S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/30/2017 - 00:53

మెల్బోర్న్, నవంబర్ 29: వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి, అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ ఆడుతుందా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ఆమె ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే ఇందుకు కారణం.

11/30/2017 - 00:51

మాస్కో, నవంబర్ 29: ప్రపంచ కప్ సాకర్-2018 టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌తో పాటు మస్కట్‌ను నిర్వాహకులు బుధవారం రష్యాలో ఆవిష్కరించారు. గోల్‌కీపర్‌గా రష్యా జట్టుకు ఎనలేని సేవలందించిన లివ్ యాషిన్ ఫొటోను ఈ పోస్టర్‌పై పొందుపర్చారు. అనంతరం మస్కట్‌ను విడుదల చేసిన నిర్వాహకులు, రష్యాలో కనిపించే తోడేలును ఈ మస్కట్‌కు ఎంచుకున్నారు. దీనికి ‘జబివాక’ అని నామకరణం చేశారు.

11/30/2017 - 00:50

ఇస్లామాబాద్, నవంబర్ 29: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ చనిపోయాడంటూ సామాజిక మాథ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే గాయం కారణంగా పాక్ జట్టుకు దూరమై ప్రస్తుతం ఫిట్నెస్ కోసం జాతీయ క్రికెట్ అకాడమీలో తంటాలు పడుతున్న ఉమర్ అక్మల్ ఈ పుకార్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

11/29/2017 - 00:48

న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ స్పిన్నర్ అశ్వినేనని, బంతితో అశ్విన్ సాధించిన విజయాలే అతని గొప్పతనానికి నిదర్శనమని మురళీధరన్ కొనియాడాడు.

11/29/2017 - 00:47

కోపెన్‌హాగన్, నవంబర్ 28: డెన్మార్క్ టెన్నిస్ తార కరోలిన్ వోజ్నియాకీ త్వరలో అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ లీని పెళ్లి చేసుకోనుంది. వీరి వివాహానికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. లీని తాను పెళ్లి చేసుకుంటున్నట్లు వోజ్నియాకీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ వేడుక జరిగింది. నిశ్చితార్థం ‘రింగ్’ ఫొటోలను వోజ్నియాకీ సోషల్ మీడియాలో పెట్టింది.

11/29/2017 - 00:46

నాగ్‌పూర్, నవంబర్ 28: టీమిండియాతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే చివరి టెస్టులో శ్రీలంక సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగన హెరత్ ఆడటం లేదు. ప్రస్తుతం అతను వెన్ను నొప్పితో బాధపడుతుండటమే ఇందుకు కారణం. దీంతో శ్రీలంక అతని స్థానంలో యువ లెగ్‌బ్రేక్ బౌలర్ జెఫ్రీ వాండెర్సేని జట్టులోకి తీసుకుంది.

11/29/2017 - 00:43

దుబాయ్, నవంబర్ 28: ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా మరో రెండు అడుగులు ముందుకేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ఇక్కడ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో పుజారా రెండు స్థానాలను మెరుగుపర్చుకుని ఉత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో మరోసారి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు.

11/28/2017 - 01:00

నాగపూర్, నవంబర్ 27: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచిన విరాట్ కోహ్లీ సేన ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో లంకను చిత్తుచేసింది. భారత్‌కు టెస్టుల్లో ఇదే భారీ విజయం. మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే లంక ఆలౌట్‌కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 610 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

11/28/2017 - 00:57

నాగపూర్, నవంబర్ 27: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌ల్లో 300 మైలురాయిని చేరిన బౌలర్ల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. లాహిరు గామగేను ఔట్ చేయడం ద్వారా భారత్‌ను విజయపథంలో నడిపించిన అశ్విన్ కెరీర్‌లో 300 వికెట్లు పూర్తి చేశాడు.

11/28/2017 - 00:56

నాగపూర్, నవంబర్ 27: అవిశ్రాంత షెడ్యూల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాల పట్ల జాతీయ సెలక్షన్ కమిటీ సానుకూలంగా స్పందించింది. శ్రీలంకతో జరగబోయే వనే్డ సిరీస్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చింది. అయితే, ఢిల్లీలో డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరిగే చివరి, మూడో టెస్టులో అతను ఆడతాడని ప్రకటించింది.

Pages