S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/26/2017 - 01:53

అమరావతి, డిసెంబర్ 25: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిపై గత వారం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీడీపీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడయిన కేఈ ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం ఖరారు చేశారు. దానిపై గత వారం రోజుల నుంచి సీటు ఆశిస్తున్న నేతలతో పార్టీ సీనియర్లు చర్చలు జరిపారు.

12/26/2017 - 01:51

అమరావతి, డిసెంబర్ 25: దేశంలోనే తొలిసారిగా ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలన్న విప్లవాత్మక ఆలోచన కార్యరూపం దాల్చనుంది. కేవలం రూ.149కే ఇంటింటికీ ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం అందించే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును ఈనెల 27న భారత రాష్టప్రతి కోవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ పథకంతో 55 గ్రామాల్లోని లక్ష ఇళ్లకు అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

12/26/2017 - 01:49

అమరావతి, డిసెంబర్ 25: కేవలం నెలకు రూ.149కే టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం (డేటా, వాయిస్, వీడియో సేవలు) సమకూరను న్నాయ. ఫైబర్‌నెట్‌తో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలన్న చంద్రబాబు దార్శనికతకు ఈ ప్రాజెక్టు అద్దంపడు తుంది. విద్యుత్ స్తంభాలు ఆసరాగా ఫైబర్ గ్రిడ్ పథకం రూపుదిద్దుకుంది.

12/25/2017 - 04:34

సర్వ మతమ్ముల సారము
సర్వ జనహితము సుఖముల సందేశమెయై
గర్వముగా జనులందరు
పర్వమునందోలలాడి పులకించుటయే!
*
పాఠకులు, చందాదారులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలకు క్రిస్‌మస్ పర్వదిన శుభాకాంక్షలు.
*

- చీఫ్ ఎడిటర్

12/25/2017 - 04:00

తిరుపతి, డిసెంబర్ 24: సంవత్సరాంతం, క్రిస్మస్, వారాంతపు సెలవులు రావడంతో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సర్వదర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది. సాయంత్రం 6 గంటల వరకు 61,705 మంది స్వామివారిని దర్శించుకున్నారు. మరో 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం ఉదయానికి లక్ష మందికి పైగా భక్తులు తిరుమలేశుని దర్శించుకునే అవకాశం ఉంది.

12/25/2017 - 03:57

తిరుపతి, డిసెంబర్ 24: నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో కొలువైన ఉత్సవాల దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ఉత్సవం ప్రణయ కలహోత్సవం జనవరి 3వ తేదీన తిరుమలలో టీటీడీ నేత్రపర్వంగా నిర్వహించనుంది.

12/25/2017 - 02:41

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న ‘స్కిల్ డెవలప్‌మెంట్’ శిక్షణ, తదితర కార్యక్రమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, వంశపారంపర్యంగా లభిస్తున్న నైపుణ్య శిక్షణ రాష్ట్రంలో పదిలక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. అంటే పదిలక్షల కుటుంబాలు స్వయం ఉపాధిమీద జీవిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వంశపారంపర్య స్కిల్ డెవలప్‌మెంట్ కొనసాగుతోంది.

12/25/2017 - 04:04

అమరావతి, డిసెంబర్ 24: ‘రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాజధాని నిర్మాణానికి అవసరమైన 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిన విధానంపై రాష్టప్రతికి ప్రత్యేకంగా వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుకి స్పందించి తమ విలువైన భూములను స్వచ్ఛందంగా అందించారు. వారిని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అమరావతి ప్రజల రాజధాని. రైతులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోను.

12/25/2017 - 02:33

శీతాకాల విడిదికోసం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్టప్రతి
గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన విందుకు హాజరై ముచ్చటిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె చంద్రశేఖర్ రావు

12/25/2017 - 02:28

ఏలూరు, డిసెంబర్ 24: నిబంధనలను ప్రాజెక్టుకింద పాతరేసి, భూసేకరణలో భారీ అవకతవకలకు పాల్పడటం చూస్తుంటే, పోలవరం ప్రతిష్ట పునాదుల్లోనే మసకబారుతోందా? అన్న ఆందోళన కనిపిస్తోంది. పోలవరం సాక్షిగా పశ్చిమాన సాగుతోన్న భారీ భూపరిహార కుంభకోణం లోతుల్లోకి తొంగిచూస్తే.. రాష్ట్రానికి జీవనాడిలాంటి భారీ ప్రాజెక్టులో తమవంతు గిల్లుడు మొదలెట్టిన ఘనులు, వ్యవహారవేత్తలు ఏరకమైన ‘ప్రణాళిక’ అమలు చేస్తున్నారో కనిపిస్తుంది.

Pages