S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/01/2017 - 01:29

న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పాలనాధికారుల బృందం (సీఓఏ)తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. క్రికెటర్ల ఫీజును పెంచేందుకు సీఓఏ అంగీకరించింది. అంతేగాక, తీరిక లేని బిజీ షెడ్యూల్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది.

12/01/2017 - 01:27

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ ఇదే. 16 జట్లతో 44 రోజుల పాటు ఈ టోర్నీని నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే పోటీలకు సంబంధించిన ట్రోఫీని గురువారం వెల్లింగ్టన్ (న్యూజిలాండ్)లో ఆవిష్కరించారు.

12/01/2017 - 01:25

ఢాకా, నవంబర్ 30: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో గురువారం భారత్ పతకాల పంట పండించింది. మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలతోపాటు మరో రెండు కాంస్యాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. బాలురు, బాలికల విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు వచ్చే ఏడాది జరిగే యూత్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. బాలుర కెడెట్ విభాగంలో 14 ఏళ్ల ఆకాష్ (హర్యానా) 6-4 తేడాతో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఓడించాడు.

12/01/2017 - 01:23

కరాజీ, నవంబర్ 30: భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ 2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఎల్‌బీగా ఔటనప్పటికీ, అతనిని అంపైర్ నాటౌట్‌గా ఎందుకు ప్రకటించాడో, ఐసీసీ కూడా తన అప్పీల్‌పై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ వ్యాఖ్యానించాడు.

12/01/2017 - 01:21

ముంబయి, నవంబర్ 30: క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు టీ-10 ఫార్మాట్‌తోనే సాధ్యమని భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ హితవు పలికాడు.

12/01/2017 - 01:19

సిడ్నీ, నవంబర్ 30: బంతి తలకు బలంగా తగలడంతో ఫిలిప్ హూస్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్న వెంటనే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే బాగుండేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 2014 నవంబర్‌లో సిడ్నీ క్రికెట్ మైదానంలోనే ఒక దేశవాళీ మ్యాచ్ ఆడుతూ తలకు బంతి తగిలి తీవ్ర గాయం కావడంతో హూస్ మరణించాడు.

12/01/2017 - 01:33

భువనేశ్వర్, నవంబర్ 30: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, విశ్వ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవల ఢాకాలో జరిగిన ఆసియా కప్ టోర్నీలో టైటిల్ సాధించి మంచి ఊపుమీద ఉన్న భారత్ సులభంగా గెలుస్తుందని చెప్పలేకపోయినా, గట్టిపోటీని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.

11/30/2017 - 00:59

న్యూఢిల్లీ, నవంబర్ 29: టీమిండియా మాజీ కెప్టెన్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ సొంతం చేసుకున్న 10వ నెంబర్ జెర్సీ ఇకమీదట భారత క్రికెట్‌లో కనిపించకపోవచ్చు. ఈ జెర్సీకి శాశ్వతంగా వీడ్కోలు పలకనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనధికారికంగా వెల్లడించింది.

11/30/2017 - 00:56

హైదరాబాద్, నవంబర్ 29: రాత్రికి రాత్రి ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో రెండో రోజు క్రీడాపరిశ్రమలో వ్యాపార విజయం అంశంపై ప్రారంభమైన మాస్టర్ క్లాస్ సెషన్‌లో సానియా మాట్లాడారు. కొత్త క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమని అన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు.

11/30/2017 - 00:54

కొలంబో, నవంబర్ 29: శ్రీలంక వనే్డ క్రికెట్ జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగపై వేటు పడింది. ప్రస్తుతం భారత పర్యటన సందర్భంగా టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో ఆడే శ్రీలంక జట్టు సారథ్య బాధ్యతల నుంచి ఉపుల్ తరంగకు ఉద్వాసన పలికి అతని స్థానంలో థిసార పెరీరాను కెప్టెన్‌గా నియమించారు.

Pages