S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/02/2018 - 02:19

రాపూరు, ఆగస్టు 1: నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్‌స్టేషన్‌పై స్థానికులు కొందరు బుధవారం దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో రాపూరు ఎస్‌ఐ లక్ష్మణ్‌రావుతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. రాపూరు ఎస్‌ఐ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాత్రి 10గంటలకు నెల్లూరుకు తరలించారు.

08/02/2018 - 05:06

అనంతపురం, ఆగస్టు 1: ‘రాష్ట్భ్రావృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలో ఎన్‌డీఏతో కలిసి ఉన్నాం.. అయితే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని తెలిశాక బయటకు వచ్చాం.. దీంతో నాది యూ టర్న్ అంటున్నారు.. నాది యూ టర్న్ కాదు.. రైట్ టర్నే.. మీకు మందబలం (మెజారిటీ) ఉండవచ్చు.. మాకు మొరాలిటీ (నిజాయితీ) ఉంది.. ప్రత్యేక హోదా, విభజన హక్కులు, ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతాం..

08/02/2018 - 05:07

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే తక్షణ కార్తవ్యమని, గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహించాలని, రాష్ట్రంలోని మొత్తం 44వేల పోలింగ్ కేంద్రాలకు కమిటీలు ఏర్పాటు చేసి పూర్వవైభవం తేవాలని బుధవారం నాడిక్కడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది.

08/02/2018 - 05:09

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో ఐటీ రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు వీలుగా సైబరాబాద్ తరహా నగరాలను ఐదింటిని నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఏపీఎన్నార్టీకి చెందిన ఇన్ఫోసైట్ భవనంలో 10 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను బుధవారం ఆయన ప్రారంభించారు.

08/02/2018 - 01:57

హైదరాబాద్, ఆగస్టు 1: వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ, ఉద్యోగ నిర్వహణ చేపట్టలేమన్న సింగరేణి కార్మికులకు సంబంధిత యాజమాన్యం కారుణ్య నియమాకాలతో ఆయా కుటుంబాల్లో వారసులకు ఉద్యోగ భద్రత చేపట్టబోతోంది. తాము అనారోగ్యాలతో పని భారాన్ని మోయలేమని విన్నవించుకున్న కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి చెప్పింది సరైనదేనన్న నిర్ధారణ జరిగితే, వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందివ్వనున్నది.

08/02/2018 - 05:12

సిద్దిపేట, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం శ్రీకారం చుట్టారు. సీఎం ములుగు, ప్రజ్ఞాపూర్‌లో కొబ్బరి, గజ్వేల్‌లో కదంబ మొక్కలను నాటారు. గజ్వేల్ పట్టణాన్ని హరిత గజ్వేల్‌గా తీర్చిదిద్దేందుకు ఒకే రోజు లక్ష 116 మొక్కలను నాటడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

08/02/2018 - 05:14

హైదరాబాద్, ఆగస్టు 1: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ చేపట్టాలనుకున్న నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. నేతలను కార్యకర్తలను గాంధీ భవన్ సమీపంలోనే అడ్డుకొని అరెస్టు చేశారు. యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు బుధవారం గాంధీ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

08/02/2018 - 05:16

నిజామాబాద్, ఆగస్టు 1: అధికారమే పరమావధిగా గడ్డం పెంచినంత మాత్రాన గబ్బర్‌సింగ్‌లు కాలేరని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు వ్యాఖ్యానించారు. అలవికాని వాగ్దానాలతో ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

08/02/2018 - 05:18

నిజామాబాద్/బాల్కొండ, ఆగస్టు 1: కళ్లెదుటే ఎండుతున్నపంటలను ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ రైతులు కదం తొక్కారు. అన్నదాతల నిరసనలతో మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్.ఈ కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

08/01/2018 - 22:46

నూఢిల్లీ, ఆగస్టు 1: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ) సేవలు త్వరలో దేశ వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 650 శాఖలు ఏర్పాటయ్యాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ శాఖలను ప్రారంభిస్తారని కేంద్ర సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా బుధవారం నాడిక్కడ తెలిపారు.

Pages