S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/19/2018 - 00:14

అంట్వెర్ప్(బెల్జియం), జూలై 18: భారత జూనియర్ మహిళా హాకీ జట్టు జయపరంపర కొనసాగిస్తోంది. బెల్జియంలో జరుగుతోన్న అండర్ -23 ఆరు దేశాల హాకీ టోర్నీలో బుధవారం ప్రత్యర్థి బెల్జియం జట్టుపై 2-0 గోల్స్ సాధించి వరుసగా మూడో విజయం నమోదు చేసింది. భారత జట్టులో సంగీత కుమారి 36వ నిమిషంలో తొలి గోల్ సాధిస్తే, 42వ నిమిషంలో సలీమ తేటే మరో గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలబెట్టింది.

07/19/2018 - 00:49

జకర్తా, జూలై 18: ఆసియా క్రీడల సంరంభానికి మరో నెలలో ఆతిథ్య ఇండోనేసియా ‘షో పీస్’ నిర్వహించనుంది. అందుకు తగ్గట్టుగానే వేదికలన్నీ సిద్ధమవుతున్నాయి. ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. క్రీడా ప్రాంగణాలు నిగ్గుదేలుతున్నాయి. వాటికి దారులుతీస్తూ విశాలమైన రోడ్లు దర్శనమిస్తున్నాయి. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ అందమైన చెట్లు మొలుచుకొచ్చాయి. మొత్తంగా జకర్తా స్వరూపమే మారిపోతోంది. కానీ..!

07/19/2018 - 00:12

ముంబయి, జూలై 18: ప్రపంచ మేటి క్రికెటర్లను తీర్చిదిద్దిన మిడ్‌లెసెక్స్ క్రికెట్ సేవలు ఇకనుంచి భారత్‌కూ అందుబాటులోకి రానున్నాయి. అదీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ సారథ్యంలో. క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్, మిడ్‌లెసెక్స్‌ల భాగస్వామ్యంలో ‘తెండూల్కర్ మిడ్‌లెసెక్స్ గ్లోబల్ అకాడామి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

07/19/2018 - 00:11

ముంబయి, జూలై 18: రాబోయే చెస్ ఒలింపియాడ్‌లో భారత క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ ప్రదర్శిస్తారన్న ఆశాభావాన్ని ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వ్యక్తం చేశాడు. ‘గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో చెస్ గేమ్ స్థిరంగా వృద్ధి చెందుతోంది. అది వచ్చే చెస్ ఒలింపియాడ్‌లో కనిపించబోతోంది’ అని వ్యాఖ్యానించాడు. ‘చెస్‌పై చాలామంది దృష్టి పెడుతున్నారు. 1987లో నేనే గ్రాండ్ మాస్టర్. ఇప్పుడు దేశంలో 52మంది.

07/19/2018 - 00:50

లీడ్స్, జూలై 18: భారత్‌తో జరిగిన చివరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ని వ్యూహాత్మకంగా ఆడి గెలిచామని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. మొదటి రెండు వనే్డల్లో భారత్, ఇంగ్లాండ్ చెరొక విజయంతో సమవుజ్జీలుగా నిలిచిన నేపథ్యంలో, చివరిదైన మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

07/18/2018 - 02:06

లీడ్స్: మొత్తానికి వనే్డ ట్రై సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో తన్నుకుపోయింది. రెండో వనే్డను భారీ ఆధిక్యంతో సొంతం చేసుకుని భారత్‌పై వత్తిడిపెంచిన ఇంగ్లాండ్, మూడో వనే్డను సునాయాసంగా కైవసం చేసుకుని సిరీస్‌ను దక్కించుకుంది. సిరీస్ భవితవ్యాన్ని తేల్చే నిర్ణయాత్మక (లీడ్స్‌లోని హెడింగ్‌లీ మైదానం జరిగిన) మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

07/18/2018 - 01:41

పారిస్, జూలై 17: ప్రపంచకప్ పట్టుకొచ్చిన హీరోలని చూసి ఫ్రాన్స్ పొంగిపోయింది. ఆటగాళ్లు కాదురా.. మీరే ఫ్రాన్స్ పోటుగాళ్లంటూ కితాబులిచ్చింది. అదిగదిగో.. టాప్‌లెస్ బస్సులో ఈఫిల్ టవర్లు వస్తున్నాయంటూ జేజేలు పలికింది. ఫ్రాన్స్ ప్రథమ పౌరుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మొదలు బుడిబుడి అడుగులేసే బుడతడి వరకూ ఆటగాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న విజయదరహాసం చూసి మురిసిపోయారు.

07/18/2018 - 01:43

పారిస్, జూలై 17: ఫిఫా ప్రపంచకప్ హీరో ఎవరన్న ప్రశ్నకు ప్రపంచం మొత్తం చెప్పే ఆన్సర్ -ఫ్రాన్స్ అని. కానీ, ఫ్రాన్స్ మాత్రం ‘హీరో ఎంబప్పె’ అన్న సమాధానమిస్తోంది. ఫ్రాన్స్‌ను జగజ్జేత చేసిన కీలక ఆటగాళ్లలో పందొమ్మిదేళ్ల ఎంబప్పె పాత్ర తక్కువేం కాదు. అది జట్టు ఆటగాళ్లకు బాగా తెలుసు.

07/18/2018 - 01:28

కొలంబో, జూలై 17: అర్జున్ తెందూల్కర్‌కు వికెట్ పడింది. అదీ, అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మెయిడిన్ వికెట్. కొలంబోలోని నాందెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్‌లో శ్రీలంక యు-19 జట్టుతో భారత యు-19 జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోన్న విషయం తెలిసిందే.

07/18/2018 - 01:27

సిడ్నీ, జూలై 17: ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గోల్ స్కోరర్ టిమ్ కాహిల్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 38ఏళ్ల కాహిల్ 107 అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో పాల్గొని 50 గోల్స్ సాధించాడు. రష్యాలో జరిగిన వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో జరిగిన గ్రూప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారి ఆడిన టిమ్ కాహిల్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Pages