S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/27/2018 - 03:41

హైదరాబాద్, ఏప్రిల్ 26: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పవన్ అభిమానులు టీవీ 9 కార్యాలయానికి ఫోన్‌చేసి ఆ ఛానల్ సీఈవో రవిప్రకాష్‌ను ఉద్దేశించి ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ ఈ నెల 21వ తేదీన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తరఫున గుండేపల్లి రాజేష్ ఫిర్యాదు చేశారు.

04/27/2018 - 01:53

విజయవాడ, ఏప్రిల్ 26: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు వివిధ పథకాల కింద ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో పరిశీలించడానికి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌ధాస్ అథవాలే తెలిపారు. గురువారం స్థానిక గెస్ట్‌హౌస్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పథకాల సరళిని ముందుగా కేంద్ర మంత్రి రామదాసు అథవాలే సమీక్షించారు.

04/26/2018 - 17:08

పార్వతీపురం: మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు.. వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్వతీపురంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రశేఖరరాజుకు లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.

04/26/2018 - 16:20

గుంటూరు: తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్, మహారాష్ట్ర మాజీ అదనపు డీజీపీ లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు.

04/26/2018 - 13:11

నెల్లూరు: అనారోగ్యంతో చనిపోయిన టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయంత్రం అధికార లాంఛనాలతో పెన్నా తీరంలో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.

04/26/2018 - 04:49

హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసు శాఖలో అదనపు డీజీ, ఉమ్మడి ఏపీ లో సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ వి రమణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత నెల లో లక్ష్మీనారాయణ వ్యక్తిగత కారణాలతో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు ఆయన దరఖాస్తుకు ఇప్పుడు ఆమోదముద్ర పడింది.

04/26/2018 - 02:08

కాకినాడ, ఏప్రిల్ 25: రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఏపీ ఎంసెట్-2018 బుధవారంతో ముగిసింది. ఈ నెల 22,23,24 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించగా, చివరి రోజైన బుధవారం అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు.

04/26/2018 - 02:08

హైదరాబాద్, ఏప్రిల్ 25: తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదలకు సంబంధించి జియోమెటిక్స్, సర్వేయింగ్‌లలో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు చెంది ఉన్నతాధికారులకు మూడు రోజుల శిక్షణ బుధవారం ఇక్కడ ప్రా రంభమైంది.

04/26/2018 - 02:06

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఆర్‌జీయుకేటీ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్‌ఐటిలో అడ్మిషన్లకు ఈ నెల 26న నోటిఫికేషన్ చేయనున్నారు. పదో తరగతి మెరిట్ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆరే ళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మండలాల వారీ రోస్టర్ ఆధారంగా మెరిట్ విద్యార్థులను చే ర్చుకుంటారు. ఆన్‌లైన్‌లో ఈ నెల 28 నుండి జూ న్ 1వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు.

04/26/2018 - 02:26

విశాఖపట్నం, ఏప్రిల్ 25: ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌక సీ-438 కాకినాడలో గురువారం జల ప్రవేశం చేసింది. తీర ప్రాంత భద్రత కోసం నిర్మించిన ఈ నౌకను డీజీపీ ఎం.మాలకొండయ్య, కోస్ట్‌గార్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజన్ బర్గోత్రా సమక్షంలో లాంఛనంగా జలప్రవేశం చేయించారు. ఈ నౌక కాకినాడ కేంద్రంగా పనిచేయనుంది. తూర్పు తీరంలో జరుగుతున్న స్మగ్లింగ్‌ను అరికట్టడంతోపాటు, అక్రమ చేపల వేటను పసిగట్టడానికి పనిచేస్తుంది.

Pages