S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/31/2018 - 23:30

దర్బన్, జనవరి 31: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడగలమన్న నమ్మకం... జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్టులో విజయం సాధించడంతో వచ్చిన రెట్టించిన ఆత్మవిశ్వాసం భారత క్రికెట్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

01/31/2018 - 23:29

న్యూఢిల్లీ, జనవరి 31: హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సస్పెన్షన్ వేటు వేసింది. అతనిని రెండు మ్యాచ్‌ల నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

01/31/2018 - 23:28

ముంబయి, జనవరి 31: భారత అండర్-19 కెప్టెన్, యువ సంచలన ఆటగాడు పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 5 నుండి చెన్నైలో జరిగే ఇంటర్-స్టేట్ వనే్డ ఇంటర్నేషనల్ టోర్నమెంటులో ఆడే 16 మంది సభ్యులు గల జట్టులో ఒకడిగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన ఆదిత్య థారే నాయకత్వం వహించనున్నాడు.

01/31/2018 - 23:27

న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 48 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రపంచ మాజీ చాంపియన్ మేరీ కోమ్ (కుడి). సెమీస్‌లో ఆమె మంగోలియాకు చెందిన అట్లాన్‌సెట్సెంగ్ లుసైకాన్‌ను ఓడించింది. కాగా, శివ థాపా, మనోజ్ కుమార్ తమతమ సెమీ ఫైనల్ ఫైట్స్‌లో పరాజయాలను
ఎదుర్కొని, కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు.

01/31/2018 - 23:25

న్యూఢిల్లీ, జనవరి 31: త్వరలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో 20 లక్షల రూపాయలకు ఢిల్లీ డేర్ డెవిల్ జట్టు కొనుగోలు చేసిన 17 ఏళ్ల నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచ్‌హనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్ల్ దృష్టిని ఆకర్షించాడు. లెగ్‌స్పిన్నర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సందీప్ బౌలింగ్ ప్రతిభ తనను ఎంతో ఆకట్టుకుంటోందని క్లార్క్ ప్రశంసిస్తున్నాడు.

01/31/2018 - 23:24

కరాచీ, జనవరి 31: భారత్ క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వంటి కోచ్ తమ దేశానికి కూడా అవసరమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. భారత యువ క్రికెటర్లు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చేసిన కృషిలో ద్రవిడ్ పాత్ర ఎంతో ఉందని అన్నాడు. మంగళవారం జరిగిన అండర్-19 సెమీఫైనల్స్‌లో భారత్ 203 పరుగులతో పాక్‌కు మట్టికరిపించిన సంగతి తెలిసిందే.

01/31/2018 - 23:24

న్యూఢిల్లీ, జనవరి 31: అవిశ్రాంతంగా టోర్నీలు, సిరీస్‌లు ఆడడం కష్టంగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులకు సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ లేఖ రాసింది. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలో జరిగే ఆసియా టీం చాంపియన్‌షిప్ పోటీల నుంచి తనను తప్పించాల్సిందిగా ఆమె తన లేఖలో కోరింది.

01/31/2018 - 23:23

క్వీన్స్‌లాండ్ (న్యూజిలాండ్), జనవరి 31: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఐదో స్థానం దక్కించుకుంది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 41.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది.

01/31/2018 - 23:22

చిట్టగాంగ్, జనవరి 31: మోమునుల్ హక్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో, శ్రీలంకతో బుధవారం ఇక్కడ మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 374 పరుగుల భారీ స్కో చేయగలిగింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (52), ముష్ఫికర్ రహీం (92) అర్ధ శతకాలతో రాణించి, ఈ భారీ స్కోరుకు సహకరించారు.

01/31/2018 - 01:11

క్రిస్ట్‌చర్చ్, జనవరి 30: అండర్-19 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ విజయఢంకా మోగించి ఫైనల్‌కు చేరువకావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాతో హోరాహోరీగా తలపడితే ఏడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకోవచ్చని పలువురు ఆశిస్తున్నారు.

Pages