S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/28/2018 - 03:11

హైదరాబాద్, జనవరి 27: నల్లగొండ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, నిష్పక్ష పాతంగా ఉండేందుకు సిబిఐ విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర డిజిపిని కోరారు. శనివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి.

01/28/2018 - 03:00

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో రైతులు ఏళ్లతరబడి సాగుచేస్తున్న పంటల రకాలపై మేధోసంపత్తి హక్కులను సాధించుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి సూచించారు. ‘రైతుల హక్కులు, వ్యవసాయ జీవ వైవిద్యం’ అంశంపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సును ప్రారంభించారు.

01/28/2018 - 02:58

హైదరాబాద్, జనవరి 27: సమగ్ర శిశు సంరక్షణ స్కీం కింద నడుస్తున్న ప్రభుత్వ శిశుగృహలో శిశువుల మరణం, అక్రమంగా శిశువుల విక్రయాలపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు పి అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో శిశు గృహల్లో శిశువుల మృ చెందుతున్నారని ఆయన పిల్‌లో పేర్కొన్నారు.

01/27/2018 - 04:06

వరంగల్, జనవరి 26: మేడారం జాతరకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బందోబస్తు కోసం పోలీసుల సంఖ్యను పెంచటంతోపాటు ఈ జాతరలో అధునాతన టెక్నాలజీని వినియోగించటం ద్వారా జాతర సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు భూపాలపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

01/27/2018 - 04:06

హైదరాబాద్, జనవరి 26: పాఠశాలల్లో ఫీజుల విషయంలో సంఘాలు తప్పుదారి పట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం చేస్తున్న ఆరోపణలు నిర్హేతుకమని, అసత్యమని, అన్యాయమని, ఆమోదయోగ్యం కానివని అన్నారు.

01/27/2018 - 04:05

నల్లగొండ, జనవరి 26: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో నకిరేకల్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వీరేశం ప్రమేయముందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

01/27/2018 - 03:40

హైదరాబాద్/కుషాయిగూడ, జనవరి 26: కూరగాయల వ్యాపార స్ధలం లో తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి కాల్పులకు దారితీసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

01/27/2018 - 03:34

హైదరాబాద్, జనవరి 26: ప్రపంచవ్యాప్తంగా మహిళల జీవిత చిత్రీకరణలో కొత్త ధోరణులు వస్తున్నాయని, స్పెయిన్ దేశంలోనూ నూతన రచయితలు సరికొత్త సంప్రదాయాలకు తెరతీశారని ఆదేశానికి చెందిన క్రిస్టియానా సాంచెజ్ అండ్రాడే పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే హైదరాబాద్ సాహిత్య ఉత్సవాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ఈ ఉత్సవాలను అంతర్జాతీయ దృక్పథంతో నిర్వహిస్తోంది.

01/27/2018 - 03:33

గుర్గావ్, జనవరి 26: సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావత్‌కు నిరసగా గుర్గావ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కర్ణిసేన జాతీయ ప్రధాన కార్యదర్శి సూరజ్‌పాల్ అమును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో శాంతి భద్రతకలు విఘాతం కల్పించి హింసకు ఆజ్యం పోశాడని అతడిపై కేసు నమోదు చేశారు. నిజానికి గురువారమే అతడిని పోలీసులు అదుపుకోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

01/27/2018 - 03:31

హైదరాబాద్, జనవరి 26: దేశంలో, రాష్ట్రంలో యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీ భవన్ ఆవరణలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రాజ్యాంగాన్ని పాలకులు అవమానిస్తున్నారని విమర్శించారు.

Pages