S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/04/2016 - 13:45

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నప్పటికీ సిఎం కెసిఆర్ శంకుస్థాపనల పేరిట హడావుడి చేస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం లేదని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. కరవు సమస్యపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. తెలంగాణలో టిడిపి అదృశ్యం అవుతుందని మంత్రి కెటిఆర్ అహంకారంతో వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

05/04/2016 - 13:55

విజయవాడ: ఆర్డీఎస్ సాగునీటి ప్రాజెక్టుపై మాట్లాడుకుందామంటూ తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు బుధవారం ఉదయం ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు ఫోన్ చేశారు. పరస్పరం చర్చించుకుని నీటి ప్రాజెక్టులపై ఒక అంగీకారానికి వద్దామని హరీష్ ప్రతిపాదించారు. అయితే, తెలంగాణలో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపైనా చర్చించాల్సి ఉందని దేవినేని స్పష్టం చేశారు.

05/04/2016 - 12:29

కరీంనగర్: నీటితొట్టెలో పడిపోయి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన జగిత్యాల మండలం అంతర్గాంలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

05/04/2016 - 12:28

కరీంనగర్: ఎలాంటి అనుమతుల్లేకుండా తెలంగాణ సిఎం కెసిఆర్ నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం వింతగా ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శంకుస్థాపన సందర్భంగా తన నిలువెత్తు శిలావిగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం కెసిఆర్‌కే చెల్లిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరికాదన్నారు.

05/04/2016 - 08:24

హైదరాబాద్, మే 2: ఆరోగ్యశ్రీ సేవలపై ఏర్పడిన ప్రతిష్టంభనపై తెలంగాణ ప్రభుత్వం-ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధుల మధ్య సోమవారం సచివాలయంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు అంగీకరించాయి. వైద్య మంత్రి కె లక్ష్మారెడ్డి నేతృత్వంలో జరిగిన చర్చల్లో దాదాపు 20 మంది ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు రెండుగంటలపాటు చర్చలు కొనసాగాయి.

05/04/2016 - 08:14

హైదరాబాద్, మే 3: రెండేళ్ల పదవీ కాలంలో ఏమి చేశామన్న దానిపై రాష్ట్ర మంత్రులు ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భవించి, కొత్త ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వచ్చే నెలకు రెండేళ్లు అవుతుంది. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మంది మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు.

05/04/2016 - 08:08

చింతకాని, మే 3: క్రీస్తుశకం 2వ శతాబ్దానికి చెందిన నాలుగు గౌతమ బుద్ధుడి విగ్రహాలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామ పరిసర ప్రాంతంలోని రామసముద్రం చెరువులో బయటపడ్డాయి. ఉపాధికూలీలు చెరువులో పూడికతీత పనులు చేస్తుండగా నాలుగు రాతి విగ్రహాలు బయటపడటంతో తహశీల్దార్ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. వెంటనే చెరువు వద్దకు వెళ్ళిన తహశీల్దార్ విఆర్వోలు, విఆర్‌ఏల సాయంతో విగ్రహాలను బయటకు తీశారు.

05/04/2016 - 07:57

ఇల్లంతకుంట, మే 3: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట-వెంకట్రావుపల్లి మధ్యలో ఆనంద రెడ్డి అనే రైతు వ్యవసాయబావిలో అటునుంచి సంచరిస్తున్న ఓ చిరుతపులి దాహం కోసం రాగా అందులో పడిపోయిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు తన బృందంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

05/04/2016 - 07:56

ఆదిలాబాద్, మే 3: దప్పికతీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లుదొరక్క ఇద్దరు పసిపిల్లలు తడారిన గొంతులతో చెన్నూర్ మండలంలో మృతి చెందిన సంఘటన ప్రభుత్వాన్ని కదిలించివేసింది. దాహార్తితీర్చుకోలేని స్థితిలో ఇద్దరు పిల్లలు అశోక్ (12), మధు (8) అనే ఇద్దరు సోదరులు మృతి చెందగా, నీళ్లు తెచ్చేందుకు అడవికి వెళ్ళి కొన ఊపిరితో ఆసుపత్రి పాలైన తల్లి వేలాది లచ్చు మంగళవారం కోలుకొని ఇంటికి చేరుకుంది.

05/04/2016 - 07:54

హైదరాబాద్, మే 3: ఖమ్మం జిల్లా, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు గెలుపొందుతానన్న నమ్మకం ఉంటే ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

Pages