S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/29/2017 - 01:29

ధర్మశాల, మార్చి 28: లాంఛనం పూర్తయింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. స్వదేశంలో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ధర్మశాలలో ముగిసిన నిర్ణాయక చివరి మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి 2-1 తేడాతో ఈ సిరీస్‌ను గెలుచుకుంది.

03/29/2017 - 01:27

ధర్మశాల, మార్చి 28: ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను టీమిండియా నిలబెట్టుకుంది. కటాఫ్ తేదీగా ఉన్న ఏప్రిల్ 1 నాటికి వార్షిక ప్రపంచ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచినందుకు భారత జట్టు ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌తో పాటు 10 లక్షల డాలర్ల నగదు బహుమతిని కూడా గెలుచుకుంది.

03/29/2017 - 01:26

న్యూఢిల్లీ, మార్చి 28: నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో మట్టికరిపించిన టీమిండియా సభ్యులకు 50 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతులను అందజేయనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మంగళవారం ప్రకటించింది. అలాగే ఐసిసి టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియాకు బోర్డు అభినందనలు తెలిపింది.

03/29/2017 - 01:25

ధర్మశాల, మార్చి 28: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం ప్రతిష్టాత్మకమైన గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఈ ఏడాది అశ్విన్‌ను అత్యుత్తమ క్రికెటర్‌గానూ, అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌గానూ ప్రకటించడంతో అతడిని ఈ ట్రోఫీ వరించింది.

03/29/2017 - 01:23

హామిల్టన్, మార్చి 28: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది.

03/29/2017 - 01:22

ధర్మశాల, మార్చి 28: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా విదేశీ గడ్డపైన కూడా రాణించాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు. సొంత గడ్డపై ప్రత్యర్థి జట్లను వరసగా ఓడించిన కోహ్లీ సేన ఇక విదేశాల్లో సైతం ఇలాంటి ఫలితాలనే సాధించాలని అభిలషిస్తూ, విదేశాల్లో గెలిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుందన్నాడు. ‘మేము ఎప్పుడూ చేయాలనుకునేది అదే.

03/29/2017 - 01:19

ధర్మశాల, మార్చి 28: ప్రస్తుత జట్టు విదేశాల్లో సైతం ఓ సీజన్ అంతా రాణించినప్పుడు తన ముఖంపై చిరునవ్వు కాకుండా మరింత పెద్ద నవ్వును చూడగలుగుతారని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇటీవలి కాలంలో అత్యంత సుదీర్ఘ హోమ్ సిరీస్‌లో జరిగిన 13 టెస్టుల్లో 10 టెస్టులను గెలుచుకున్నా మీరు సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు, ఎందుకని? అని ప్రశ్నించగా ఇది దేనికీ ముగింపు కాదనే దానికి ఇదో చక్కటి ఉదాహరణ అని కోహ్లీ అన్నాడు.

03/29/2017 - 01:18

న్యూఢిల్లీ, మార్చి 28: ఉజ్బెకిస్తాన్‌తో డేవిస్ కప్ టెన్నిస్ పోరు కోసం భారత జట్టు కూర్పు విషయంలో నాన్-ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతి మంగళవారం ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లకే ఈ జట్టులో చోటు కల్పించిన భూపతి, వెటరన్ స్టార్ ఆటగాడైన లియాండర్ పేస్‌తో పాటు మరో డబుల్స్ ఆటగాడైన రోహన్ బొపన్ననను రిజర్వు సభ్యులుగా ఉంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

03/28/2017 - 03:36

ధర్మశాల, మార్చి 27: కంగారూలతో జరుగుతున్న నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా రంగాన్ని సిద్ధం చేసుకుంది.

03/28/2017 - 03:34

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 300 ఆలౌట్

Pages