S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/25/2018 - 04:04

విజయనగరం, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్‌గా వివేక్‌యాదవ్ అవార్డును దక్కించుకున్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ప్రతీ ఏటా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులను బహూకరిస్తున్న విషయం విధితమే.

04/25/2018 - 04:14

విశాఖపట్నం, ఏప్రిల్ 24: ప్రపంచమంతా కలిసి ఉండాలని చాటి చెప్పిన మహానుభావుడు భగవద్రామానుజులవారని దేవనాథ రామానుజ జీయరు స్వామి అన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ వెయ్యేళ్లకు ముందు భిన్నాభిప్రాయాలతో ఉన్న సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమసమాజ స్థాపనకు రామానుజుల వారు కృషి చేశారని అన్నారు. అయితే, మళ్లీ సమాజం గతి తప్పింది.

04/25/2018 - 03:43

హైదరాబాద్, ఏప్రిల్ 24: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి 18 మంది ప్రముఖ హీరోలతో సమావేశమై సినీ పరిశ్రమలో తాజాగా జరిగిన పరిణామాలపై చర్చించారు.

04/25/2018 - 03:39

గన్నవరం, ఏప్రిల్ 24: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని వైఎస్సార్సీ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం మూడు బొమ్మల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల అవినీతి పాలనపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు.

04/25/2018 - 03:29

ఖమ్మం, ఏప్రిల్ 24: వేసవిలో ఉపాధి కూలీలకు ప్రభుత్వం చల్లని కబురిచ్చింది. వేసవి ఎండలను తట్టుకొని కుటుంబ పోషణ కోసం ఉపాధి పనికి వచ్చే వారికి తక్కువ పనికే పూర్తి వేతనాన్ని ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల పాటు దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా పూర్తిస్థాయిలో నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే ఓ కూలీకి రోజుకు 205రూపాయల వేతనాన్ని అందిస్తారు.

04/25/2018 - 02:08

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మెజిస్ట్రేట్ కోర్టుల్లో పనిచేస్తున్న సివిల్ జడ్జిలను భా రీ ఎత్తున బదిలీలు చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27న రిలీవ్ కావాలని, మే 4న కేటాయించిన కోర్టులో విధుల్లో చేరాలని పేర్కొంది.

04/25/2018 - 01:12

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్‌నుకలిసి చర్చించి విషయాలను బహిర్గతం చేయాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. టిడిపి, బిజెపి లోపాయికారిగా ఒప్పందాలతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

04/25/2018 - 00:54

జగిత్యాల, ఏప్రిల్ 24: దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడాలేని తరహాలో రాష్ట్రంలో రూ.18వేల కోట్లతో 3 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంతోపాటు నూకపల్లిలో నిర్మించనున్న 4160 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.

04/25/2018 - 00:52

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు మంగళవారం ‘శ్రీకారం’ చుట్టినట్టయింది. పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా నోటిఫికేషన్‌ను తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పకారం 2018 ఏప్రిల్ 30 న డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రకటిస్తారు.

04/25/2018 - 02:38

రామచంద్రాపురం, ఏప్రిల్ 24: వేలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ పటాన్‌చెరు పారిశ్రామికవాడకే తలమానికమైన అగర్వాల్ రబ్బర్స్ పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. షార్ట్ సర్క్యూట్ కారణం తలెత్తిన అగ్నికీలల్లో 70 కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. 34 ఏళ్లుగా సాగుతోన్న టైర్ల ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు, రెజిన్ లిక్విడ్ బ్యారెల్స్ పేలిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

Pages