S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/22/2016 - 06:08

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం పేరుతో ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో పెడుతోందని, ఇళ్లను నిర్మించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సోమవారం శాసనసభలో కాంగ్రెస్ విమర్శించింది.

03/22/2016 - 06:07

హైదరాబాద్: వేముల వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధమైనట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నమూనాను త్వరలోనే ముఖ్యమంత్రికి అందజేయనున్నట్టు తెలిపారు. శృంగేరీ పీఠాధిపతి సలహా మేరకు వేములవాడ క్షేత్ర అభివృద్ధికి తుది ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.

03/22/2016 - 06:06

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్నేషనల్, కార్పొరేట్, కానె్సప్ట్, టెక్ పేరిట చలామణి అవుతున్న ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు చేయడాన్ని నియంత్రిస్తూ త్వరలో ఒక విధానాన్ని ఖరారు చేస్తామని, దీనికి సంబంధించి 1994లో జారీ అయిన జీవో 1ను అమలు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 12 ఇంటర్నేషనల్ స్కూళ్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.

03/22/2016 - 05:58

హైదరాబాద్: ఆహార భద్రత కార్డులను జారీ చేయడానికి లబ్ధిదారుల డేటా గుర్తింపు ఎంపిక, డిజిటలైజేషన్ పూర్తి చేసి వంద శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేయడమైందని తెలంగాణ పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం బదులిస్తూ ఏప్రిల్ లేదా మే మాసంలో 89 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.

03/22/2016 - 05:34

వేములవాడ, మార్చి 21 : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి 29 వరకు అయిదురోజుల పాటుగా శివకళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయంలో భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

03/22/2016 - 05:33

హైదరాబాద్, మార్చి 21: గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన కుంభకోణంపై సిఐడి విచారణ ఇంకా కొనసాగుతుందని, ఇప్పటికే 250 మంది అధికారులను సస్పెండ్ అయ్యారని గృహా నిర్మాణ శాఖ మంత్రి ఎ ఇంద్రకరణ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు కూడా పాత్ర ఉందని తేలినప్పటికీ వారందరిని అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని ఆగామని మంత్రి అన్నారు.

03/22/2016 - 05:32

మహబూబ్‌నగర్, మార్చి 21: డబుల్ బెడ్‌రూం పథకంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ పతనం ప్రారంభమని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

03/22/2016 - 05:30

భద్రాచలం, మార్చి 21: చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

03/22/2016 - 05:29

హైదరాబాద్, మార్చి 21: ఎఐసిసి నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి, తన పుట్టిన రోజు సందర్భంగా తన నెల జీతాన్ని లక్షా 20 వేల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి ఆయన్ను అభినందించారు.

03/22/2016 - 05:27

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణలో తెరాస, కేంద్రంలో ఎన్‌డిఏ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కార్మిక వర్గం సమాయత్తం కావాలని ఆయన ఉద్బోధించారు.

Pages