S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/24/2016 - 06:30

హైదరాబాద్: ఢిల్లీ జెఎన్‌యు విద్యార్ధి నాయకుడు కన్నయ్య కుమార్‌కు బుధవారం రాత్రి పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోకి అనుమతించలేదు. దాంతో పోలీసులతో సిపిఐ నేతలు వాగ్యుద్ధానికి దిగినా ప్రయోజనం లేకపోయింది. ఎవరినీ క్యాంపస్‌లోకి అనుమతించవద్దని వైస్ ఛాన్సలర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాము కన్హయ్య కుమార్‌ను అనుమతించడం లేదని పోలీసులు, వర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది పేర్కొన్నారు.

03/24/2016 - 06:02

హైదరాబాద్, మార్చి : తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, సత్సంబంధాలతో పనులు సాధించుకోవడంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉందని సిఎస్ రాజీవ్ శర్మను ప్రధాన మంత్రి మోదీ అభినందించారు.

03/23/2016 - 18:12

హైదరాబాద్: హెచ్‌సియులో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ తల్లి రాధికను జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ బుధవారం పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను ఆయన తెలుసుకున్నారు. కాగా, కన్నయ్యను హెచ్‌సియులోకి అనుమతించేది లేదని క్యాంపస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కన్నయ్యకు వర్సిటీలో ప్రవేశం లేదని వైస్ చాన్సలర్ అప్పారావు అధికారికంగా ప్రకటించారు.

03/23/2016 - 18:11

హైదరాబాద్: హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ చాన్సలర్ అప్పారావుపై ఎలాంటి చర్యా తీసుకోకుండా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దారుణమని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులపై మరోసారి లాఠీలు ఝుళిపిస్తే తాము ఉపేక్షించేది లేదన్నారు.

03/23/2016 - 15:12

హైదరాబాద్: విషపూరిత వాయువుల బారి నుంచి తమను కాపాడాలని బాచుపల్లి వద్ద మైటాస్ హిల్‌కౌంటీ కాలనీ వాసులు బుధవారం వినూత్న పద్ధతిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. బొల్లారం తదితర ప్రాంతాల్లోని కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వాయువులతో తామ అనారోగ్యం పాలవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీలో ఉంటున్న వందలాది కుటుంబాలకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వాలంటూ వారు నిరసన తెలియజేస్తున్నారు.

03/23/2016 - 15:12

హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం తాను పోరాటం చేస్తున్నానని జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అతని తల్లిని పరామర్శించేందుకు తాను హైదరాబాద్ వచ్చానని తెలిపారు.

03/23/2016 - 14:31

ఖమ్మం : ఏప్రిల్‌ 15న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల వారి పెళ్లి కోసం ఆలయ అధికారులు, వేంద పండితులు ఏర్పాట్లను మొదలు పెట్టారు. పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. ఉత్సవ మూర్తులకు ఘనంగా ప్రత్యేక అభిషేకం, తలంబ్రాలు కలిపే కార్యక్రమం, ఘనంగా డోలోత్సవం నిర్వహించారు.

03/23/2016 - 12:00

హైదరాబాద్: జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. హెచ్‌సియులో జరిగే ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, కన్నయ్యను హెచ్‌సియులోకి రానీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ తల్లిని కన్నయ్య పరామర్శిస్తారు. హెచ్‌సియులో జరిగే నిరాహార దీక్షకు హాజరవుతారు.

03/23/2016 - 12:00

హైదరాబాద్: నగరంలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన హోలీ వేడుకల్లో ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ, డప్పులు వాయిస్తూ డాన్స్‌లు చేసిన కార్యకర్తల మధ్య బాబు సరదాగా గడిపారు.

03/23/2016 - 12:00

హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండడంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. వర్సిటీలో అన్ని గేట్లను మూసివేసి, విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించకుండా పోలీసులు మోహరించారు.

Pages