S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/04/2018 - 00:22

వౌంట్ మాంగనుయ్ (న్యూజిలాండ్), ఫిబ్రవరి 3: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించిన అండర్-19 వరల్డ్ కప్‌ను భారత యువ సేన కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ఫైనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, తనకు తిరుగలేదని నిరూపించింది. ఓపెనర్ మన్‌జోత్ కల్రా అజేయ సెంచరీతో భారత్ విజయంలో కీకల భూమిక పోషించాడు.

02/04/2018 - 00:20

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీతో కదంతొక్కి నాటౌట్‌గా నిలిచిన భారత ఓపెనర్ మన్‌జోత్ కల్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో సెంచరీ సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. కాగా, ఈ టోర్నమెంట్ మొత్తంలో నిలకడగా రాణించిన భారత బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

02/04/2018 - 00:16

వౌంట్ మాంగనుయ్ (న్యూజిలాండ్), ఫిబ్రవరి 3: అండర్-19 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న నాలుగో భారతీయుడు శుభ్‌మన్ గిల్. ఇంతకు ముందు 2000లో యువరాజ్ సింగ్, 2004లో శిఖర్ ధావన్, 2006లో చటేశ్వర్ పుజారా ఈ అవార్డును స్వీకరించారు.

02/04/2018 - 00:16

ముంబయి, ఫిబ్రవరి 3: న్యూజిలాండ్‌లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, టైటిల్ సాధించిన పృథ్వీ షా కెప్టెన్సీలోని జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీ) నగదు నజరానా ప్రకటించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు 50 లక్షలు, జట్టులోని ఆటగాళ్లందరికీ తలా 30 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

02/04/2018 - 00:15

వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 3: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ సాధించిన భారీ విజయంగా ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించడం నమోదైంది. 2000లో మొదటిసారి ఈ టోర్నమెంట్ ఫైనల్ చేరినప్పుడు శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించింది. 2006లో రెండోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, పాకిస్తాన్ చేతిలో 38 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

02/04/2018 - 00:15

వౌంట్ మాంగనూయి, ఫిబ్రవరి 3: ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత యువసేన సాధించిన విజయం ‘ఒక జ్ఞాపకం’గా కోచ్, మెంటర్ రాహుల్ ద్రవిడ్ అభివర్ణించాడు. పరిణితి చెందిన క్రికెటర్లతోనే ఈ గెలుపు సాధ్యమైందని ఆయన అన్నాడు. ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న అతి పెద్ద విజయం ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంతో తీరిందని ఆయన పేర్కొన్నాడు.

02/04/2018 - 00:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఆమె చిరకాల ప్రత్యర్థి రచానొక్ ఇంతనాన్‌పై 21-13, 21-15 తేడాతో విజయం సాధించింది. కాగా, మహిళల సింగిల్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో జాంగ్ బివాన్ 14-21, 21-12, 21-19 స్కోరుతో చెంగ్ గాన్ ఈని ఓడించింది ఫైనల్ చేరింది.

02/04/2018 - 00:11

చిట్టగాంగ్, ఫిబ్రవరి 3: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకకు 200 పరుగుల ఆధిక్యం లభించింది. తొమ్మిది వికెట్లకు 713 పరుగుల భారీ స్కోరువద్ద లంక మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

02/04/2018 - 00:08

సెంచూరియన్, ఫిబ్రవరి 3: దక్షిణాఫ్రికాతో జరిగే ఆరు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లలో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ క్రికెట్ జట్టు ఇపుడు ఆదివారం జరిగే రెండో వనే్డపై దృష్టి సారించింది. డర్బన్‌లో గురువారం జరిగిన తొలి వండేలో ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్‌కు ప్రత్యర్థి జట్టులో కొందరు గాయాల బారిన పడడంతో కలసిసొచ్చేది అంశంగా భావిస్తోంది.

02/04/2018 - 00:07

సిడ్నీ, ఫిబ్రవరి 3: ముక్కోణపు టీ-20 క్రికెట్ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డక్‌వర్డ్ లూయిస్ విధానంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. టెయిలెండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 38 (నాటౌట్) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Pages