S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/30/2017 - 01:21

విజయవాడ, డిసెంబర్ 29: రాష్ట్రంలో ప్రవహించే అన్ని నదులను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా చేయడానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం విజయవాడ దుర్గాఘాట్ ఆవరణలో ప్రకాశం బ్యారేజీ 60 వసంతాల వేడుకలకు సీఎం చంద్రబాబు హాజయర్యారు. ప్రకాశం బ్యారేజీ 60 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

12/30/2017 - 03:49

హైదరాబాద్, డిసెంబర్ 29: అధిక రద్దీని నివారించేందుకు గాను 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ-కాకినాడ పోర్టు-కాచిగూడ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

12/29/2017 - 03:48

తంబళ్లపల్లె, డిసెంబర్ 27: వైఎస్సార్‌సిపి అధినేత జగన్ చేపట్టిన మహాసంకల్ప పాదయాత్ర గురువారం ఉదయం 9గంటలకు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పూలకుంట మండలం బలిజపల్లె శివారులో బసచేసిన జగన్, గురువారం ఉదయం 8.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. జిల్లాలోకి ప్రవేశించడంతో మహిళలు మంగళ హారతులతో, రోడ్డు పొడవునా పూలబాటలో జగన్‌కు స్వాగతం పలికారు.

12/29/2017 - 03:46

తిరుపతి, డిసెంబర్ 28: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సప్తగిరులు భక్తుల గోవింద నామ స్మరణతో మారుమోగుతున్నాయ. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం నుంచే భక్తులు వివిధ మార్గాల ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు.

12/29/2017 - 03:18

హైదరాబాద్, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్‌కు రూ.1.81 కోట్లు నష్టం కలిగించిన కేసులో ఆ శాఖలోని ఉద్యోగి రాయల ప్రభాకరరావును హైదరాబాద్ నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 2005-06లో ఈ సంస్ధలో సీడ్ ఆఫీసర్ కమ్ జిల్లా మేనేజర్‌గా ఆయన పని చేశారు. లోపం ఉన్న విత్తనాలను సేకరించి వాటిని రైతులకు పంపిణీ చేసినట్లు ప్రభాకరరావుపై అభియోగం నమోదైంది.

12/29/2017 - 02:59

హైదరాబాద్, డిసెంబర్ 28: సినిమా టిక్కెట్ల ధరలను ఎంతెంత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారో ఆ వివరాలను తరగతుల వారీగా జనవరి 3లోగా తమ ముందు ఉంచాలని హైకోర్టు ఎపి, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. సినిమా టిక్కెట్ల ధరలను పెంచే నిర్ణయం తీసుకోవడంలో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని కొందరు థియేటర్ యజమానులు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

12/29/2017 - 02:58

హైదరాబాద్, డిసెంబర్ 28: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దళితుల శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు ఇవ్వకుండా ఇప్పటికే జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి 19వ తేదీ వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు.

12/29/2017 - 02:24

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో వివిధ పీజీజి, యూజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారైంది. ఈసారి అన్ని పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రవేశపరీక్ష మాత్రం ఆన్‌లైన్ నుండి మినహాయించారు. ప్రవేశపరీక్షల నిర్వహణ అవకాశం అన్ని వర్శిటీలకు కల్పించినా, కేవలం నాలుగు యూనివర్శిటీలు మాత్రమే ముందుకు వచ్చాయి.

12/29/2017 - 02:24

హైదరాబాద్, డిసెంబర్ 28: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, మానవ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న టిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఓడిస్తారని టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులతో కలిసి జనంలోకి

12/29/2017 - 02:19

ఫిరంగిపురం, డిసెంబర్ 28: గుంటూరు- కర్నూలు రాష్ట్ర రహదారి నెత్తురోడింది. గురువారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా, అదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Pages