S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/25/2017 - 01:52

ధర్మశాల, మార్చి 24: గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పేరును చివరి టెస్టుకు భారత అధికారులు అధికారికంగా జట్టు జాబితాలో చేర్చారు. దీనితో అతను ఈ మ్యాచ్ ఆడతాడన్న వాదన బలపడుతున్నది. కాలి గాయంతో బాధపడిన షమీ, కోలుకున్న తర్వాత విజయ్ హజారే టోర్నీలో ఆడాడు. దీనితో అతని ఫిట్నెస్‌పై అనుమానాలు లేవని సెలక్షన్ కమిటీ భావిస్తున్నది.

03/25/2017 - 01:52

మెల్బోర్న్, మార్చి 24: టీమిండియాను భారత్‌లోనే టెస్టు సిరీస్‌లో ఓడించడం ద్వారా ఒక అద్భుతాన్ని సాధించాల్సిందిగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ అలాన్ బార్డర్ పిలుపునిచ్చాడు. భారత జట్టును భారత్‌లోనే ఓడించడం సులభం కాదని స్పష్టం చేశాడు.

03/25/2017 - 01:59

ధర్మశాల, మార్చి 24: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆశీర్వాదంతో తాను ప్రశాంతంగా నిద్రపోతానని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఉదయం అతను తన సహచరులతో కలిసి దలైలామాను కలిశాడు. ఆయన నుంచి ఆశీర్వాదం పొందాడు.

03/25/2017 - 01:49

ధర్మశాల, మార్చి 24: ఆస్ట్రేలియాతో జరిగే చివరిదైన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అన్న ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తుండగా, భారత క్రికెట్ అధికారులు ప్రత్యామ్నాయాలను విశే్లషించుకున్నారు. ముందు జాగ్రత్తగా శ్రేయాస్ అయ్యర్‌ను పిలిపించారు. శుక్రవారం అయ్యర్ నెట్స్‌కు హాజరుకాగా, కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే అతనితో చర్చించడం కనిపించింది.

03/25/2017 - 01:34

న్యూఢిల్లీ, మార్చి 24: ధర్మశాలలో జరిగే నాలుగో టెస్టుతోపాటు, ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం కూడా నిధులు ఇవ్వాలని బిసిసిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. భారీ మొత్తాల్లో నిధులు ఉన్నప్పటికీ కొన్ని సభ్య సంఘాలు వివిధ మ్యాచ్‌లను నిర్వహించేందుకు నిధులు కోరుతున్నాయని ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాలనాధికారుల కమిటీ (సిఒఎ) పేర్కొన్న విషయం తెలిసిందే.

03/24/2017 - 01:43

ధర్మశాల, మార్చి 23: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు సమీపిస్తున్నకొద్దీ, అందరిలోనూ క్షణక్షణానికీ ఉత్కంఠ పెరుగుతున్నది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు మాటల ఈటెలు విసురుకుంటున్నారు. వాగ్వాదాలకు దిగుతున్నారు. మైదానంలో యుద్ధపూరిత వాతావరణానికి కారణమవుతున్నారు.

03/24/2017 - 01:41

ధర్మశాల, మార్చి 23: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం నెట్స్‌కు దూరంగా ఉన్నాడు. మిగతా ఆటగాళ్లంతా తొలుత రొటీన్ వామప్‌లో, ఆతర్వాత నెట్స్‌లో శ్రమించగా, చేతికి బ్యాండేజీ వేసుకొని కనిపించిన కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. అతను వామప్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హత్ పర్యవేక్షణలో అతను కొంత సేపు రొటీన్ ఎక్సర్‌సైజ్‌లు చేశాడు.

03/24/2017 - 01:39

మియామీ, మార్చి 23: ప్రపంచ మాజీ నంబర్ వన్ యుగెనీ బుచార్డ్‌కు ఇక్కడ ఆరంభమైన మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రీడాకారిణి ఆష్లే బార్టీ 6-4, 5-7, 6-3 తేడాతో విజయం సాధించి, బుచార్డ్‌కు షాకిచ్చింది. రెండో రౌండ్‌లో ఆమె తన దేశానికే చెందిన సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌ను ఢీ కొంటుంది.

03/24/2017 - 01:38

అకాపల్కో (మెక్సికో), మార్చి 23: ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ డబుల్ ట్రాప్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 80 పాయింట్లకుగాను అతను 75 పాయింట్లు సంపాదించాడు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన అంకుర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై రాణించి, భారత్‌కు పతకాన్ని సాధించిపెట్టాడు.

03/24/2017 - 01:38

న్యూఢిల్లీ, మార్చి 23: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా కక్ష కట్టినట్టు వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ జాబితాలో బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా చేరాడు. కోహ్లీ పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు, అక్కడి మీడియా అనుసరిస్తున్న వైఖరి సిగ్గుచేటని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే టీమిండియా మొత్తం కోహ్లీకి మద్దతు ప్రకటించింది.

Pages