S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/06/2019 - 23:44

తాడ్వాయి, జూలై 6: వచ్చే ఏడాది జరిగే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని ములుగు కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. శనివారం మేడారంలోని వాచ్‌టవర్‌పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/06/2019 - 23:42

హైదరాబాద్, జూలై 6: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు వ్యవసాయం ఆధారంగా చిన్న, మధ్యతరహాలో 15 యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’లకు ఆర్థిక సాయం చేసే పథకంపై సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ సమావేశం నిర్వహించారు.

07/06/2019 - 23:40

భూపాలపల్లి, జూలై 6: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జింకల పార్కులో కలకత్తాకు చెందిన బాలకార్మికులు పని చేస్తున్నారనే సమాచారంతో సీఐడీ డీఎస్పీ రవికుమార్ వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం జింకల పార్కులో పని చేస్తున్న ఆరుగురు బాలకార్మికులను విచారించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

07/07/2019 - 03:15

హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 53.59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పరీక్షల బోర్డు సంచాలకుడు బి సుధాకర్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. గత నెల 10వ తేదీ నుండి 24 వరకూ నిర్వహించిన పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌ను జూన్ 28 నాటికి పూర్తి చేశామని ఆయన చెప్పారు.

07/06/2019 - 23:36

కొయిలకొండ, జూలై 6: మండలంలోని సూరారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై తేనె టీగలు దాడి చేయడంతో 25 మంది అస్వస్థత కావడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుల సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆడుకోవడానికి వెళ్లడం జరిగింది.

07/06/2019 - 17:31

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నెల రోజులు సీఎంగా పనిచేసిన మాజీ సీఎం నాదేండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంషాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా పలువురు పార్టీలో చేరారు.

07/06/2019 - 17:30

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణలో అమిత్‌షా పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్‌షాకు గవర్నర్ నరసింహాన్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయన పహాడీ షరీఫ్‌లోని రంగనాయకుల తండాలో నివశిస్తున్న బీజేపీ క్రియాశీల కార్యకర్త సోనీభాయ్ ఇంటికి చేరుకున్నారు.

07/06/2019 - 12:46

నిజామాబాద్: నిన్న నాగారంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మృతదేహాలు ఈ రోజు కుంటలో కనిపించాయి. నాగారం ఏజీ క్వార్టర్స్ సమీపంలోని ఉర్దూ పాఠశాలలో చదువుతున్న మహ్మద్ అజార్, ఆర్పాజ్‌ఖాన్, సలీం వరుసగా మూడు, నాలుగు తరగతులు చదువుతున్నారు. శుక్రవారంనాడు నమాజ్ కోసం అని స్కూలు నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి వీరు కనిపించటం లేదు. ఈరోజు వీరి మృతదేహాలు కుంటలో కనిపించాయి.

07/05/2019 - 23:49

నల్లగొండ, జూలై 5: పాడి పంటల విధానంతోనే రైతులు అభివృద్ధి చెంది తెలంగాణ సుభిక్షమవుతుందని సీఎం కేసీఆర్ విశ్వాసమని అందుకు అనుగుణంగానే పశుపోషణ, గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

07/05/2019 - 23:48

సూర్యాపేట, జూలై 5: గ్రామీణ వికాసం స్థానికసంస్థలతోనే సాధ్యమన్న భావనతో సీఎం కేసీఆర్ స్థానికసంస్థలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ తొలి పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం శుక్రవారం జిల్లాకేంద్రంలోని నూతన జడ్పీ భవనంలో అట్టహాసంగా జరిగింది.

Pages