S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/27/2017 - 00:13

బ్రిస్మేన్, నవంబర్ 26: ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలగా, ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ మొదటి టెస్టుపై పట్టు బిగించిన ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 114 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 56 పరుగులు చేయాల్సి ఉండగా, పది వికెట్లు చేతిలో ఉన్నాయి.

11/27/2017 - 00:10

కౌలూన్ (హాంకాంగ్), నవంబర్ 26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ (చైనా)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె తీవ్ర స్థాయిలో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. 18-21, 18-21 తేడాతో పరాజయాన్ని చవిచూసి, రన్నరప్ ట్రోఫీని తీసుకుంది.

11/27/2017 - 00:07

అమెరికాలో ప్రత్యేక శిక్షణ పొందేందుకు సిద్ధమైన ఏడుగురు భారత బాక్సర్లకు నిరాశ ఎదుదైంది. సకాలంలో వీసాలు రాకపోవడంతో వారు అమెరికా వెళ్లలేకపోతున్నట్టు భారత బాక్సింగ్ సమాఖ్య హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ సాంటియాగో నీవా పిటిఐతో మాట్లాడుతూ స్పష్టం చేశాడు.

11/27/2017 - 00:07

గౌహతి, నవంబర్ 26: మహిళల యూత్ బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో నీతు, జ్యోతి గులియా, సాక్షి చౌదరి, శశి చోప్రా విజేతగాలుగా నిలిచారు. 48 కిలోల విభాగంలో ఖజకస్తాన్‌కు చెందిన జజిరా ఉరాక్‌బయెవాను ఓడించిన నీతు భారత్ స్వర్ణాల ఖాతాను తెరిచింది. 51 కిలోల విభాగంలో జ్యోతి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎకతెరినా మల్చనొవాపై విజయాన్ని నమోదు చేసింది.

11/27/2017 - 00:05

దోన్‌గువాన్ (చైనా), నవంబర్ 26: భారత అథ్లెట్ గోపీ థోనకల్ ఇక్కడ జరిగిన ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. లక్ష్యాన్ని అతను రెండు గంటల, 15.48 నిమిషాల్లో పూర్తి చేసి, ఆసియా మారథాన్‌ను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు.

11/27/2017 - 00:05

బారాముల్లా జిల్లా (కాశ్మీర్) కున్జార్‌లో జరిగిన చినార్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కి సైనిక దుస్తుల్లో హాజరైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆర్మీలో అతనికి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉంది

11/27/2017 - 00:03

న్యూయార్క్‌లో జరిగిన లైట్ హెవీవెయిట్ టైటిల్ బౌట్‌లో ఉక్రెయిన్‌కు చెందిన వచెస్లావ్ షాబ్రాన్‌స్కీని ఓడించి, బెల్ట్‌ను సొంతం చేసుకున్న రష్యా బాక్సర్ సెర్గీ కొవాలెవ్. షాబ్రాన్‌స్కీ తీవ్రంగా గాయపడడంతో, రెండో రౌండ్‌లోనే ఈ ఫైట్‌ను నిలిపేసి కొవాలెవ్‌ను విజేతగా ప్రకటించారు

11/27/2017 - 00:02

మాడ్రిడ్, నవంబర్ 26: క్రిస్టియానో రొనాల్డో కీలక గోల్ చేసి, స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో మలగాతో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్‌ను గెలిపించాడు. ఇరు జట్లు చెరి రెండు గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలవగా, దాదాపు మ్యాచ్ చివరి వరకూ డెడ్ లాక్ కొనసాగింది. ఆఖరి క్షణాల్లో రొనాల్డో గోల్ సాధించి, రియల్ మాడ్రిడ్‌కు విజయాన్ని అందించాడు.

11/26/2017 - 01:11

కెరీర్‌లో మురళీ విజయ్ 10వ, చటేశ్వర్ పుజారా 14వ శతకాన్ని నమోదు చేశారు. 2016-17 సీజన్‌లో వీరు మొత్తం 11 భాగస్వామ్యాల్లో సగటున 105.72 పరుగులను జోడించడం విశేషం. ఈ భాగస్వామ్యాలు వరుసగా 112, 133, 27, 23, 209, 47, 16, 107, 178, 102, 209 పరుగులు. వందకుపైగా పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేయడం వీరికి వరుసగా ఇది నాలుగోసారి. గత ఏడు ఇన్నింగ్స్‌లో ఐదోసారి.

11/26/2017 - 01:09

నాగపూర్, నవంబర్ 25: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. లంక బౌలింగ్‌ను చిత్తుచేసిన భారత ఓపెనర్ మురళీ విజయ్, ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా శతకాలు సాధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి, లంక బౌలింగ్‌లో పస లేదని నిరూపించాడు.

Pages