S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/13/2017 - 03:34

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ జిల్లాలకు తొమ్మిది నెలలకోసం క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు 2.25 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 69.75 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ పత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

10/13/2017 - 03:33

హైదరాబాద్, అక్టోబర్ 12: టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ తనపై దాడిచేసిన విషయమై కేసు పెట్టినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్నారై అతుల్ వాస్సే ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని తన ఇంటి అద్దె ఇవ్వకపోవడమే కాకుండా, ఇల్లు ఖాళీ చేయడం లేదని ఆమె వ్యధ చెందారు.

10/13/2017 - 03:32

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ,రాష్ట్ర ప్రాయోజిత నిధులతో మూడు పర్యాటక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. రూ.275.42 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులను పూర్తి చేసి పర్యాటకంగా మరో ముందడుగు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

10/13/2017 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 12: దేశ రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారని, దేశ భద్రత, ప్రజారక్షణలో పోలీసుల పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డైర్టెర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. గురువారం హైదరాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 15న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగే పోలీస్ రన్‌కు సంబంధించి టీ షర్టు, మెడల్స్‌ను ఆయన ఆవిష్కరించారు.

10/13/2017 - 02:12

హైదరాబాద్, అక్టోబర్ 12: దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్మగ్లింగ్‌లో బంగారం, పొగాకు ఉత్పత్తులు, నార్కొటిక్ డ్రగ్సే ప్రధానంగా కనిపిస్తోంది. దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులు వీటినే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని తమ నేరపూరిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

10/13/2017 - 02:12

హైదరాబాద్, అక్టోబర్ 12: ఆంగ్లం-విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి, ప్రొఫెసర్ తపస్ రాయ్ నియమితులయ్యారు. విసి ప్రొఫెసర్ సురేష్‌కుమార్ వారికి నియామక పత్రాలను అందించారు. డిపార్టుమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్‌లో వెంకటరెడ్డి పనిచేస్తుండగా, డిపార్టుమెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అండ్ ఫోనిటిక్స్‌లో ప్రొఫెసర్ తపస్ రాయ్ పనిచేస్తున్నారు.

10/13/2017 - 02:11

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుంచి 15 వరకు ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభలపై నిర్వహించిన సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు భాషా సాహిత్యం, తెలంగాణ భాషా సాహిత్యం, సంస్కృతిని ఇనుమడింప చేయడం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఉద్దేశ్యమని అన్నారు.

10/13/2017 - 02:11

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించాలని టిటిడిపి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ, కంప్యూటరైజేషన్, గ్రామ, మండల, పురపాలక జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల ఏర్పాట్లు, కేంద్ర రాష్ట్ర కమిటీల బాధ్యుల విధులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు.

10/12/2017 - 20:56

హైదరాబాద్, అక్టోబర్ 11: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలనకు బిజెపి రాష్ట్ర కమిటీ ఏడు బృందాలను నియమించింది. ఈ బృందాలు వికారాబార్, గద్వాలా జిల్లా, నల్లగొండ జిల్లా, భద్రాద్రి జిల్లా, రంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలను సందర్శించి నివేదికలను తయారుచేస్తుంది. ఈ బృందాలు ఈ నెల 12 నుండి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో పర్యటిస్తాయి.

10/12/2017 - 20:55

హైదరాబాద్, అక్టోబర్ 11: పాఠశాల స్థాయిలో దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు వారి తల్లిదండ్రుల ఆదాయం పరిమితిని ప్రభుత్వం పెంచింది. తల్లిదండ్రుల ఆదాయం ఏటా గ్రామీణ ప్రాంతాల్లో 65 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేల రూపాయలు ఉంటే ఇప్పటి వరకు స్కాలర్‌షిప్ మంజూరు చేసేవారు.

Pages