S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/29/2018 - 03:52

నల్లగొండ, జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయంతోనే నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య జరిగిందని అందుకే హత్య కేసుపై ప్రభుత్వం స్పందించకుండా విచారణలో నిర్లక్ష్యం వహిస్తుందని టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం శ్రీనివాస్ భార్య లక్ష్మిని, కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి అనంతరం విలేఖరుల తో మాట్లాడారు.

01/29/2018 - 03:50

నల్లగొండ, జనవరి 28: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య తన అనుచరులతో జరిగిన గొడవలో ఆవేశంలో నిందితులు చేసిన హత్యగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని నల్లగొండ ఎస్పీ డి.వి.శ్రీనివాస్‌రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీనివాస్ హత్య కేసును ఛేదించామంటు ఎస్పీ ఈ కేసు వివరాలను ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

01/29/2018 - 03:47

సిరిసిల్ల, జనవరి 28: సమాజం సంఘటిత శక్తిగా నిర్మాణం అయినపుడే దేశం శక్తివంతం అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ ఏలె శ్యాంకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ ‘సార్వజనికోత్సవం’ సభలో శ్యాంకుమార్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. అంతు కు ముందు ‘పథసంచలన్’ కార్యక్రమం నిర్వహించారు.

01/29/2018 - 03:45

ఉప్పునుంతల, జనవరి 28: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మామిళ్లపల్లి గ్రామానికి చెందిన సామా భాస్కరయ్య(60)కు మల్లయ్య (32), శ్రీశైలం (22), రామస్వామి(16) అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరి ముగ్గురికీ వివా హం కాలేదు.

01/29/2018 - 03:44

నేరడిగొండ,జనవరి 28: కుంటాల జలపాతం లో పడి హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంజమాముల్ హక్ (21) మృతి చెందా డు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంజమాముల్ హక్‌తో పాటు మరో పది మంది మిత్రులు సరదాగా ఆదివారం సెలవు దినం కావడంతో ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం అందాలను చూసేందుకు విహార యాత్రకు వచ్చారు.

01/29/2018 - 03:41

మెట్‌పల్లి, జనవరి 28: మాది రైతు బంధు పాలన అని తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కన్పించడం లేదా అని, సిఎం కేసిఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

01/29/2018 - 03:36

హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన ఆఖరి రోజు ఆదివారం ఒక స్టాల్‌ను సందర్శించి పుస్తకాన్ని చదువుతున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. సందర్శకుల పుస్తకంలో
సంతకం చేస్తున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

01/29/2018 - 03:32

హైదరాబాద్, జనవరి 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సుందరయ్య నగర్‌కు చెందిన గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌పై శుక్రవారం రాత్రి మావోయిస్టులు జరిపిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన విద్యార్థి సమాఖ్య (టిఎస్‌ఎఫ్) తెలిపింది.

01/29/2018 - 03:31

హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్ (నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్) లోని అగ్రి-హార్టికల్చరల్ సొసైటీలో ఫిబ్రవరి 1 నుండి 3 వరకు ఔషధ మొక్కల పెంపకంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

01/29/2018 - 03:31

హైదరాబాద్, జనవరి 28: దేశం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగధనులను స్మరిస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ నెల 30 న రెండు నిమిషాల పాటు అందరూ వౌనం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Pages