలకపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటుపడింది. దక్షిణాఫ్రికాతో దంబుల్లా స్టేడియంలో ఆదివారం నుంచి ఐదు వనే్డల సిరీస్ మొదలవుతున్న తరుణంలో, 15మంది ఆటగాళ్ల జట్టునుంచి గుణతిలకను సస్పెండ్ చేశారు. గుణతిలక హోటల్ రూంలో అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నార్వే మహిళ చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

07/25/2018 - 00:38

దుబాయ్, జూలై 24: ఇవి ఏ మ్యాచ్‌లోనో తీసిన వికెట్లు కాదు. టెస్ట్ మ్యాచ్‌ల్లో తీసిన వికెట్లకు ఐసీసీ ఇచ్చిన ర్యాంకులు. బౌలర్ల టెస్ట్ ర్యాంకుల్లో భాతర స్పిన్ మాంత్రికులిద్దరూ అత్యుత్తమ స్థానాలే నిలుపుకున్నారు. ఆగస్టు 1నుంచి టీమిండియాతో బర్మిగమ్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతున్న ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్‌సన్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు.

07/24/2018 - 13:50

మచిలీపట్నం: మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత మొదటి క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సీకే నాయుడు విగ్రహాన్ని కుంబ్లే ఆవిష్కరించారు. అనంతరం మసులా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఆథెటిక్‌ స్టేడియం భవనాలకు కుంబ్లే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, శాప్‌ చైర్మన్‌ అంకమ చౌదరి పాల్గొన్నారు.

07/23/2018 - 23:38

న్యూఢిల్లీ, జూలై 23: కళ్లముందుకు ఆసియా క్రీడలు వచ్చేశాయి. మరో నెలలో సంరంభం మొదలవుతుంది. కానీ, భారత స్క్వాష్ మాత్రం దిక్కులేనిదైపోయింది. పతకాలు సాధించగల సత్తావున్న క్రీడను నడిపించే నాయకుడే లేకుండాపోయాడు. భారత స్క్వాష్ రాకెట్ సమాఖ్య అసమర్థత కారణంగా ఆటగాళ్లకు తర్ఫీదునిచ్చే కోచ్ లేకుండాపోయాడు.

07/23/2018 - 23:37

తన జట్టు విజయాలు సాధిస్తున్నంత వరకూ తాను పరుగులు చేయకున్నా ఫరవాలేదంటూ కోహ్లీ చెప్పే మాటలు అబద్ధం. తన బలహీనతలు అధిగమించడానికి కోహ్లీ అకుంఠిత సాధన చేస్తాడని అందరికీ తెలుసు. అందుకే, వచ్చే టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో సంవాదం నాకూ, అతనికీ కాదు. పోరాటం ఇంగ్లాండ్ బౌలర్లతో అని కోహ్లీ గుర్తు పెట్టుకోవాలి.
-జేమ్స్ ఆండర్సన్

07/23/2018 - 23:35

వడోదరలో జరుగుతోన్న 15వ నేషనల్ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పంజాబ్ షాట్‌పుట్ క్రీడాకారుడు ధన్‌వీర్‌సింగ్, 400 మీటర్ల హర్డిల్స్‌లో కేరళవాసి విష్ణుప్రియ రికార్డులు నమోదు చేసి స్వర్ణ పతకాలు సాధించారు. 19.69 మీటర్లు విసిరిన ధన్‌వీర్‌సింగ్, 2011లో నవ్‌తేజ్‌దీప్ సింగ్ నమోదు చేసిన 19.34 మీటర్ల రికార్డును అధిగమించాడు.

07/23/2018 - 23:34

న్యూఢిల్లీ: ఏటీపీ వరల్డ్ టూర్ సింగిల్స్ ట్రోఫీ పోరులో నిరాశపర్చిన భారత యువ టెన్నిస్ కెరటం రామ్‌కుమార్ రామనాథన్ మెరుగైన వ్యక్తిగత ర్యాంకు సాధించడంలో సఫలమయ్యాడు. ఆదివారం రాత్రి సింగిల్స్ టైటిల్ పోరులో అమెరికన్ ఆటగాడు స్టీవ్ జాన్సన్ చేతిలో పరాజితుడైన రామ్‌కుమార్, టోర్నీలో 150 పాయింట్లు సాధించి 46 స్థానాలను అధిగమించడం విశేషం.

Pages