S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/06/2019 - 05:09

హైదరాబాద్, అక్టోబర్ 5: ఆర్టీసీ కార్మికులతో తక్షణమే మాట్లాడి వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలించి ఆమోదించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం , టీఆర్‌ఎస్ నేతలు కోటీశ్వరులయ్యారని, ఉద్యమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

10/06/2019 - 05:08

ఖమ్మం, అక్టోబర్ 5: ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు అట్టుడికిపోయాయి. ప్రభుత్వం ‘ఎస్మా’ చట్టం ప్రయోగానికైనా సిద్ధమంటూ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపేందుకు నిర్ణయించి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసింది. సమ్మెకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన యంత్రాంగం తాత్కాలిక కార్మికులను విధుల్లోకి తీసుకుని కొన్ని బస్సులను నడిపింది.

10/06/2019 - 05:08

హైదరాబాద్, అక్టోబర్ 5: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కిర్మణ్మయి విజయానికి కృషి చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయడానికి చురుకైన పార్టీ శ్రేణులను దించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నాహాలు ప్రారంభించారని టీ-టీడీపి అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ పరిధిలోని మండలాల వారిగా పసుపు దండును ఏర్పాటు చేస్తామన్నారు.

10/06/2019 - 02:33

సూర్యాపేట, అక్టోబర్ 5: పోరాటాలు, బలిదానలతో సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగుతోందని, త్వరలో జరిగే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

10/06/2019 - 01:46

హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మ నిర్వహిం చే చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్

10/06/2019 - 01:28

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలను ధిక్కరించి సమ్మెకు దిగిన 52 వేల మంది కార్మికుల భవిష్యత్తు ఆదివారం తెలనున్నది. సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయనుండడంతో, సమ్మె కొనసాగుతుందా

10/06/2019 - 01:26

హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు కార్మికుల సమ్మె నేపథ్యంలో అన్ని బస్సులకు, బస్సు డిపోలకు పోలీ సు రక్షణ కల్పిస్తామని హోంశాఖమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడు తూ పోలీసు శాఖ ప్రజల సేవ కోసం ఉందని, ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ సహకారం అందిస్తున్నదన్నారు. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించేందుకు అన్ని రకాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

10/06/2019 - 01:25

*చిత్రం... హన్మకొండలో శనివారం ప్రైవేట్ వాహనాలతో కిక్కిరిసిన బస్టాండ్

10/05/2019 - 23:58

బాల్కొండ, అక్టోబర్ 5: ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా చిట్టాపూర్ గ్రామ పర్యటనకు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటనలో అదే గ్రామానికి చెందిన కండెల రఘువీర్ అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కొద్దిసేపు కలకలం సృష్టించింది.

,
10/06/2019 - 01:00

నల్లగొండ/కేతెపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ పిదప రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న కేతెపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు ఆరవ నెంబర్ రెగ్యులెటరీ గేటు విరిగి కొట్టుకపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోతుంది. ఇటీవలి వర్షాలు, వరదలతో మూసీ నదికి పెరిగిన వరద ఉదృతితో మూసీ ప్రాజెక్టు నిండుకుండగా మారింది.

Pages