S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/30/2018 - 00:30

మెల్బోర్న్, జనవరి 29: మేజర్ టైటిళ్లను సాధించిన వారు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన కరోలిన్ వొజ్నియాకి అందరి కంటే భిన్నంగా, ఒక బోటులో ట్రోఫీని పెట్టుకొని షికార్లు చేస్తూ మురిసిపోయింది. శనివారం జరిగిన ఫైనల్‌లో సిమోనా హాలెప్‌ను ఓడించి వొజ్నియాకి కెరీర్‌లో మొదటిసారి మేజర్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

01/30/2018 - 00:29

న్యూఢిల్లీ, జనవరి 29: భారత బాడ్మింటన్ సార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఇండియా ఓపెన్ టోర్నీలో ఫేవరిట్స్‌గా దిగనున్నారు. 350,000 డాలర్ల ప్రైజ్‌మనీ కలిగిన ఈ పోటీ మంగళవారం ప్రారంభం కానుంది. గత వారం జరిగిన ఇండోనేషియా మాస్టర్ టోర్నీని వదులుకున్న 2014 చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఇండియా ఓపెన్‌లో పాల్గొంటాడు.

01/30/2018 - 00:28

క్రైస్ట్‌చర్చ్, జనవరి 29: బెంగళూరులో రెండురోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం పాటలో భారత యువ క్రికెటర్ల ఎంపిక ప్రభావం ఇక్కడ జరుగబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్స్‌లో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది.

01/30/2018 - 00:26

జోహానె్సస్‌బర్గ్, జనవరి 28: ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత్ జట్టు పేసర్ బుమ్రా అక్కడి పిచ్‌లపై ఆడేందుకు పనికిరాడని వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు మిచెల్ వ్యాఖ్యానించాడు. బుమ్రా కొత్త బంతులతో అంతగా రాణించలేడని, తన దృష్టిలో అతను అక్కడి పిచ్‌లపై బౌలింగ్‌కు పనికిరాడని ఆయన స్పష్టం చేశాడు. కొత్త బంతితో కుడిచేతివాటం బ్యాట్స్‌మెన్‌లపై బౌలింగ్ చేయడానికి బుమ్రాకు ఇబ్బంది పడతాడని అన్నాడు.

01/30/2018 - 00:25

న్యూఢిల్లీ, జనవరి 29: తుపాకీ మోతలతో, ఉగ్రవాద దాడులతో దద్దరిల్లిపోతున్న అఫ్గానిస్తాన్ అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నది. ఆ పరిస్థితుల ప్రభారం క్రీడా రంగంపైన కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇస్లామిక్ మత చాందసవాదులు సృష్టిస్తున్న అడ్డంకులను అధిగమిస్తూ, ఎప్పుడు ఏం జరుగుతుందోన్న భయాందోళనలు వెంటాడుతున్నప్పటికీ ధైర్యంగా క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి యువతీయువకులు ముందుకొస్తున్నారు.

01/30/2018 - 00:24

గౌహతి, జనవరి 29: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ తలిమెరెన్ ఆవో పేరిట పోస్టల్ స్టాంపు విడుదలైంది. తలిమెరెన్ శత జయంతి సందర్భంగా సోమవారం అసోం గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖీ పోస్టల్ స్టాంపును విడుదల చేశాడు. 1940 వరకు మోహన్ బగాన్ పేరిట జరిగిన పలు టోర్నీలకు ఆవో ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా 1948 సంవత్సరంలో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో భారత్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

01/30/2018 - 00:22

కోల్‌కతా, జనవరి 29: ఢిల్లీ ఆటగాడు, రంజీల్లో ఆ జట్టుకు నాయకత్వం వహించిన స్టార్ ఓపెనర్ గౌతం గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభమైన కొత్తల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటికీ, ఆతర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వలస వెళ్లాడు. ఏడు సంవత్సరాలు ఆ జట్టుకు ఆటగాడిగా, కెప్టెన్‌గా సేవలు అందించాడు. అతని నాయకత్వంలోనే నైట్ రైడర్స్ 2012, 2014 సంవత్సరాల్లో ఐపీఎల్ విజేతగా నిలిచింది.

01/29/2018 - 02:00

బెంగళూరు, జనవరి 28: కోరుకున్న ఆటగాడిని దక్కించుకోవడానికి భారీ మొత్తాలను వెచ్చించడానికి వెనుకాడని రాజస్థాన్ రాయల్స్ మరోసారి అదే దూడుకును ప్రదర్శించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాట రెండో రోజున ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనాద్కత్‌కు ఏకంగా 11.5 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ వేలంలో అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్న భారత క్రికెటర్ అతనే.

01/29/2018 - 01:57

బెంగళూరు, జనవరి 28: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఊరట లభించింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అతనిని రెండు కోట్ల రూపాయలకు కొన్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మొదటి రోజు, శనివారం రెండు కోట్ల బేస్ ప్రైస్ ఉన్న అతనిని తీసుకోవడానికి ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. చివరికి అతను గతంలో ప్రాతినిథ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఆసక్తి ప్రదర్శించలేదు.

01/29/2018 - 01:55

మెల్బోర్న్, జనవరి 28: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్ తన ప్రత్యర్థి, క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్‌ను 6-2, 6-7, 6-3, 2-6, 6-1 తేడాతో ఓడించి, ఆరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీని అందుకున్నాడు.

Pages