S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/06/2018 - 00:12

అనంతపురం సిటీ, ఆగస్టు 5 : ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక తరగతులను ఆదివారం ప్రారంభించిన జావదేకర్ దేశాభివృద్ధిలో రాజకీయాలు ఉండవని ఉద్ఘాటించారు.

08/06/2018 - 00:10

అమరావతి, ఆగస్టు 5: ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇంధన సామర్థ్యానికి సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన ఇంధన సామర్థ్య సన్నద్ధత సూచీలో ఏపీ అగ్రపథాన నిలిచింది.

08/05/2018 - 06:15

పామర్రు: క్రమశిక్షణకు, నిబద్ధతకు నిలువుటద్దం నందమూరి తారక రామారావు అని హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా ఇటు సినిమా రంగంలో.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో అటు రాజకీయ ప్రజాసేవా రంగంలో తనకుతానే సాటిగా నిలిచిన ఎన్టీఆర్ జీవితం యావత్ భారతదేశ ప్రజానీకానికి ఆదర్శవంతంమేనన్నారు.

08/05/2018 - 05:02

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తోందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ యాక్టును రక్షించేందుకు అవసరమైతే ప్రాణాలర్పిస్తానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/05/2018 - 04:43

ఆదోని, ఆగస్టు 4: కర్నూలు జిల్లాలో 10 మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్ని క్వారీలో బ్లాసింగ్‌కు అనుమతి లేదని తెలిసింది. అనుమతి లేకుండానే ఇక్కడ అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో అమాయకులైన కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి బ్లాస్టింగ్ చేసే కంపెనీలు వచ్చి రాళ్లు పగులగొట్టాల్సి ఉంది.

08/05/2018 - 05:29

తిరుపతి, ఆగస్టు 4: సమాజ హితం కోసం ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు జ్ఞాన భేరిని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభ, ఆలోచన విధానానికి స్ఫూర్తిని కలిగించాలన్నదే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు.

08/05/2018 - 04:41

రేణిగుంట, ఆగస్టు 4: తాను ప్రేమిస్తున్న అమ్మాయిని తన స్నేహితుడు ప్రేమిస్తుండటం భరించలేక క్లాస్‌మేట్ అనే విషయం కూడా మరచి దారుణంగా గొంతు,నాలుక కోసివేసిన దారుణ సంఘటన సోమవారం చిత్తూ రు జిల్లా గాజులమండ్యం ప్రాంతంలో జరిగింది. ఈ దురాగతాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థి కత్తిపోట్లుకు గురైయ్యాడు. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

08/05/2018 - 04:39

మడకశిర, ఆగస్టు 4: ప్రజలను ఎదుర్కొలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయించారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్టాడిన ఆయన రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీకాలం 30 రోజుల్లో ముగుస్తుందనగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

08/05/2018 - 02:29

హైదరాబాద్, ఆగస్టు 4: సిద్దిపేటలో సెంట్రల్ వర్శిటీకి, కేంద్రీయ విద్యాలయాలకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా 13 సెంట్రల్ వర్శిటీలను నెలకొల్పనున్న విషయం తెలిసిందే. కాగా, మధ్యప్రదేశ్‌లో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కూడా మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది.

08/05/2018 - 05:32

హైదరాబాద్, ఆగస్టు 4: శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో తక్కువగా నీరు ఉన్నందున తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Pages