S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/11/2017 - 03:10

హైదరాబాద్, అక్టోబర్ 10: మున్సిపాలిటీలో వయోవృద్ధులకు డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని స్ర్తిశిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వయోవృద్ధుల సంక్షేమంపై సీనియర్ సిటిజన్ స్టేట్ కౌన్సిల్ తొలి సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వయోవృద్ధుల చట్టంపై ప్రతి ప్రభుత్వ అధికారికి అవగాహన ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

10/11/2017 - 03:06

హైదరాబాద్, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ రెండు జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాల సముదాయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్ణాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

10/11/2017 - 03:05

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణవ్యాప్తంగా లారీల సమ్మె కొనసాగుతోంది. మంగళవారం రాష్టవ్య్రాప్తంగా దాదాపు ఐదు వేల లారీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ సంక్షోభంలో ఉందని, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరలు హెచ్చు, తగ్గులు లేకుండా చూడాలన్నారు.

10/11/2017 - 03:04

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేయాలని సింగరేణిలోని అన్ని ఏరియా అధికారులకు సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం 11 ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

10/11/2017 - 03:04

హైదరాబాద్, అక్టోబర్ 10: నవజాత శిశువుల సంరక్షణలో తెలంగాణ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం జాతీయ శిశు ఆరోగ్య సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మొదటిస్థానంలో హరియాణ నిలిచింది. సిఎం కెసిఆర్ దార్శనికత వల్లనే వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు లభిస్తున్నాయని, వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

10/11/2017 - 03:03

హైదరాబాద్, అక్టోబర్ 10: బిసి క్రిమిలేయర్‌పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో గందరగోళంగా ఉందని, దీనిని వెంటనే సవరించాలని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిసి మంగళవారం వినతి పత్రం సమర్పించినట్టు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

10/11/2017 - 02:23

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి, మరోవైపు పార్టీ కోసం అంకితమైన భావంతో పని చేస్తానని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బాలమల్లును మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

10/11/2017 - 02:23

హైదరాబాద్, అక్టోబర్ 10: ఉస్మానియా యూనివర్శిటీలో ఎయిర్ కండిషనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమకు, విద్యాసంస్థలకు మధ్య ఉన్న అగాధం తొలగి పూర్తి శిక్షణ, కౌశలాలు పొందిన విద్యార్థులను రూపొందించేందుకు వీలుకలిగిందని వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం పేర్కొన్నారు. డైకిన్ సంస్థ ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించింది.

10/11/2017 - 02:22

హైదరాబాద్, అక్టోబర్ 10: స్టేట్ అడాప్షన్ రీసోర్స్ ఏజన్సీకి పాలక మండలి (గవర్నింగ్ బాడీ) ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి చైర్‌పర్సన్‌గా మరో ఆరుగురు అధికారులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించారు.

10/11/2017 - 02:22

హైదరాబాద్, అక్టోబర్ 10: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు డివిజన్లలో విద్యుత్ సరఫరాకు ఎనర్జి ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి 9.8 లక్షల యూనిట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. రైళ్లలో సీలింగ్ ఫ్యాన్లు, ఇన్‌వర్టర్లు, లైట్లు, ఎయిర్ కండిషన్స్ వంటి వాటికి గానూ, దక్షిణ మధ్య రైల్వే ఏటా రూ. 88 లక్షలు చెల్లించేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదిరింది.

Pages