S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/03/2018 - 22:01

హైదరాబాద్, ఆగస్టు 3:అకస్మాత్‌గా జరిగే అగ్నిప్రమాదాల నుంచి తక్షణం భయటపడడానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ర్యాలీలు, సదస్సులను రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ రీజినల్ అగ్నిమాపక శాఖ అధికారి పాపయ్య సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపారు. తమ శాఖ చేపట్టనున్న ప్రదర్శనలపై పౌరులతో పాటు విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసం పెంచడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

08/03/2018 - 22:00

హైదరాబాద్/రాజేంద్రనగర్, ఆగస్టు 3: బోధన, పరిశోధన, విస్తరణ రంగాలలో గత నాలుగేళ్లులో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకు సాధించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి దేశవ్యాప్తంగా వ్యవసాయ వర్సిటీల పనితీరును బట్టీ ప్రతి ఏడాది ర్యాంకులు ఇస్తోంది.

08/03/2018 - 21:50

హైదరాబాద్, ఆగస్టు 3: సింగరేణి గనుల్లో ఒవర్ బర్డెన్ తొలగింపులో కొంత మంది కాంట్రాక్టు లక్ష్యసాథనలో వెనకబడ్డారని అలాంటి విషయాల్లో కాంట్రాక్టర్లను డైనెక్టర్లు ఉపేక్షించవద్దని సింగరేణి సిఎండి శ్రీదర్ ఆదేశించారు. అవసరమైతే కొత్తవారని నియమించుకోవాలని పనుల్లో పురోగతి సాధించాలన్నారు. శుక్రవారం సింగరేణి భవనంలో సిఎండి ఉన్నతాధికారులతో గనుల ప్రగతిపై సమీక్షించారు.

08/03/2018 - 21:49

హైదరాబాద్, ఆగస్టు3: ప్రతిష్టాత్మక సంస్థలతో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని నీటిపారుదలశాఖ పంచుకుంటోందని సంబంధిత మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నీటిపారుదల సమాచార వ్యవస్థను ఇప్పటికే ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా మిషన్ కాకతీయ కార్యక్రమంపై అధ్యయనం చేసే బాధ్యతను ఇక్రిసాట్‌కు అప్పగించామన్నారు.

08/03/2018 - 21:48

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రభుత్వ అవినీతి గురించి తాను చేస్తున్న ఆరోపణలను నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వేసే ఏ శిక్షకైనా సిద్ధమేనని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నీళ్లను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

08/03/2018 - 21:47

హైదరాబాద్, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ‘పద్మ’ అవార్డులకు ఇంత వరకూ 11,475 దరఖాస్తులు అందినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే అపుడే ఇందులో 10,453 దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయిందని హోం శాఖ పేర్కొంది. గత ఏడాది 16వేల దరఖాస్తులు రాగా, అంతకుముందు సంవత్సరం 18వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.

08/03/2018 - 21:38

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పార్టీ సీనియర్ నేతలు అంతా ఈనెల 17 వ తేదీ నుండి పది రోజుల పాటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తారని , ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించి కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.

08/03/2018 - 21:36

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రధానంగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం నాడు నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

08/03/2018 - 21:34

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల తీరుపై రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తీవ్ర నిరాశను, నిస్పృహను వ్యక్తం చేస్తున్నా , వీసీల పనితీరు మెరుగుపడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

08/03/2018 - 17:33

హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ ప్రభుత్వం జీఓలు జారీచేస్తుందని టీడీపీ పోలీట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచటం ద్వారా ఎవరికి ఉపయోగం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సలహాలు తీసుకుంటుందా లేదా తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.

Pages