S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/02/2017 - 02:40

జగిత్యాల, డిసెంబర్ 1: గొల్లపల్లి తహశీల్దార్ సుమ, విఆర్‌ఓ శ్రీలతలపై ఆక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించుంటామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్‌కు జిల్లా కలెక్టర్ సమీక్షంలో ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

12/02/2017 - 02:39

హైదరాబాద్, డిసెంబర్ 1: ‘తెలంగాణలో మీరు చూసినవి వాస్తవాలు కాదు..’ అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ సలహాదారురాలు ఇవాంకకు లేఖ రాశారు. మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని అనేక ఉదాహరణలతో లేఖ రాసినట్లు విహెచ్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. మహిళా సాధికరత కోసం జిఈఎస్ సదస్సు నిర్వహించారని, అయితే అందులో వన్ మాన్ షో తరహాలో ముఖ్యమంత్రి కె.

12/02/2017 - 02:38

హైదరాబాద్, డిసెంబర్ 1: రేషన్ డీలర్లు సమ్మెకు దిగడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టకుండా రేషన్ సరుకులు పంపిణీ చేయని డీలర్లను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

12/02/2017 - 02:38

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రతిష్టాకరమైన అఖిల భారత టెక్నికల్ ఎంట్రీ స్కీం ప్రవేశ పరీక్షల్లో బొలారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన వి తిమ్మన్న అనే విద్యార్థి టాపర్‌గా నిలిచారు. దీని వల్ల ఆయన టెక్నికల్ ఎంట్రీ స్కీంలో నాలుగు సంవత్సరాల కోర్సును చదువుతారు. విద్యార్థుల్లో దేశ భక్తి, సాహసాన్ని పెంచేందుకు దేశ వ్యాప్తంగా ఆర్మీ టిఇఎస్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు జాతీయ సాయిలో విపరీతమైన పోటీ ఉంటుంది.

12/02/2017 - 02:36

హైదరాబాద్, డిసెంబర్ 1: ఈ నెల 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎసిబి డిజి కార్యాయలం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజల్లో అవినీతి నిర్మూలన పట్ల చైతన్యం తీసుకు వచ్చేందుకు వీలుగా ఈ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక రోజు డిసెంబర్ 9ని పురస్కరించుకుని ఆ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపింది.

12/02/2017 - 02:35

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 1: చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అనాడే డా.బీఆర్ అంబేద్కర్ రాజ్యంగంలో తెలియజేశారని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. దళిత సంక్షేమకర్త దివంగత ఈశ్వరీబాయి శత జయంతి ఉత్సవాలు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించారు.

12/02/2017 - 00:14

హైదరాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయి. గత మూడేళ్లలో గణనీయంగా నేరాలు తగ్గి దేశంలో ఉన్న 19 మెట్రో నగరాల్లో 14వ స్ధానంలో నిలిచింది. దీంతో మిగిలిన పేరొందిన నగరాల్లో కన్నా హైదరాబాద్ భద్రతతో కూడిన నగరంగా భావించవచ్చు. ఈ నగరంలో నేరాలు తగ్గుముఖం పట్టినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తన తాజా నివేదికలో వెల్లడించింది.

12/01/2017 - 04:32

హైదరాబాద్, నవంబర్ 30: మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్-2017) మహిళా శక్తికి గట్టి భరోసా ఇస్తూ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 1500 మంది పారిశ్రామికవేత్తలకు తాత్కాలిక వీడ్కోలు పలికింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రారంభమైన ఈ సదస్సుకు ఇద్దరు కీలక అతిధులు హాజరయ్యారు.

12/01/2017 - 04:30

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఇద్దరు అపూర్వ సహోదరులు అందరి దృష్టినీ ఆకర్షించారు. హైదరాబాద్ నగరంలో వారికి ఎంతో బాంధవ్యం ఉన్నా వారు అమెరికా నుండి ప్రతినిధులుగా జీఈఎస్ సదస్సుకు హాజరుకావడం ప్రత్యేకతను సంతరించుకుంది. మన్సూర్ క్యూ సయ్యద్, ఆయన సహోదరి ఉమ్మా సైదా, మరో సోదరుడు హైదర్‌సైదా వీంతా జీఈఎస్ సదసుకు హాజరయ్యారు.

12/01/2017 - 04:29

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటిగా గుర్తించదగ్గ రీతిలో హైదరాబాద్ నగరం ఉందని విదేశాల నుండి వచ్చిన వివిధ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సులో దేశ, విదేశాల నుండి 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చివరి రోజు గురువారం నాడు వారంతా నగరంలో పర్యటించారు.

Pages