S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2018 - 02:04

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7 న జరిగే పోలింగ్, ఆ తర్వాత జరిగే కౌంటింగ్ పూర్తయ్యే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓ.పీ. రావత్ హెచ్చరించారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై రావత్ చర్చించారు.

11/06/2018 - 02:02

గజ్వేల్, నవంబర్ 5: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోజూస్తున్న మహా కూటమిని పాతరేద్దామని మాజీ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ముదిరాజ్‌ల ఘర్జనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఉద్యమ పార్టీగా, పదవులను తృణప్రాయంగా వదిలిన టీఆర్‌ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని, తెలంగాణలో నూకలు చెల్లిన టీడీపీకి ఇక్కడ ఏమి పని అని నిలదీశారు.

11/06/2018 - 02:00

హైదరాబాద్, నవంబర్ 5: 2019 జూన్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. వివిధ దేశాల నుండి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారని విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్, అంతర్జాతీయ విత్తన సదస్సు నోడల్ ఆఫీసర్ డాక్టర్ కే.

11/06/2018 - 01:59

హైదరాబాద్, నవంబర్ 5: హైకోర్టు విభజనకు బీజేపీ ఎనలేని కృషి చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు నుండి హైకోర్టు విభజనకు బీజేపీ కృషి చేసిందని అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో హైకోర్టు విభజనకు కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు.

11/06/2018 - 01:58

హైదరాబాద్, నవంబర్ 5: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ ముస్లీంలీగ్ మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌తో మజ్లీస్ పార్టీ జతకట్టిన వేళ ఇండియన్ ముస్లీంలీగ్ తమ పార్టీకి మద్దతునివ్వడం శుభపరిణామమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా తెలిపారు. టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

11/05/2018 - 16:20

హైదరాబాద్: తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకే మహాకూటమిని ఏర్పాటుచేశామని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కేసీఆర్ గద్దె దిగటం ఖాయమని అన్నారు. చంద్రబాబును విమర్శించే ముందు తెలంగాణలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని అన్నారు.

11/05/2018 - 12:53

యాదగిరిగుట్ట: తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ నుంచి వృద్ధాప్య పింఛన్ రూ.2016 ఇస్తామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన భువనిగిర జిల్లా యాదగిరి పల్లెలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు రూ.3016ల పింఛన్ అందజేస్తామని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రూ.ల రుణమాఫీతో పాటు రైతుబంధును రూ.10వేలుకు పెంచుతామని అన్నారు.

11/05/2018 - 12:52

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని ఓ చెప్పుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్రినాక ఠాణాలోని పరిధిలోని ఫలక్‌నుమా ఫోస్ట్ఫాసులో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళాలతో మంటలను అదుపులోనికి తెచ్చారు.

11/05/2018 - 05:47

హైదరాబాద్, నవంబర్ 4: రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుటుంబ పాలన నడుస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీ-డిజైన్ చేపట్టారని ఆయన విమర్శించారు.

11/05/2018 - 05:52

హైదరాబాద్, నవంబర్ 4: ‘చట్ట సభల్లో పోటీ చేసేందుకు మాకూ కోటా ఇవ్వండి..’ అని ఐఎన్‌టీయుసి వర్కింగ్ కమిటీ తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఐఎన్‌టీయుసి జాతీయ అధ్యక్షుడు జీ. సంజీవ రెడ్డి అధ్యక్షతన ఆదివారం వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Pages