S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/24/2018 - 01:14

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణలో తక్షణం నియామకాలు చేపట్టేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిషికేషన్లు జారీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు 42సార్లు ధర్నాలు, సభలు జరిపినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.

04/24/2018 - 01:14

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం పనితీరు బాగుందని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రొబెషనరీ డిఎస్పీలు పేర్కొన్నారు. తమ శిక్షణలో భాగంగా సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన 36 మంది ప్రొబెషనరీ డిఎస్పీల బృందానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కమాండ్ సెంటర్ పనితీరు గురించి వివరించారు.

04/24/2018 - 01:11

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో చెక్కు చెదరని, చెదలు పట్టని షీర్‌వాల్ టెక్నాలజీతో భారతదేశంలోనే ఆదర్శవంతమైన ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టిందని, మరో ఆరు నెలల్లో నిర్ధేశిత లక్ష్యం మేరకు 6.81 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు.

04/24/2018 - 04:29

హైదరాబాద్: రైతుబంధు పథకం అమలుకోసం యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు తీరిక లేకుండా ఉన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో పాటు బ్యాంకు సిబ్బందికి మే చివరి వరకు సెలవులు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఆరు నెలల నుండి సేకరించిన వివరాలకు అనుగుణంగా రైతుబంధు పథకం లబ్దిదారుల (రైతుల) పేర్లను ఖరారు చేశారు.

04/24/2018 - 04:28

హైదరాబాద్: తెరాస ప్లీనరీ అత్యంత కీలకమని, ఇదే వేదికపై దేశ రాజకీయాల తాజా పరిణామాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చర్చిస్తారని మంత్రి తారకరామారావు తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరుగబోయే ఈ ప్లీనరీ అత్యంత కీలకంగా మారబోతుందన్నారు.

04/24/2018 - 00:59

ఖమ్మం, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న వరుస సంఘటనలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరాటంలో స్థానిక గిరిజనులు నలిగిపోతున్నారు.

04/24/2018 - 04:23

విజయవాడ: రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత, విద్యుత్ భద్రత, గ్యాస్ భద్రత ఇచ్చామని, వౌలిక సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని, అందరూ కలిసి అభివృద్ధిని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు - ప్రగతిపై ఆయన సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

04/24/2018 - 04:25

విశాఖపట్నం: పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని రుజువులతో సహా సీబీఐకి 15 రోజుల్లో ఫిర్యాదు చేయనున్నట్టు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ అవినీతిపై సాక్ష్యాలు ఉంటే సీబీఐకి ఫిర్యాదు చేసుకోమని టీడీపీ నేతలు అంటున్నారని, వారి ముచ్చట తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

04/24/2018 - 00:51

ఏలూరు, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం అన్ని విధాలా ప్రయత్నంచేశానని, సామ, దాన, భేద ఉపాయాలను వినియోగించినా ఫలితం లేకపోయిందని, అందువల్లే ఇక దండోపాయమే శరణ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ధర్మం, న్యాయం మనవైపే ఉన్నాయని, అందువల్ల విజయం మనదే అవుతుందన్నారు.

04/24/2018 - 04:26

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని, గుడిని, గుడిలో లింగాన్ని మింగేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికే దక్కిందంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజలకే కాదు ఆలయాలకు, దేవుళ్లకు సైతం రక్షణ లేకుండా పోయిందని వైఎస్ జగన్ విమర్శించారు.

Pages