S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/04/2018 - 00:06

వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 3: దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న పట్టుదలతో కాలి నొప్పిని సైతం లెక్కచేయకుండా అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు పేసర్ ఇషాన్ పొరెల్ వెళ్లాడు. పూర్తి ఫిట్నెస్ లేకపోయినా, అక్కడ తన ఎంపికకు పూర్తి న్యాయం చేశాడు. సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 6 ఓవర్లు బౌల్ చేసి, 17 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

02/03/2018 - 00:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు సెమీ ఫైనల్స్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఆమె బిట్రిజ్ కొరల్స్‌ను 21-12, 19-21, 21-11 తేడాతో ఓడించింది. మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఇప్పుడు సింధు ఒక్కతే పోరాటాన్ని కొనసాగిస్తున్నది. మిగతా వారు పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు.

02/03/2018 - 00:50

కాబూల్, ఫిబ్రవరి 2: అండర్-19 వరల్డ్ కప్‌లో మూడో స్థానానికి పాకిస్తాన్‌తో జరగాల్సిన క్లాసిఫికేషన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, గ్రూప్ దశలో పాయంట్ల ఆధారంగా అఫ్గానిస్తాన్ నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది. నిజానికి ఈ టోర్నీ తొలి గ్రూప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన అఫ్గానిస్తాన్ తన ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించింది.

02/03/2018 - 00:48

వౌంట్ మాంగనూయి, ఫిబ్రవరి 2: ఆస్ట్రేలియాతో శనివారం జరిగే అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌లో తమ టీమ్‌కు పేసర్లే కీలకం కానున్నారని భారత జట్టు కెప్టెన్ పృథీ షా అన్నాడు. ఇప్పటికే అండర్-19 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో మూడుసార్లు విజయం సాధించిన భారత్ నాలుగోసారి గెలుపు కోసం ఉవ్విళ్లూరుతోంది.

02/03/2018 - 00:46

డర్బన్, ఫిబ్రవరి 2: భారత్‌తో ఆరు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లలో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ బ్యాటింగ్ సమయంలో ఏ వికెట్‌కూ సరైన జోడీ కుదరనందువల్లనే తమ జట్టు పరాజయం పాలైందని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఈ వనే్డలో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో డుప్లెసిస్ 120 పరుగులు చేశాడు.

02/03/2018 - 00:43

వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 2: అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ కోసం శనివారం భారత్‌ను ఢీ కొంటున్న ఆస్ట్రేలియా జట్టులోకి వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ పాట్రిక్ రోవ్ చేరాడు. ఫాస్ట్ బౌలర్ జాసన్ రాల్‌స్టన్ గాయ పడడంతో ఆసీస్ అండర్-19 జట్టులో అవకాశాన్ని దక్కించుకున్న ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ కాలి కండరాలు బెణకడంతో బాధపడుతున్నాడు.

02/03/2018 - 00:41

డర్బన్, ఫిబ్రవరి 2: దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి వండే ఇంటర్నేషనల్ టోర్నీలో తాను మూడు వికెట్లు తీయడం వెనుక ఎం.ఎస్ ధోని పాత్ర ఎంతో ఉందని భారత ఎడమచేతివాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. మ్యాచ్‌కు ముందు ధోని ఇచ్చిన సలహాలు, సూచనలు వికెట్లు తీయడంలో దాదాపు యాభై శాతం తనకు ఎంతో ఉపకరించాయని అన్నాడు.

02/03/2018 - 00:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఈ సీజన్‌లో ఆడిన అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలలో ఒక్క మ్యాచ్‌లోనూ ఒటమి చెందని భారత యువ క్రికెట్ జట్టు శనివారం జరుగబోయే తుదిపోరుకు అస్తశ్రస్త్రాలు సంధిస్తోంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీకొని కప్‌ను ఎగురవేసుకు పోయేందుకు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. సెమీఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను కేవలం 69 పరుగులకే మట్టికరిపించింది.

02/03/2018 - 00:36

తెహ్రాన్, ఫిబ్రవరి 2: ఆసియా ఇన్‌డోర్ అథ్లెటిక్స్ పురుషుల 60 మీటర్ల స్ప్రింట్‌లో భారత్‌కు చెందిన ఏకలవ్య దసన్‌కు కాంస్య పతకం లభించింది. ల క్ష్యాన్ని 6.67 సెకన్లలో పూర్తి చేసిన అతను మూడో స్థానాన్ని సంపాదించడంతోపాటు, కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఈ పరుగులో స్థానిక అథ్లెట్లు అఫ్‌తియాన్ (6.51 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధిం చగా, ఒగునొప్ లోసిజొసెప్ (6.63 సెకన్లు) రజత పతకాన్ని అందుకున్నాడు.

02/03/2018 - 00:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆర్‌బీసీ టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్-అమెరికన్ జోడీ లియాండర్ పేస్, జియో సాలిస్‌బరీ సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. ఇక్కడ జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్‌లో వారిద్దరూ రూబెన్ గోంజలెస్, హంటర్ రీజ్ జోడీని 6-3, 2-6, 16-15 తేడాతో ఓడించారు. గంట 31 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 67 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకున్నారు.

Pages