S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/01/2017 - 02:20

మెల్బోర్న్, మార్చి 31: నాయకత్వ ప్రతిభను, బ్యాటింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవాలంటే కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ బ్రాడ్ హాడిన్ సూచించాడు. కోహ్లీ భుజం గాయాన్ని అతను ఒక పత్రికకు రాసిన వ్యాసంలో ప్రస్తావించాడు. ఆసీస్‌తో హోరాహోరీగా పోరాడిన భారత్ విజయం సాధించిందని, అయితే, ఈ సిరీస్‌లో కోహ్లీ రాణించలేకపోయాడని పేర్కొన్నాడు.

04/01/2017 - 02:18

మెల్బోర్న్, మార్చి 31: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒక సందర్భంలో వికెట్ తీసుకొని పొడిచేయాలని అనిపించినట్టు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఎడ్ కోవన్ చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ముగిసినప్పటికీ, కోహ్లీని లక్ష్యంగా చేసుకొని ఆస్ట్రేలియా మీడియా అనేకానేక కథనాలను ప్రచారం చేస్తునే ఉంది. మైదానంలో కోహ్లీ వ్యవహార శైలి బాగా ఉండదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోవన్ ఆరోపించాడు.

04/01/2017 - 02:15

కోల్‌కతా, మార్చి 31: తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లపై కోహ్లీ కొన్ని వ్యాఖ్యలు చేసివుంటాడని లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఆటగాళ్లతో స్నేహ బంధానికి తెరపడిందని, ఇకపై వారు ఎన్నటికీ తన మిత్రులు కాలేరని ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై వార్న్ స్పందిస్తూ, భారత్, ఆసీస్ మధ్య పోరు హోరాహోరీగా సాగిందని అన్నాడు.

03/31/2017 - 07:08

న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ అవార్డులు స్వీకరిస్తున్న అంధ క్రికెటర్ శంకర్ నాయక్, రియో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన త్రోయర్ దీపా మాలిక్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

03/31/2017 - 01:30

న్యూఢిల్లీ, మార్చి 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను ఎప్పుడైనా నిర్వహంచుకోవచ్చని, అందుకు తమ అనుమతి అనవసరమని పాలనాధికారల బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. గురువారం ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ ఎస్‌జిఎంను ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో సిఒఎ జోక్యం చేసుకోదని అన్నాడు.

03/31/2017 - 01:28

న్యూఢిల్లీ, మార్చి 30: ఆస్ట్రేలియా క్రికెటర్లతో స్నేహ సంబంధాల విషయంలో తన ఆలోచన మారిందని, వారితో ఎలాంటి స్నేహం లేదని తాను చేసిన వ్యాఖ్యలపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లతో తాను భవిష్యత్తులో ఎన్నడూ స్నేహ సంబంధాలు పెట్టుకోనన్నది తన ఉద్దేశం కాదని ట్వీట్ చేశాడు.

03/31/2017 - 01:26

న్యూఢిల్లీ: ఈసారి ఐపిఎల్ సందర్భంగా మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే క్రికెట్ సంఘాలకు, ఆయా మ్యాచ్‌ల ఆరంభానికి ముందే బిసిసిఐ నుంచి వాటా లభించనుంది. ఒక్కో మ్యాచ్‌కి 60 లక్షల రూపాయలు చొప్పున సంబంధిత క్రికెట్ సంఘాలకు చెల్లిస్తున్నారు. ఇందులో 30 లక్షల రూపాయలను స్థానిక ఫ్రాంచైజీ మ్యాచ్‌కి ముందు, మిగతా 30 లక్షల రూపాయలను బిసిసిఐ మ్యాచ్ ముగిసిన తర్వాత చెల్లించడం ఆనవాయితీగా వస్తున్నది.

03/31/2017 - 01:25

న్యూఢిల్లీ, మార్చి 30: భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య నడుస్తున్న వాగ్వాదాలు, దూషణలు, క్షమాపణలకు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. మార్చి 30వ తేదీని క్షమాపణల దినంగా ప్రకటించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీపై విమర్శలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ బ్రాడ్ హాడ్జ్ ఆతర్వాత క్షమాపణలు కోరడంపై అశ్విన్ తీవ్రంగా స్పందించాడు.

03/31/2017 - 01:24

కరాచీ, మార్చి 30: గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకుండా నిర్లక్ష్యం చేస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై కేసును నమోదు చేయడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సన్నాహాలు చేస్తున్నది. త్వరలో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశాల సమయంలో ఈ వివాదాన్ని పిసిసి లేవనెత్తనుంది.

03/31/2017 - 01:22

న్యూఢిల్లీ, మార్చి 30: ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. అతను ప్రీ క్వార్టర్స్‌లో తన కంటే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న హున్ యూ (హాంకాంగ్)పై 21-17, 21-15 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించాడు. అయితే, అతని సోదరుడు సౌరభ్ వర్మ పోరాటం ముగిసింది.

Pages