S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/08/2019 - 23:40

హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో ప్రధానమైన ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్ర మంత్రులు ఇకనుండి పరిపాలనాపరమైన అంశాలపై దృష్టికేంద్రీకరించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏవోఒకరమైన ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి, తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మధ్యలో శాసనమండలిలో కొన్ని ఖాళీలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి.

06/08/2019 - 23:36

జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లోనూ గులాబీ విరబూసింది. రాష్ట్రంలోని మండల పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లోనూ పునరావృతం అయంది. కారుజోరుకు తిరుగులేకుండా పోయంది. టాప్‌స్పీడ్‌లో దూసుకుపోయన కారును అడ్డుకునే పార్టీయే లేకుండా పోయంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది.

06/08/2019 - 23:24

ఆదిలాబాద్,జూన్ 8: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జడ్పీ పీఠాలను తెరాస కైవసం చేసుకోగా కొత్తగా ఏర్పడిన మూడు జిల్లాల్లోనూ తొలిసారిగా మహిళా అభ్యర్థులే జడ్పీ చైర్‌పర్సన్‌లుగా కొలువుదీరారు.

06/08/2019 - 23:22

వరంగల్, జూన్ 8: ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షలు ఒక నాటకమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శనివారం సాయంత్రం వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

06/07/2019 - 23:48

నర్సంపేట, జూన్ 7: మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది. మెజార్టీ ఎంపీటీసీలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తన సభ్యులను కాపాడుకోలేక చేజేతులారా టీఆర్‌ఎస్‌కు అప్పగించింది. నర్సంపేట రూరల్ మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆరు ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఐదు ఎంపీటీసీ స్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది.

06/07/2019 - 23:48

సంగారెడ్డి, జూన్ 7: మంజీర నదిపై వ్యవసాయం, తాగునీటి అవసరాలకోసం నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయి అన్ని వర్గాలవారిని కలవరపెడుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల గతంలో కూడా సింగూర్ ప్రాజెక్టు ఎండిపోయినా ఇంతటి దుర్భరమైన పరిస్థితులను చవిచూడలేదని ఆయకట్టుదారులు, ప్రజలు వాపోతున్నారు. మంజీర నీరు అంటే జంటనగరాల వాసులు అమృతంతో సమానంగా భావించే వారు.

06/07/2019 - 23:47

సిద్దిపేట టౌన్, జూన్ 7: రాష్ట్రానికే రోల్ మోడల్‌గా..పర్యాటక ప్రాంతమైన సిద్దిపేట కోమటి చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి (వేలాడే వంతెన) ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట కోమటి చెరువును సందర్శించిన ఆయన మాట్లాడుతూ లక్నవరంలో ఉన్న మాదిరిగా, కోమటి చెరువుపై వేలాడే వంతెన ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

06/07/2019 - 23:43

హైదరాబాద్, జూన్ 7: మూడింట రెండు వంతుల మెజారిటీ సభ్యుల అంగీకారంతో రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. సీఎల్పీ చేసిన తీర్మానం ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా తమను విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ మండిపడింది.

06/07/2019 - 23:43

హైదరాబాద్, జూన్ 7: ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాల పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, ఎమ్మెల్యేల కొనుగోలుతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిందని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమవాశంలో మాట్లాడుతూ కేసీఆర్ గులాంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. నిబంధనలు పాటించకుండా సీఎల్‌పీనీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారన్నారు.

06/07/2019 - 23:43

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో 5 గిగావాట్ల బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ యూనిట్ స్థాపనకు అనువుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, అవుటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో 200 ఎకరాలు కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

Pages