S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/20/2019 - 22:40

సూర్యాపేట, జూలై 20: మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శమని, లౌకికవాదాన్ని పరిరక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. సెక్యూలరిజం పరిరక్షణ విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తారన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పబ్లిక్‌క్లబ్‌లో నిర్వహించిన హజ్ యాత్రికుల వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

07/19/2019 - 23:44

హైదరాబాద్, జూలై 19: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంపై రాష్ట్రంలో విద్యాశాఖ సీనియర్ అధికారులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషీ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి ఒక నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

07/19/2019 - 23:41

హైదరాబాద్, జూలై 19: రాష్ట్రంలో మూడు విడతల్లో నిర్వహించిన డిగ్రీ అడ్మిషన్లలో సీట్లు పొందని వారు అవకాశాలను కోల్పోరాదనే భావనతో వారికోసం తాజాగా మరోమారు కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఇందుకోసం అవసరమైతే నిబంధనలు సరళతరం చేస్తామని అన్నారు. శనివారం నాడు దోస్త్ కమిటీ సమావేశం జరుగుతుందని, ఈ భేటీలో తదుపరిషెడ్యూలు ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు.

07/19/2019 - 23:41

న్యూఢిల్లీ, జూలై 19: తెలుగులో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. షోను నిలిపి చేయాలని నటి గాయత్రి గుప్తా, యాంకర్ శే్వతారెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్ షో పేరిట కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని మండిపడ్డారు. ఇదే విషయంపై తాము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పిటిషన్ దాఖలు చేసినట్టు వారు వెల్లడించారు.

07/19/2019 - 23:40

హైదరాబాద్, జూలై 19: ఇంగ్లీషు ఫారెన్ లాంగ్వేజేస్ యూనివర్శిటీ , బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం నిర్వహించేందుకు ప్రాధమికంగా అంగీకరించాయి. ఈ ప్రోగ్రాంకు సంబంధించి త్వరలో ఇరు సంస్థలూ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తాయని వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ తెలిపారు. బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జానక పుష్పనాధన్ శుక్రవారం నాడు వీసీతో చర్చలు జరిపారు.

07/19/2019 - 23:39

హైదరాబాద్, జూలై 19: టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి , ఈసీఐఎల్ సహకారంతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు వాతావరణ పరిశోధన కార్యక్రమాన్ని చేపట్టారు. టీఐఎఫ్‌ఆర్ ప్రాంగణంలో 15 మంది సభ్యుల గురుకుల విద్యార్థుల బృందం అధిక ఎత్తులో ఎగిరే స్వీరోశాట్-1 బెలూను ప్రయోగించి అందరి మన్ననలు పొందారు.

07/19/2019 - 23:39

హైదరాబాద్/రాజేంద్రనగర్, జూలై 19: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఐకార్ ప్రకటించిన ర్యాంకుల్లో దక్షిణాది వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానం దక్కింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆరో స్థానాన్ని సాధించింది. 33 అంశాల ఆధారంగా వ్యవసాయ పరిశోధనా మండలి ఈ ర్యాంకులను కేటాయించింది. ర్యాంకుల వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీలో విడుదల చేశారు.

07/19/2019 - 23:20

హైదరాబాద్, జూలై 19: మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లు పెంచేందుకు అవసరమైన బలమైన అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

07/19/2019 - 23:19

విజయవాడ, జూలై 19: పర్యావరణ పరిరక్షణ బాగంగా సీఎం జగన్ ఆదేశాల మేర రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో కాలుష్య రహిత బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా స్థానిక ఆర్టీసీ భవన్‌లో శుక్రవారం సదస్సు జరిగింది. సంస్థ ఎండీ ఎన్‌వి సురేంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో విద్యుత్ బస్సుల తయారీదారులు సంబంధిత సాంకేతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

07/19/2019 - 23:19

హైదరాబాద్, జూలై 19: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మధ్య శుక్రవారం ఆసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. కోమటిరెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తోండగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరితే తప్పుపట్టి మీరెట్లా బీజేపీకి పోతారు’ అని ప్రశ్నించారు.

Pages