S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/26/2017 - 01:06

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు తేజం పీవీ సింధు. సెమీ ఫైనల్‌లో ఆమె రచానొక్ ఇంతనాన్‌ను 21-17, 21-17 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్ కోసం ఆమె తాయ్ జూ ఇంగ్‌తో తలపడుతుంది. మరో సెమీ ఫైనల్‌లో సంగ్ జీ హ్యున్‌పై 21-9, 18-21, 21-7 ఆధిక్యంతో విజయం సాధించిన తాయ్ జూ ఇంగ్ ఫైనల్ చేరింది.

11/26/2017 - 01:04

బ్రిస్బేన్, నవంబర్ 25: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను పరుగులు చేయకుండా అడ్డుకోవడానికి ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఒకప్పటి ‘బాడీలైన్’ ఉదంతంలో మాదిరిగానే ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు. 1932-33లో ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు, సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను కట్టడి చేయడానికి అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లస్ జార్డిన్ ‘బాడీలైన్’ వ్యూహాన్ని అమలు చేశాడు.

11/26/2017 - 01:04

బ్రిస్బేన్, నవంబర్ 25: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, అజేయ శతకాన్ని నమోదు చేసిన స్టీవెన్ స్మిత్ ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందించాడు. ప్రతికూల పరిస్థితుల్లో అతను చేసిని చేసిన ఈ శతకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆసీస్‌ను ఆదుకుంది.

11/26/2017 - 01:02

బెంగళూరు, నవంబర్ 25: మహిళల జాతీయ హాకీ క్యాంప్ ఆదివారం నుంచి ఇక్కడి భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సెంటర్‌లో ప్రారంభం కానుంది. ఈ శిబిరంలో పాల్గొనే 33 మంది క్రీడాకారిణుల పేర్లను హాకీ ఇండియా (హెచ్‌ఐ) శనివారం ప్రకటించింది. క్యాంప్ డిసెంబర్ 23 వరకూ కొనసాగుతుందని తెలిపింది. ఇటీవలే చైనాను ఓడించి ఆసియా కప్‌ను సాధించిన భారత మహిళల జట్టు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

11/26/2017 - 01:02

గౌహతి, నవంబర్ 25: మహిళల యూత్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ల హవా కొనసాగుతున్నది. శుక్రవారం ముగ్గురు బాక్సర్లు తమతమ విభాగాల్లో ఫైనల్స్ చేరగా, శనివారం మరో ఇద్దరు టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. 48 కిలోల విభాగంలో చైనాకు చెందిన యువాన్ నీని ఓడించిన నీతూ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. టైటిల్ కోసం జాజిరా ఉరాక్బయెవాను ఆమె ఢీ కొంటుంది.

11/26/2017 - 00:48

న్యూఢిల్లీ, నవంబర్ 25: పోలాండ్‌లో జరుగుతున్న అండర్-23 సీనియర్ ప్రపం రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రీతూ ఫొగత్‌కు రజత పతకం లభించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం 23 ఏళ్ల రీతూ 48 కిలోల విభాగంలో పోటీపడింది. ఫైనల్‌లో టర్కీకి చెందిన డెమిరాన్‌ను ఢీకొని పరాజయాన్ని ఎదుర్కొంది. చివరి వరకూ పోరాడినప్పటికీ 2-4 తేడాతో ఓడిన ఆమె రజత పతకంతో సంతృప్తి చెందింది.

11/26/2017 - 00:47

బార్సిలోనా, నవంబర్ 25: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మరో క్లబ్‌కు వెళతాడంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇటీవలే బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జర్మెయిన్‌కు రికార్డు ధరతో నేమార్ వలస వెళ్లడంతో, మెస్సీ కూడా అదే బాటులో నడుస్తాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, బార్సిలోనాతో ఒప్పందాన్ని మెస్సీ పొడిగించుకున్నాడు. 2021 వరకు అమల్లో ఉండే కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.

11/26/2017 - 00:45

మోనాకో, నవంబర్ 25: బెల్జియం హెప్ట్థ్లాన్ చాంపియన్ నఫిసాటూ థియామ్‌కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ఉత్తమ అథ్లెట్ అవార్డు లభించింది. మహిళల విభాగంలో ఈ ఏటి మేటి అథ్లెట్‌గా ఎంపికైన 23 ఏళ్ల థియామ్ 2013లో యూరోపియన్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. యూరోపియన్ ఇండోర్ చాంపియన్‌షిప్స్‌లోనూ సత్తా చాటింది.

11/25/2017 - 00:39

హాంకాంగ్, నవంబర్ 24: భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె అకానే యమాగూచీని 21-12, 21-19 తేడాతో వరుస సెట్లలో ఓడించి, రచానొక్ ఇంతనాన్‌తో సెమీస్ పోరును ఖాయం చేసుకుంది. ఇంతనాన్ క్వార్టర్స్‌లో మిచెలె లీపై 21-14, 21-16 ఆధిక్యంతో గెలిచింది.

11/25/2017 - 00:37

రోమ్, నవంబర్ 24: గతంలో ఏసీ మిలన్, రియల్ మాడ్రిడ్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన స్ట్రయికర్ రాబిన్హోకు కొర్టు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. 2013 జనవరిలో అల్బేనియాకు చెందిన ఓ యువతిని మానభంగం చేసినట్టు అతనిపై కేసు నమోదైంది. విచారణ పూర్తి చేసిన కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో మరో ఐదుగురు కూడా నేరానికి పాల్పడినట్టు కోర్టు పేర్కొంది.

Pages