S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/22/2016 - 16:45

హైదరాబాద్: ఎపి సిఎం చంద్రబాబును టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మంగళవారం కలిశారు. నాగార్జునసాగర్ జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన సిఎంకు విజ్ఞప్తి చేశారని, దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిసింది.

03/22/2016 - 16:45

హైదరాబాద్: ప్రతిపక్ష సభ్యురాలు చేసిన వ్యాఖ్యపై మనస్తాపం చెంది తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేనివాళ్లు సభను నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ వ్యాఖ్యానించడంతో డిప్యూటీ స్పీకర్ కలత చెందారు. అరుణ వ్యాఖ్యలపై అధికార తెరాస సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపుగందరగోళం నెలకొంది.

03/22/2016 - 13:12

హైదరాబాద్: ఇకపై ఏ స్థాయిలోనూ ప్రత్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు దక్కేలా తాము పోరాటం చేస్తామన్నారు. ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఇతర వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.

03/22/2016 - 11:58

హైదరాబాద్: ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు సురేష్‌పై నిర్భయ కేసు నమోదైంది. రక్షణ కోరి పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితురాలిని నిందితుడు లైంగికంగా వేధించాడు. రాత్రి వేళ ఆమె ఇంటికి వచ్చిన సురేష్‌ను స్థానికులు పట్టుకుని బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు.

03/22/2016 - 11:57

హైదరాబాద్: వైస్ చాన్సలర్‌గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టడంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వీసీ చాంబర్ వద్ద ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వీసీ నివాసం వద్ద కూడా ఆందోళన చేశారు. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి ఆరోపణలున్నందున అప్పారావును వీసీ పదవి నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

03/22/2016 - 11:57

హైదరాబాద్: బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ సిబ్బంది మంగళవారం ఉదయం నగరంలోని వైస్రాయ్ హోటల్ ఎండి ప్రభాకరరెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. పెద్ద మొత్తంలో బకాయిలున్నందున బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వారు నినాదాలు చేశారు.

03/22/2016 - 11:55

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో అత్యాధునిక బ్యాడ్మింటన్ అకాడమీని పురపాలక శాఖామంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కెటిఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. భారత క్రీడాప్రాధికార సంస్థ, పుల్లెల గోపీచంద్ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

03/22/2016 - 06:12

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంపై భారీయెత్తున విద్యుత్ సబ్సిడీని భరించాలని నిర్ణయించింది. శనివారం ఇంధన శాఖ పద్దును మంత్రి ప్రవేశపెట్టారు. వ్యవసాయ సంబంధిత సబ్సిడీ నిమిత్తం రూ. 4470.10 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 20.74 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా విద్యుత్ సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తారు.

03/22/2016 - 06:11

హైదరాబాద్: అమెరికాలోని తెలంగాణవాసులంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, సమైక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సూచించారు.

03/22/2016 - 06:09

హైదరాబాద్/కాచిగూడ: మీడియా సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు అన్నారు. ‘నవ తెలంగాణ’ దినపత్రిక తొలి వార్షికోత్సవం సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఇందులోభాగంగా ‘పౌర సమాజం-మీడియా పాత్ర’ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ కె చంద్రు మాట్లాడుతూ అమెరికాలాగ మన దేశంలో మీడియాకు ఎక్కువగా స్వేచ్ఛ లేదన్నారు.

Pages