S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/23/2018 - 23:32

పారిస్, జూలై 23: ఏటీపీ టెన్నిస్ టాప్ ర్యాంకర్‌గా రాఫెల్ నాదల్ నిలిచాడు. 17 గ్రాండ్ శ్లామ్‌లు సాధించిన 32ఏళ్ల టెన్నిస్ దిగ్గజం, తన స్విస్ ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌ను దాటేశాడు. సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

07/23/2018 - 23:30

లండన్, జూలై 23: విదేశీ టూర్లు తగిలినపుడు ముందుకు వెళ్లడం కేవలం క్రికెట్ కోసమే కాదని, ఆ దేశ పర్యాటకాన్ని సందర్శించి కల్చర్‌ని అర్థం చేసుకోవడం కూడా ఉంటుందని భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అభిప్రాయపడ్డాడు. ‘విదేశీ టూర్లలో ఆ దేశాన్ని చూడొచ్చు. అక్కడి అందమైన ప్రదేశాలు తిలకించొచ్చు. అలా ఆ దేశంయొక్క కల్చర్‌ని అర్థం చేసుకోవచ్చు.

07/23/2018 - 23:29

చెన్నై, జూలై 23: డబ్య్లుఎస్‌ఎఫ్ -ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్లు (అండర్-19)గా భారత్‌కు చెందిన మోస్త్ఫా అసల్, రోవన్ రెడి ఆరబిలు నిలిచారు. చెన్నైలో జరుగుతోన్న టోర్నీలో ఈజిప్ట్‌కు చెందిన వరల్డ్ చాంపియన్ మార్వాన్ తరెక్‌ను 11-7, 13-11, 11-4 స్కోరుతో 45 నిమిషాల్లో మట్టికరిపించి భారత ఆటగాడు, సెకెండ్ సీడ్ మోస్త్ఫా అసల్ టైటిల్ దక్కించుకున్నాడు.

07/23/2018 - 23:28

బెంగళూరు, జూలై 23: భారత్-ఎ, దక్షిణాఫిక్రా-ఎ జట్ల మధ్య ఆగస్టు 4నుంచి 7 వరకూ బెల్గాంలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ బెంగళూరుకు మారింది. ‘వాతావరణ పరిస్థితుల కారణంగా బెల్గాంలో జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూరుకు మారుస్తున్నాం’ అంటూ కెఎస్‌సిఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం రెండో టెస్ట్ ఆగస్టు 10 నుంచి 13 మధ్య బెంగళూరులోనే జరగాల్సి ఉంది.

07/23/2018 - 03:11

న్యూఢిల్లీ: జకర్తాలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత షట్లర్ లక్ష్య సేన్ థాయిలాండ్‌కు చెందిన వరల్డ్ జూనియర్ చాంపియన్ కున్లవుట్ వితిద్‌శరణ్‌ను ఖంగుతినిపించి ఆసియా జూనియర్ చాంప్‌గా నిలిచాడు. 46 నిమిషాలపాటు హోరాహోరీ సాగిన ఫైనల్ పోరులో 21-19, 21-18 వరుస సెట్ల విజయంతో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ‘ఈ విజయం సంతోషంతోపాటు, నమ్మకాన్ని పెంచింది.

07/23/2018 - 02:16

మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే గోల్డ్‌కోస్ట్ కామనె్వల్త్‌లాంటి ప్రతికూల ఫలితాలను సమీక్షించే మూడ్‌లో లేను. ఇప్పుడు నా ఏకాగ్రత అంతా వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌పైనే. ఓడినోడిపై విమర్శలు రావడం సహజం. కానీ, ఎలాంటి రిస్క్‌లు ఫేస్ చేయాలన్నది మనకే తెలుస్తుంది. నేనేంటో నాకు తెలుసు. ఫలితం సాధించినపుడే నేనేంటో బయటివాళ్లకు తెలిసేది. అందుకే -నా ఫోకస్ టోర్నీలపైనే పెట్టాను.

07/23/2018 - 02:09

జపాన్ భాషలో ఇదేదో పలకరింపు అనుకోకుండి. ఒలింపిక్ 2020 మస్కట్ పేర్లు. ఆతిథ్య దేశం జపాన్‌లోని టోక్యో ఓడైబా మెరైన్ పార్క్‌లో ఆదివారం మస్కట్‌లు ఇలా హడావుడి చేశాయి. వచ్చే ఒలింపిక్ కోసం సోగకళ్ల మస్కట్‌లను సిద్ధం చేసిన నిర్వాహకులు, వాటి రూపాలను తొలిసారి ప్రపంచానికి విడుదల చేశారు. టంగ్ ట్విస్టింగ్ చాలెంజ్‌లో భాగంగా సూపర్ హీరోల పేర్లూ ప్రకటించారు.

07/23/2018 - 02:07

భారత్-న్యూజిలాండ్ హాకీ ట్రై సిరీస్‌ను ఊహించినట్టే భారత్ సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలుపుతో ఆధిక్యంలోవున్న భారత్, బెంగళూరు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌ను 4-0తో వైట్‌వాష్ చేసి సిరీస్ కైవసం చేసుకుంది. ‘ఆసియా గేమ్స్‌కు ముందు ప్రపంచ టాప్ టెన్‌లోని జట్టుపై భారత్ సిరీస్ విజయం నమోదు చేయడం శుభపరిణామం.

07/23/2018 - 02:05

న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో క్రీడాప్రాధాన్యతను పెంచి టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు రూపొందించిన కార్యక్రమం ఖేలో ఇండియా. ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 734మంది అథ్లెట్లకు స్కాలర్‌షిప్ మంజూరు చేస్తున్నట్టు భారత క్రీడాభివృద్ధి సంస్థ (ఎస్‌ఏఐ) ఆదివారం ప్రకటించింది.

07/23/2018 - 02:03

న్యూఢిల్లీ, జూలై 22: హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టోర్నీలో భారత సత్తా చాటాలని కలలుగంటున్నాడు చెన్నై టెన్నిస్ దిగ్గజం రామ్‌కుమార్ రామనాథన్. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ సింగిల్స్ సెమీఫైనల్స్‌లో యూఎస్ ఆటగాడు టిమ్ స్మిక్‌జెక్‌ను 6-4, 7-5తో మట్టికరిపించి ఫైనల్స్‌కు చేరాడు. రామ్‌కుమార్ విజయంతో ఏటీపీ వరల్డ్ టూర్ సింగిల్స్‌లో ఏడోసారి భారత్ ఫైనల్‌కు చేరినట్టయ్యింది.

Pages