S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/09/2019 - 04:47

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రం బీసీల సంక్షేమానికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రశంసనీయంగా ఉన్నాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్‌లాల్ సహాని పేర్కొన్నారు. కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి, సభ్యులు కౌశలేంద్ర సింగ్ పాటిల్, సుధాయాదవ్, ఆచారి తల్లోజులతో కలిసి కమిషన్ సోమవారం నాడు తెలంగాణ పర్యటనకు వచ్చింది.

07/09/2019 - 04:47

మహబూబ్‌నగర్, జూలై 8: కర్నాటక రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షోభానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, సంక్షోభానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలో పర్యటించారు.

07/09/2019 - 04:44

ఆదిలాబాద్, జూలై 8: మహా రాష్ట్ర లోని పొరుగు చంద్రాపూర్ జిల్లా చిమ్మూర్ తాలూకా తాడోబా పులుల సంరక్షణ అటవీ ప్రాంతంలో ఒకే సంతతికి చెందిన మూడు పులులు మృతి చెందిన ఘటన అటవీశాఖలో అలజడి రేపింది. ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా ప్రాణహిత సరిహద్దు ఆవల గల చంద్రాపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ రేంజ్ పరిధిలో మూడు పులులు మృతి చెందిన కళేబరాలను సోమవారం అటవీ అధికారులు గుర్తించారు. వేటగాళ్లు ఓ పథకం ప్రకారం..

07/09/2019 - 04:43

హైదరాబాద్, జూలై 8: రాజకీయ జోక్యంతోనే విద్యారంగం గాడి తప్పిందని, ప్రపంచంలో అగ్రగామి వర్శిటీల్లో ఒక్కటి కూడా భారత్‌లో లేకపోవడం విచారకరమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ కే సారస్వత్ పేర్కొన్నారు. నాణ్యతా నిర్ధారణాంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సారస్వత్ సోమవారం పాత్రికేయులతో మాట్లాడారు. దేశంలో సమున్నత విద్యాసంస్థలు ఏర్పాటు కావల్సి ఉందని అన్నారు.

07/09/2019 - 04:43

హైదరాబాద్, జూలై 8: ప్రాధమిక స్థాయి నుండి పునాదులు వేయకుండా ఉన్నత విద్యారంగంలో అకస్మాత్తుగా పెనుమార్పులు సాధ్యం కాదని, చదువంటే కేవలం ఉద్యోగం కోసమేనన్న భావన పోవాలని విద్యా శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అక్రిడిటేషన్ - క్వాలిటీ- ర్యాంకింగ్ రోడ్ మ్యాప్ ’ అనే అంశంపై జరిగే రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/09/2019 - 04:40

హైదరాబాద్, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా వైఎస్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని సోమవారం గాంధీభవన్, ఇందిరాభవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నివాళులు ఆర్పించారు.

07/09/2019 - 04:38

హైదరాబాద్, జూలై 8: గడువులోగా రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు అన్నీ జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అక్రిడిటేషన్ పొందాల్సిందేనని లేకుంటే ప్రభుత్వ నిధులు నిలిచిపోతాయని, అనుబంధ గుర్తింపు రద్దవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి పేర్కొన్నారు.

07/09/2019 - 04:36

హైదరాబాద్, జూలై 8: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్టవ్య్రాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీలతో సోమవారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

,
07/09/2019 - 03:58

నిజామాబాద్, జూలై 8: మహా రాష్ట్ర లోని ప్రాజెక్టులు నిండి, అదనపు నీరు వస్తేనే మన ప్రాజెక్టులకు జల కళ వచ్చే పరిస్థితి ఉండటంతో పొరుగు రాష్ట్రంలోని అదనపు జలాల కోసం ఆశగా చూడాల్సిన పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నాయ.

07/09/2019 - 03:48

మహబూబాబాద్, జూలై 8: పోలీసులు లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం, రామచంద్రాపురం మధ్య ఉన్న ఉడుముల ఒర్రె బ్రిడ్జి కింద అమర్చిన ఆరు మందుపాతర్లను మహబూబాబాద్ జిల్లా పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకొన్నారు. మావోయిస్టు ఎన్‌టిఎస్‌జెడ్‌సి కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణకు చెందిన ఇద్దరు కొరియర్లను అరెస్ట్ చేశారు.

Pages